HBD RamCharan: ఆ విషయంలో రామ్ చరణ్ మెగా ధీరుడే..

మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 27, 2020, 6:44 AM IST
HBD RamCharan: ఆ విషయంలో రామ్ చరణ్ మెగా ధీరుడే..
రామ్ చరణ్ పుట్టినరోజు (Twitter/Photo)
  • Share this:
మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముందుగా ఈ మెగా వారసుడు న‌టుడే కాద‌న్నారు.. కానీ ఇప్పుడు న‌టుడంటే ఇలా ఉంటాడురా అనిపించాడు. చిరంజీవికి త‌గ్గ త‌న‌యుడు కాదు.. ప్ర‌యోగాలంటే భ‌య‌ప‌డ‌తాడు అన్నారు.. కానీ ఇప్పుడు కొత్త క‌థ‌లు ఉంటే ఆయ‌న రెడీ అంటూ ద‌ర్శ‌కుడే ఎగ‌బ‌డుతున్నారు. ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌లేడ‌ని హేళన చేసారు.. కానీ ‘రంగస్థలం’ అనే సినిమాతోనే త‌నెంత గొప్ప న‌టున్నో అంద‌రికీ చూపించాడు. బ్యాడ్ బాయ్ అంటూ విమ‌ర్శించారు.. కానీ ఇప్పుడు ఎంత మంచివాడో అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. అలా తన ఇమేజ్ మార్చుకున్నాడు.

Ram Charan Birthday Special.. Extraordinary journey of Mega Power Star in Tollywood pk.. న‌టుడే కాద‌న్నారు.. కానీ ఇప్పుడు న‌టుడంటే ఇలా ఉంటాడురా అనిపించాడు. చిరంజీవికి త‌గ్గ త‌న‌యుడు కాదు.. ప్ర‌యోగాలంటే భ‌య‌ప‌డ‌తాడు అన్నారు.. కానీ ఇప్పుడు కొత్త క‌థ‌లు ఉంటే ఆయ‌న రెడీ అంటూ ద‌ర్శ‌కుడే ఎగ‌బ‌డుతున్నారు. ram charan birthday,happy birthday ram charan,ram charan movies,ram charan twitter,ram charan upasana,ram charan facebook,ram charan birthday photos,ram charan birthday special,telugu cinema,ram charan rrr movie,ram charan jr ntr,రామ్ చరణ్,రామ్ చరణ్ బర్త్ డే,రామ్ చరణ్ పుట్టిన రోజు,రామ్ చరణ్ తెలుగు సినిమా,రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ ఎన్టీఆర్
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్


ఇలా ఒక్కో మైన‌స్ లెక్క‌లేసుకుంటూ వాటినే త‌న‌కు ప్ల‌స్‌లుగా మార్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్. అయినా తెలుగు నాట‌ ఈ పేరు తెలియ‌ని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. మార్చ్ 27న ఈయ‌న జ‌న్మ‌దినం. చిరుత సినిమాతో 13ఏళ్ల కింద ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు మెగా వార‌సుడు. చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈయ‌న తొలి సినిమా ‘చిరుత’తోనే స‌త్తా చూపించాడు.

happy Birthday Ram charan From chirutha to RRR Movie mega power star film journy,HBDRamCharan,rrr,rrr ram charan,ram charan rangasthalam,ram charan birthday,happy birthday ram charan,ram charan movies,ram charan twitter,ram charan upasana,ram charan facebook,ram charan birthday photos,ram charan birthday special,telugu cinema,ram charan rrr movie,ram charan jr ntr,రామ్ చరణ్,రామ్ చరణ్ బర్త్ డే,రామ్ చరణ్ పుట్టిన రోజు,రామ్ చరణ్ తెలుగు సినిమా,రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ ఎన్టీఆర్
రామ్ చరణ్ పుట్టినరోజు (Twitter/Photo)




ఈ చిత్రం అప్ప‌ట్లోనే దాదాపు 20 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌కు పూల బాట‌లు వేసింది. ఆ త‌ర్వాత రాజ‌మౌళి వ‌చ్చి ఏకంగా రామ్ చ‌ర‌ణ్ బాధ్య‌త తీసుకున్నాడు. మ‌గ‌ధీర సినిమాతో కేవ‌లం ఒకే ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న రామ్ చ‌ర‌ణ్ అప్ప‌టి వ‌ర‌కు ఉన్న 75 ఏళ్ల తెలుగు సినిమా చ‌రిత్ర రికార్డుల‌ను తిర‌గ‌రాసాడు. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలిసారి 75 కోట్ల మార్క్ అందుకున్న హీరోగా స‌రికొత్త హిస్ట‌రీ క్రియేట్ చేసాడు.

Ram Charan Birthday Special.. Extraordinary journey of Mega Power Star in Tollywood pk.. న‌టుడే కాద‌న్నారు.. కానీ ఇప్పుడు న‌టుడంటే ఇలా ఉంటాడురా అనిపించాడు. చిరంజీవికి త‌గ్గ త‌న‌యుడు కాదు.. ప్ర‌యోగాలంటే భ‌య‌ప‌డ‌తాడు అన్నారు.. కానీ ఇప్పుడు కొత్త క‌థ‌లు ఉంటే ఆయ‌న రెడీ అంటూ ద‌ర్శ‌కుడే ఎగ‌బ‌డుతున్నారు. ram charan birthday,happy birthday ram charan,ram charan movies,ram charan twitter,ram charan upasana,ram charan facebook,ram charan birthday photos,ram charan birthday special,telugu cinema,ram charan rrr movie,ram charan jr ntr,రామ్ చరణ్,రామ్ చరణ్ బర్త్ డే,రామ్ చరణ్ పుట్టిన రోజు,రామ్ చరణ్ తెలుగు సినిమా,రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ ఎన్టీఆర్
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్


ఆరెంజ్ సినిమాతో న‌టుడిగా నిరూపించుకున్నా.. తొలి ఫ్లాప్ అందుకున్నాడు. అయితే వెంట‌నే ర‌చ్చ‌, నాయ‌క్, ఎవ‌డు లాంటి మాస్ సినిమాల‌తో మ‌ళ్లీ విజ‌యాలు అందుకున్నాడు మెగా వార‌సుడు. కానీ ప్ర‌యోగాలు చేయ‌డ‌నే విమ‌ర్శ‌లు మాత్రం అందుకున్నాడు. మాస్ సినిమాలు.. రొటీన్ క‌థ‌లు చేస్తాడంటూ చ‌ర‌ణ్ కెరీర్‌తో ఆడుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇక జంజీర్ సినిమాతో హిందీకి వెళ్లి అక్క‌డా విమ‌ర్శ‌లు తెచ్చుకున్నాడు చ‌ర‌ణ్. అలనాటి అమితాబ్ క్లాసిక్‌ను చెడగొట్టాటంటూ విమర్శలు మూటగట్టుకున్నాడు. ఆ వెంట‌నే గోవిందుడు అంద‌రివాడేలే అంటూ తొలిసారి ఫ్యామిలీ డ్రామాలో ఒదిగిపోయాడు.
ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ (RRR motion poster)
ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ (RRR motion poster)


బ్రూస్లీ లాంటి ఫ్లాపులు వెంట‌బ‌డినా ధృవ సినిమాతో విజ‌యం అందుకున్నాడు. ఇక రెండేళ్ల క్రితం వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాతో మ‌రోసారి ఇండ‌స్ట్రీ రికార్డుల‌కు చెక్ పెట్టాడు రామ్ చ‌ర‌ణ్. ఈ సినిమాతో అప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ న‌ట‌న‌పై ఉన్న అనుమానాల‌న్నీ తీరిపోయాయి. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంతో రూ.125 కోట్ల మార్క్ అందుకున్నాడు చ‌ర‌ణ్.

Ram Charan Birthday Special.. Extraordinary journey of Mega Power Star in Tollywood pk.. న‌టుడే కాద‌న్నారు.. కానీ ఇప్పుడు న‌టుడంటే ఇలా ఉంటాడురా అనిపించాడు. చిరంజీవికి త‌గ్గ త‌న‌యుడు కాదు.. ప్ర‌యోగాలంటే భ‌య‌ప‌డ‌తాడు అన్నారు.. కానీ ఇప్పుడు కొత్త క‌థ‌లు ఉంటే ఆయ‌న రెడీ అంటూ ద‌ర్శ‌కుడే ఎగ‌బ‌డుతున్నారు. ram charan birthday,happy birthday ram charan,ram charan movies,ram charan twitter,ram charan upasana,ram charan facebook,ram charan birthday photos,ram charan birthday special,telugu cinema,ram charan rrr movie,ram charan jr ntr,రామ్ చరణ్,రామ్ చరణ్ బర్త్ డే,రామ్ చరణ్ పుట్టిన రోజు,రామ్ చరణ్ తెలుగు సినిమా,రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ ఎన్టీఆర్
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్


ఇక ఇప్పుడు రాజ‌మౌళి క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నడు. అగ్నిలా ప్రజ్వరిల్లే పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ మాత్రం జలతత్త్వం పాత్రలో నటించాడు.తొలిసారి రామ్ చరణ్ నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది.

happy Birthday Ram charan From chirutha to RRR Movie mega power star film journy,HBDRamCharan,rrr,rrr ram charan,ram charan rangasthalam,ram charan birthday,happy birthday ram charan,ram charan movies,ram charan twitter,ram charan upasana,ram charan facebook,ram charan birthday photos,ram charan birthday special,telugu cinema,ram charan rrr movie,ram charan jr ntr,రామ్ చరణ్,రామ్ చరణ్ బర్త్ డే,రామ్ చరణ్ పుట్టిన రోజు,రామ్ చరణ్ తెలుగు సినిమా,రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ (Twitter/Photo)


మొత్తానికి బ్రిటిష్ ప్రభుత్వంలపై కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కట్టలు తెచ్చుకున్న రౌద్రంతో వీళ్లిద్దరు కలిసి చేయాలనుకున్న రణం. ఆ యుద్ధంలో ఈ యోధులు అర్పించిన రుధిరం. అంటే రక్తం చిందించడం అనే అర్ధంతో ఈ సినిమాకు ‘రౌద్రం రణం రుధిరం’ టైటిల్ పెట్టారు. మొత్తానికి రాజమౌళి నుంచి ఈ వస్తోన్న ఈచిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుంగా జనవరి 8న విడుదల కానుంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. మొత్తానికి ఈ 13 ఏళ్ల జ‌ర్నీలో ఎన్నో రికార్డులు అందుకున్న చ‌ర‌ణ్.. 2020, మార్చ్ 27తో 34 ఏళ్లు పూర్తి చేసుకుని 35లోకి అడుగు పెడుతున్నాడు.
First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు