HOME »NEWS »MOVIE »happy birthday pspk 28 pawan kalyan play crucial politician charecter in harish shankar movie ta

PSPK 28: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా క్రేజీ అప్‌డేట్.. తొలిసారి ఆ పాత్రలో పవర్ స్టార్..

PSPK 28: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా క్రేజీ అప్‌డేట్.. తొలిసారి ఆ పాత్రలో పవర్ స్టార్..
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ చిత్రం (Twitter/Photo)

PSPK 28 Pawan Kalyan Harish Shankar | ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన అప్డేడ్ ఇచ్చారు.

  • Share this:
    రాజకీయాల్లో పూర్తిగా బిజీగా అయిన పవన్ కళ్యాణ్.. సార్వత్రిక ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఈ లోగా పలు చిత్రాలు చేసి జనసేన పార్టీ కోసం నాలుగు రాళ్లు వెనకేసుకోెవాలనే ఆలోచనలో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్ష నేపథ్యంలో డిసెంబర్‌లో కానీ ఈ సినిమా మిగిలిన పార్ట్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.  ఆ సినిమా తర్వాత క్రిష్‌తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయనున్నాడు. ఈ  చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.   చిత్రానికి ‘విరూపాక్షి’ టైటిల్‌ అనుకున్నారు. ఈ సినిమాకు మాస్ అప్పీల్ లేదనే ఉద్దేశ్యంతో ’గజ దొంగ’తో పాటు ‘బందిపోటు’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. 

    పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ చిత్రం అప్‌డేట్ (File/Photo)




    ఈ సినిమా పోస్టర్‌లో సర్ధార్ వల్లభభాయ్ పటేల్‌తో పాటు సుభాష్ చంద్రబోస్ ఫోటోలున్నాయి. అంతేకాదు కింద పోస్టర్‌లో ఇట్స్ టైమ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని కాప్షన్ ఇచ్చారు. అంటే ఈ చిత్రాన్ని సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే విషయం స్పష్టమైంది.
    అంతేకాదు ఈ సినిమాలో డైలాగ్స్, సన్నివేశాలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా స్క్రిప్ట్‌ను హరీష్ శంకర్ తీర్చిదిద్దినట్టు సమాచారం. మొత్తంగా తన నిజ జీవిత పాత్రను తెరపై చేయనున్నడన్న మాట.

    పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ చిత్రం అప్‌డేట్ (File/Photo)


    అంతేకాదు ఇక ముందు తనను సంప్రదించే దర్శకులు పొలిటికల్ టచ్ ఉన్న కథతో రావాలని చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ‘ఇపుడే మొదలైంది’ అనే టైటిల్ అనుకుంటున్నారు. .
    Published by:Kiran Kumar Thanjavur
    First published:September 02, 2020, 16:31 IST

    टॉप स्टोरीज