ప్రశాంత్ నీల్.. ఒక్క సినిమాతోనే అందరి చూపు తనవైపు తిప్పుకున్న డైరెక్టర్.

గత కొన్నేళ్లులలో దక్షిణాది దర్శకులు శంకర్, రాజమౌళి తర్వాత దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. ఈ రోజు ఈ దర్శకుడు పుట్టినరోజు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: June 4, 2020, 12:56 PM IST
ప్రశాంత్ నీల్.. ఒక్క సినిమాతోనే అందరి చూపు తనవైపు తిప్పుకున్న డైరెక్టర్.
ప్రశాంత్ నీల్ పుట్టినరోజు (Instagram/Photo)
  • Share this:
గత కొన్నేళ్లులలో దక్షిణాది దర్శకులు శంకర్, రాజమౌళి తర్వాత దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. అంతకు ముందు మణిరత్నం కూడా తన సినిమాలతో ఆల్ ఇండియా ప్రేక్షకులను తన సినిమాలతో అలరించారు. ఒకపుడు తెలుగు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, దాసరి, రాఘవేంద్రరావు, బాపయ్య వంటి చాలా మంది దర్శకులు హిందీ సినిమాలను డైరెక్ట్ చేసి తమ సత్తా చాటారు. మలయాళం నుంచి ప్రియదర్శన్ కూడా హిందీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి ఎపుడైతే.. బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా మూవీ చేసి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాడు. జక్కన్న కూడా బాహుబలికి అన్ని భాషల్లో ఈ రకంగా రెస్పాన్స్ వస్తుందని కూడా ఊహించలేదు. అంతేకాదు ఒక ప్రాంతీయ భాష చిత్రం హిందీలో దాదాపు రూ. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం బాలీవుడ్ మేధావులను సైతం ఆశ్యర్యపోయేలా చేసింది.ఒకవైపు రాజమౌళి బాహుబలి వంటి సినిమాతో బాలీవుడ్ చిత్ర సీమను శాసిస్తుంటే.. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్.. యశ్ వంటి అప్ కమింగ్ హీరోతో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ సినిమా తెరకెక్కించి అద్భుతమైన విజయం సాధించాడు.

happy birthday prashanth neel these are the specialities of director,prashanth neel,prashanth neel kgf,prashanth neel kgf 2,prashanth neel jr ntr,prashanth neel prabhas,prashanth neel mahesh babu,prashanth neel yash,yash kgf 2,prashanth neel twitter,prashanth neel instagram,prashanth neel movies,director prashanth neel,hbd prashanth neel,yash prashanth neel,prashanth neel first movie,prashanth neel telugu movie,happy birthday prashanth neel,director prashanth neel speech,director prashanth neel speaks,kgf director prashanth neel movie,happy birthda y prashant neel,prashanth neel blockbuster movies,prashanth neel at #kgf trailer launch,director prashanth neel on baahubali,prashanth neel hit and flop movies list,prashanth neel highest grossing movie,ప్రశాంత్ నీల్,దర్శకుడు ప్రశాంత్ నీల్ బర్త్ డే,ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ యశ్,ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ మహేష్ బాబు,ప్రశాంత్ నీల్ ప్రభాస్,ప్రశాంత్ నీల్ సినిమాలు
కెజియఫ్ 2 (KGF Chapter 2 release date)


అంతకు ముందు ప్రశాంత్ నీల్ కేవలం ఒకే ఒక సినిమాను తెరకెక్కించాడు.  కేజీఎఫ్ సినిమా కూడా ఎవరు ఊహించని విధంగా కన్నడతో పాటు తెలుగులో హిందీలో ఓ రేంజ్‌లో ఇరగదీసింది. అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్‌లోనే ఏకంగా రూ. 125 కోట్ల వరకు కొల్లగొట్టింది. తెలుగులో రూ. 3 కోట్ల లోపు బిజినెస్ చేసిన ఈ సినిమా మొత్తంగా రూ. 25 కోట్ల వరకు కొల్లగొట్టి అందరి ఆశ్యర్యపోయేలా చేసింది. అంతేకాదు కన్నడ చిత్రపరిశ్రమలో తొలి రూ.100 కోట్లు, తొలి రూ. 200 కోట్ల సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చిత్రంతో హీరోగా యశ్‌తో పాటు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు.

ప్రశాంత్ నీల్ (Twitter/Photo)


ఇపుడు ఇతను యశ్‌తో ‘కేజీఎఎఫ్ 2’ పార్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూసేలా చేసాడు. రెండో పార్ట్‌లో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ నటీనటులు నటిస్తుండటం విశేషం. కన్నడ చిత్ర సీమలో పుట్టన్న కనగల్, గిరీష్ కాసరవల్లి, ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు తర్వాత ఆ రేంజ్‌లో ఫేమసైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్.. వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కమిటయ్యాడు. ముందు ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం కూడా కేజీఎఫ్ తరహాలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం.

Ntr news,NTR to work with prashanth neel, Janhvi kapoor to romance with tarak , Ntr trivikram new film, pooja hegde,ntr,jr ntr,jr ntr politics,jr ntr tdp politics,rrr jr ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్,పూజాహెగ్డే, ప్రశాంత్ నీల్
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ Photo : Twitter


ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నారు. మరోవైపు ప్రభాస్‌తో కూడా ప్రశాంత్ నీల్ నెక్ట్స్ మూవీ ఉండే అవకాశాలున్నాయి. నాగ్ అశ్విన్ సినిమా తర్వాత ప్రభాస్ 22వ చిత్రాన్ని ఇతనే డైరెక్ట్ చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఓ చిత్రం చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. మొత్తంగా కేజీఎఫ్ తర్వాత దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఖ్యాతి మరింత పెరిగింది.  ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌కు న్యూస్ 18 బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 4, 2020, 11:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading