• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HAPPY BIRTHDAY RAM CHARAN CHIRANJEEVI ACHARYA MOVIE RAM CHARAN AS SIDDHA LOOK RELEASED THIS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Ram Charan Look In Acharya: ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్ లుక్ రిలీజ్.. తండ్రితో సిద్ధగా అదిరిపోయిన మెగా పవర్ స్టార్..

Ram Charan Look In Acharya: ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్ లుక్ రిలీజ్.. తండ్రితో సిద్ధగా అదిరిపోయిన మెగా పవర్ స్టార్..

‘ఆచార్య’లో అన్నలుగా చిరంజీవి,రామ్ చరణ్ (Twitter/Photo)

Ram Charan Look In Acharya As Siddha | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథను మలుపు తిప్పే సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సిద్దగా రామ్ చరణ్‌ లుక్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్.

  • Share this:
    Ram Charan Look In Acharya | రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య సినిమా నుంచి సిద్ధగా రామ్ చరణ్ లుక్‌‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథను మలుపు తిప్పే సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. తండ్రి తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయి  హీరోలుగా నటిస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సినిమా బిజినెస్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ఇప్పటికే చెర్రీ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్‌ను ఒక రోజు ముందు విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ‘ఆచార్య’లో సిద్ధగా చరణ్ లుక్ ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అందుకు తగ్గట్టే విడుదల చేసిన లుక్‌ ఎంతో టెర్రిఫిక్‌గా ఉంది. ఈ లుక్‌లో చిరంజీవి,రామ్  చరణ్‌లు చేతిలో గన్నులు పట్టుకొని అన్నలుగా ఉన్నగా లుక్ బాగుంది. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ‘ఆచార్య’లో చిరంజీవి, రామ్ చరణ్ (Twitter/Photo)


    ఈ సినిమా కోసం రామ్ చరణ్ .. 20 రోజుల డేట్స్ కేటాయించాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. సిద్ధా అనే స్టూడెంట్ యూనియన్ లీడర్‌ ఎందుకు నక్సలైట్‌గా మారాడనేది ఈ సినిమాలో కీలకం. ఇప్పటికే మారేడుమిల్లిలో రామ్ చరణ్, పూజా హెగ్డేలపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు సినిమాలో 45 నిమిషాలకు పైగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రాజమండ్రి, ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఈ సినిమాను షూట్ చేసారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయినట్టు సమాచారం.

    ‘ఆచార్య’లో చిరంజీవి, రామ్ చరణ్ (Twitter/Photo)


    ఈ సినిమాను దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దేవాలయం సెట్ కోసం  దాదాపు 10 కోట్లను ఖర్చు చేసారు. హైద‌రాబాద్ శివారులోని కోకాపేట్‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ చిత్రం కోసం టెంపుల్ టౌన్ సిటీ ఫోటోలు కూడా చిరు షేర్ చేసాడు. క‌ళా ద‌ర్శ‌కుడు సురేష్ నేతృత్వంలో రూపొందించిన ఈ టెంపుల్ సిటీ సెట్‌కి సంబంధించి చిరంజీవి షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇక్కడే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసాడు కొరటాల శివ. ఇప్పటికే  ఈ సినిమా సెట్స్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్న ఫోటోలు సెట్స్ నుంచి లీకయ్యాయి. ఇల్లెందు మైనింగ్ యూనిట్‌లో జరిగిన ఈ షూట్‌కు సంబంధించిన ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    acharya movie shooting,chiranjeevi acharya movie updates,chiranjeevi twitter,chiranjeevi acharya,chiranjeevi acharya movie location stills,megastar chiranjeevi,chiranjeevi ram charan shooting for acharya,chiranjeevi 152 movie,acharya shooting in east godavari maredupally forest,acharya movie chiranjeevi,chiranjeevi 152 movie release date,acharya movie teaser,చిరంజీవి ఆచార్య,ఆచార్య రిలీజ్ డేట్,చిరంజీవి ఆచార్య షూటింగ్ పిక్స్,రామ్ చరణ్ చిరంజీవి ఆచార్య షూటింగ్ ఫోటోలు
    చిరంజీవి ఆచార్య షూటింగ్ (Chiranjeevi Acharya Shooting)


    దాదాపు రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఆచార్య థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే..  తెలంగాణ (నైజాం)లో ఇప్పటికే వరంగల్ శ్రీను రూ.  42 కోట్లకు ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రా, రాయలసీమ (సీడెడ్) కలిపి రూ. 60 కోట్లకు పైగానే ఆచార్య బిజినెస్ జరుగుతుంది. మరోవైపు ఓవర్సీస్ రూ. 20 కోట్ల  బిజినెస్ చేసినట్టు సమాచారం. ఆచార్య సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో తొలిసారి పూర్తి స్థాయిలో తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండంపై మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: