HAPPY BIRTHDAY RAM CHARAN MEGA POWER STAR FILM CAREER 2021 VERY SPECIAL DUE TO HIS ACT TWO FILM ACHARYA RRR ROUDRAM RANAM RUDHIRAM RELEASE SAME CALENDER YEAR TA
Ram Charan: ఇన్నేళ్ల కెరీర్లో రామ్ చరణ్ ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్.. మెగా ఫ్యాన్స్ ఖుషీ..
రామ్ చరణ్ (Twitter/Photo)
Mega Power Star Ram Charan: రామ్ చరణ్ ఇన్నేళ్ల కెరీర్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్..దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు ఇన్నేళ్ల రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు మెగాభిమానులు.
Mega Power Star Ram Charan: రామ్ చరణ్ ఇన్నేళ్ల కెరీర్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్..దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు ఇన్నేళ్ల రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు మెగాభిమానులు. రామ్ చరణ్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘చిరుత’ మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్డాడు. ఆ తర్వాత ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. 2007లో టాలీవుడ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆ తర్వాత ఒకే యేడాదిలో రెండు సినిమాలు మాత్రం రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఐతే.. రామ్ చరణ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టాకా.. 2008, 2011,2020 కాలెండర్ ఇయర్స్‌లో రామ్ చరణ్ నటించిన సినిమాలేవి విడుదల కాలేదు. మరోవైపు 2017లో కూడా చరణ్ హీరోగా నటించిన సినిమా విడుదల కాలేదు. కానీ తన తండ్రి చిరంజీవి హీరోగా రామ్ చరణ్.. నిర్మిస్తూ తెరకెక్కించిన ‘ఖైదీ నెంబర్ 150’లో ఓ పాటలో అతిథి పాత్రలో మెరిసాడు. ఇక 2019లో మాత్రం హీరోగా ‘వినయ విధేయ రామ’ సినిమాతో పలకరించాడు. అదే యేడాది తన తండ్రి చిరంజీవి హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాతగా పలకరించాడు.
కానీ ఇప్పటి వరకు ఒకే కాలండర్ ఇయర్లో రెండు సినిమాలు విడుదల చేసిన దాఖలాలు మాత్రం లేవు. కానీ 2021లో మాత్రం రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అందులో తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమా మాత్రం మే 13న విడుదల కానుంది.
ఒకే కాలండర్ ఇయర్లో విడుదల కానున్న ఆచార్య, ఆర్ఆర్ఆర్ (Twitter/Photo)
మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ రౌద్రం రణం రుధిరం’ సినిమాను ఈ యేడాది అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ రకంగా ఒకే కాలండర్ ఇయర్లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కావడం అనేది ఇదే మొదటిసారి. ఈ రకంగా రామ్ చరణ్ 2021లో రెండు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం పక్కా అని మెగాభిమానులు డిసైడ్ అయ్యాడు.
ఆచార్యలో రామ్ చరణ్ (Twitter/Photo)
ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంతో పాటు తండ్రి మెగాస్టార్ చిరంజీవితో పూర్తి స్థాయిలో నటించాలనే కోరిక కూడా ఈ సినిమాతో నెరవేరతుంది. మరోవైపు రామ్ చరణ్ తన కెరీర్లో మొదటిసారి ఓ డైరెక్టర్ దర్శకత్వంలో రెండోసారి నటిస్తున్నాడు. అది రాజమౌళి కావడం విశేషం. మొత్తంగా 2021 రామ్ చరణ్ ఫిల్మ్ కెరీర్లో వెరీ స్పెషల్ అని చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.