Happy Birthday Rajamouli: అపజయం ఎరుగని దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. అన్ని తానై.. అంతా తానై..

Rajamouli Photo : Twitter

Happy Birthday Rajamouli | తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న కూడా అతడే. మాస్ పల్స్ తెలిసిన దర్శక ఛత్రపతి. హీరోయిజాన్ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసి కథానాయికుడు ఇమేజ్ ను పెంచే దర్శకధీరుడు. ఈ రోజు రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఆయన ప్రస్థానంపై న్యూస్18 తెలుగు స్పెషల్ ఫోకస్..

 • Share this:
  Rajamouli | తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న కూడా అతడే. మాస్ పల్స్ తెలిసిన దర్శక ఛత్రపతి. హీరోయిజాన్ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసి కథానాయికుడు ఇమేజ్ ను పెంచే దర్శకధీరుడు.స్టోరీ ఎలాంటిదైనా తన టాలెంట్ తో మెస్మరైజ్ చేసే గ్రేట్ టెక్నీషియన్. తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి. హీరోలతో సమానమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న క్రేజీ డైరెక్టర్. ఆయనే దర్శకమౌళి...రాజమౌళి. నేడు ఈ సూపర్ సక్సెస్ డైరెక్టర్ బర్త్ డే ...రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్ కొన్న టికెట్ కు సరిపడా వినోదం గ్యారంటీ. తొలి సినిమా స్టూడెంట్ నెం.1 నుండి బాహుబలి 2 వరకు ప్రతి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉన్నాడు. బాహుబలి సిరీస్‌తో హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని టాలీవుడ్‌ వైపు తిరిగిచూసేలా చేసారు. తెలుగు వాడి సత్తాను జాతీయ..అంతర్జాతీయ స్థాయిలో రెప రెపలాడించాడు. కథ ఏదైనా.. హీరో ఎవ్వరైనా సరే బాక్సాఫీస్ బద్దలు కావల్సిందే.

  రాజమౌళి (Twitter/Photo)


  సినిమా అంటే కేవలం హీరో, కథ మాత్రమే కాదు.. క్రియేటివిటీ అని చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి అంటే పేరు కాదు... ఇట్సే బ్రాండ్....అందుకే రాజమౌళి అనే పేరు మీదే బిజినెస్ జరిగేంతగా పాపులర్ అయ్యారు. రాజమౌళి ఈ తరం హీరోలకే హీరో. ఆయన సినిమాలో హీరోగా చేయాలనుకోవడం నేటి తరం నటులకు ఒక మధురస్వప్నం. ఆయనకు గాలి, నీరు, తిండి, నిద్రా అన్నీ సినిమానే. స్టూడెంట్ నెంబర్ 1గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. బాహుబలిగా తెలుగు తెరని ప్రపంచవ్యాప్తం చేశాడు. ఇపుడు RRR సినిమాతో మరోసారి సినీ వినీలాకాశంలో తన కీర్తి పతాకాన్ని రెపరెపలాడించే పనిలో ఉన్నారు.

  పేరులో ఉండే యస్.యస్ ను సూపర్ సక్సెస్ గా మలుచుకున్న దర్శకుడు రాజమౌళి....1973 అక్టోబర్ 10 కర్ణాటక రాష్ట్రం రాయచూర్ లో జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరు శ్రీశైల శ్రీ రాజమౌళి. చిన్నప్పటి నుంచి ఇంట్లో సినీ వాతావరణం ఉండటంతో ఆయన అడుగులు ఆటోమెటిక్ గా సినిమా రంగం వైపు మళ్లాయి.  కెరీర్ తొలినాళ్లలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వద్ద పలు సీరియల్స్‌‌తో పాటు  సినిమాలకు అసిస్టెంట్ పనిచేసిన రాజమౌళి...ఆయన వద్దే దర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు.

  కే.రాఘవేంద్రరావుతో రాజమౌళి (Twitter/Photo)


  అలా రాఘవేంద్రరావు నిర్మాణ పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన స్టూడెంట్ నెంబర్.1తో దర్శకుడిగా మారాడు.  తొలి సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. స్టూడెంట్ నెం.1 తో ప్రారంభమైన రాజమౌళి విజయయాత్ర నేటికీ అప్రతిహతంగా కొనసాగుతునే ఉంది.

  Rajamouli Shared a memorable location pics of his 1st movie Student No 1 with Jr NTR in Twitter pk ఎస్ఎస్ రాజమౌళి అనే దర్శకుడు ఈ రోజు ఇలా ఉన్నాడంటే దానికి కారణం ఆయన కష్టం. ఎంత ఎదిగినా కూడా మూలాలను మరిచిపోకుండా ఉండటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు రాజమౌళి కూడా ఇదే చేసాడు. rajamouli,jr tnr,rajamouli jr ntr,jr ntr twitter,rajamouli twitter,student no 1 movie 18 years,rajamouli rrr movie,rrr movie twitter,jr ntr rrr movie twitter,rrr movie location pics,telugu cinema,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి స్టూడెంట్ నెం 1,స్టూడెంట్ నెం 1 సినిమాకు 18 ఏళ్లు,తెలుగు సినిమా
  రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ (Source: twitter)


  స్టూడెంట్ నెం.1 అటు తారక్ కెరీర్ లోను... ఇటు రాజమౌళి కెరీర్ లోను చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాతోనే రాజమౌళి, ఎన్టీఆర్ తమ కెరీర్ లో తొలి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహాద్రి’ ఒక సంచలనమే సృష్టించింది.

  ఎన్టీఆర్ రాజమౌళి ఫైల్ ఫోటో


  సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ తిరుగులేని మాస్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో రాజమౌళి దర్శక ప్రతిభ దాగుంది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. టాప్ హీరోగా ఎదిగేందుకు కృషి చేస్తున్న ఎన్టీఆర్‌కు ఈ సినిమా తిరుగులేని స్టార్ డమ్ ను కట్టబెట్టింది.

  సై మూవీ (ఫేస్‌బుక్ ఫోటో)


  సింహాద్రి తర్వాత రాజమౌళి నితిన్ హీరోగా ‘సై’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. అప్పటి వరకు తెలుగు ఆడియన్స్ కు అంతగా పరిచయం లేని రగ్బీ ఆటను.... ఈ సినిమాలో చూపించి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. హాట్రిక్ సక్సెస్ తర్వాత రాజమౌళి తీసిన ‘ఛత్రపతి’ బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. ‘ఛత్రపతి’ సక్సెస్ తో  ప్రభాస్ కు మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచి అతని ఇమేజ్ అమాంతం పెరిగేలా చేసింది. ఈ క్రెడిట్ దర్శకుడిగా రాజమౌళికే దక్కుతుంది.

  ఛత్రిపతి (ఫేస్‌బుక్ ఫోటో)


  రాజమౌళి రూపొందించిన ఐదవ చిత్రం ‘విక్రమార్కుడు’. రవితేజ, అనుష్క జంటగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద జింతాతా అనిపించి...నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అప్పటి వరకు రొటీన్ మాస్ హీరోగా కనిపించిన రవితేజను ఈ సినిమాలో సరికొత్తగా ప్రెజెంట్ చేసి విజయాన్ని అందుకున్నాడు రాజమౌళి. రవితేజ బాడీలాంగ్వేజ్‌కు భిన్నంగా ఆయనలోని సీరియస్ నటున్ని ఆడియన్స్ కు పరిచయం  చేసిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది.

  విక్రమార్కుడు (ఫేస్‌బుక్ ఫోటో)


  తెలుగు తెరపై యముడి ఫార్ములా పై తీసిన సినిమాలు.... బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్  కొట్టినట్టే ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు చాలా లావుగా రొటీన్ గా కనిపించే ఎన్టీఆర్‌ను ఈ సినిమాతో సన్నబడేలా చేసాడు. అంతే కాకుండా తారక్‌ను తెరపై సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ సాధించాడు రాజమౌళి.

  యమదొంగ (Facebook/Photo)


  రాజమౌళి రూపొందించిన ఏడవ చిత్రం ‘మగధీర’. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈజీగా క్రాస్ చేయగలిగింది. ‘మగధీర’ విజయంతో మెగాపవర్ స్టార్‌గా రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరగడంలో ...దర్శకుడిగా రాజమౌళి కృషి ఎంతో దాగి ఉంది.

  10 Years Completed for Ram Charan Magadheera movie which directed by Sensational director SS Rajamouli pk అప్పటి వరకు తెలుగు సినిమా మార్కెట్ అంటే 40 కోట్లే.. పోకిరి సినిమా వచ్చి 40 కోట్లు వసూలు చేస్తే అదో అద్భుతంలా చూసారంతా. కానీ అప్పుడే వచ్చింది ఓ అద్భుతం. #Magadheera,magadheera,magadheera twitter,magadheera facebook,#10YearsOfMagadheera,magadheera 10 years,magadheera 10 years completed,ram charan magadheera 10 years,#10yearsforMagadheera,#DecadeOfIHMagadheera,#MomentsOfMagadheera,rajamouli magadheera 10 years,rajamouli ram charan,magadheera collections,dacade for magadheera,magadheera industry hit,magadheera full collections,ram charan kajal agarwal,magadheera visual wonder,telugu cinema,మగధీర,మగధీర కలెక్షన్స్,మగధీర 10 ఇయర్స్,రాజమౌళి మగధీర,రామ్ చరణ్ మగధీర,తెలుగు సినిమా
  మగధీర లో  రాజమౌళి (Source: Twitter)


  ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తే ఎలా ఉంటుంది? ‘మగధీర’ సక్సెస్ తర్వాత రాజమౌళి అదే చేశాడు. వరుసగా ఏడు సినిమాల నుంచి తను ఆవిష్కరించిన హీరోయిజాన్నీ....భీకరంగా చూపించే విలనీని వదిలేసి యుద్ధమే చేశాడు. అస్త్రాలేమి చేతబూనకుండా వినోదంతోనే విజయం సాధించాడు. కథను నమ్ముకుంటే ఫలితం ఎలా ఉంటుందో ‘మర్యాద రామన్న’ సినిమాతో నిరూపించాడు.అప్పటివరకు కేవలం కామెడీ నటుడుగా ఉన్న సునీల్‌తో ‘మర్యాద రామన్న’ అనే హిట్టును అందుకున్నారు.

  దర్శక ధీరుడు రాజమౌళి (Twitter/Photo)


  రాజమౌళి శైలికి భిన్నంగా తీసిన ఈ సినిమా కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో తాను పెద్ద హీరోలతోనే కాదు కమెడియన్లతో కూడా హిట్ కొట్టగలనని నిరూపించుకున్నాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన చాలా చిత్రాలు వివిధ భాషల్లో రీమేక్ కావడం విశేషం.

  మర్యాద రామన్న(ఫేస్‌బుక్ ఫోటో)


  ‘మర్యాద రామన్న’ రాజమౌళి తీసిన ఈగ పెద్ద సెన్సెషనే క్రియేట్ చేసింది. చిన్న ఆకారం, శక్తి, సామర్థ్యాలు తక్కువ. ఏం చేస్తుందిలే ఈగ అవి ఆషామాషీగా తీసుకుంటాం. అలాంటి అల్పజీవి ఈగనే హీరోగా చేసి...సక్సెస్ కొట్టడం ఒక్క రాజమౌళికే చెల్లింది. గ్రాఫిక్స్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా హోల్ ఇండియా తనవైపు చూసేలా చేసాడు రాజమౌళి.

  ఈగ (ఫేస్‌బుక్ ఫోటో)


  ఇక ప్రభాస్‌, రానాలతో తెరకెక్కించిన ‘బాహుబలి’ రెండు పార్టుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఈ మూవీ సక్సెస్‌ను చూసి భారతీయ చిత్ర పరిశ్రమే ఆశ్చర్యపోయింది. ఒక ప్రాంతీయ భాష చలనచిత్రం ఈ రేంజ్‌లో హిట్టు సాధించడం ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయేలే చేసింది.

  sensational director rajamouli emotional tweet on bahubali movie,bahubali,ss rajamouli,ss rajamouli twitter,ss rajamouli instagram,prabhas,baahubali 2,bahubali,prabhas saaho,baahubali prabhas,bahubali 2,prabhas movies,prabhas new movie,prabhas anushka,anushka prabhas,prabhas baahubali,prabhas in saaho,prabhas and anushka movies,baahubali,prabhas and anushka,anushka prabhas marriage,baahubali prabhas wax statue,prabhas raju,pics of baahubali prabhas,anushka and prabhas,baahubali 2 full movie,prabhas latest news,anushka shetty,baahubali2,prabhas,baahubali 2,bahubali,prabhas saaho,baahubali prabhas,bahubali 2,prabhas movies,prabhas new movie,prabhas anushka,anushka prabhas,prabhas baahubali,prabhas in saaho,prabhas and anushka movies,baahubali,prabhas and anushka,anushka prabhas marriage,baahubali prabhas wax statue,prabhas raju,pics of baahubali prabhas,anushka and prabhas,baahubali 2 full movie,prabhas latest news,anushka shetty,బాహుబలి,ప్రభాస్,అనుష్క,రాజమౌళి,అనుష్క శెట్టి,కీరవాణి,బాహుబలి టీమ్,లండన్‌లో కలవనున్న బాహుబలి,రాజమౌళి,రాజమౌళి ఎమోషనల్ ట్వీట్,
  బాహుబలి  (Twitter/Photo)


  ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘RRR’ అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చాలా యేళ్ల తర్వాత తెలుగు తెరపై తెరకెక్కుతున్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే. చరిత్రలో అసలు కలవని  కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7 ప్రపంచవ్యాప్తంగా  విడుదలకానుంది.

  చరణ్,రాజమౌళి, ఎన్టీఆర్(ఫోటో)


  మొత్తానికి వెండితెరపై హీరోయిజాన్ని కాకుండా డైరెక్టరిజాన్ని చూపిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన రాజమౌళికి కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఏమైనా టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ సూపర్ సక్సెస్ దర్శకుడికి న్యూస్ 18 బర్త్ డే విషెస్ చెబుతోంది.
  Published by:Suresh Rachamalla
  First published: