Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈరోజు తన 42వ పట్టినరోజును జరపుకుంటున్నారు. దీంతో ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రాధేశ్యామ్ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్లో ప్రభాస్ చేసిన విక్రమ్ ఆదిత్య పాత్రను పరిచయం చేశారు. ప్రభాస్ పాత్రను ఓ లెవల్లో ఇంట్రడ్యూస్ చేశారు. చూడటానికి వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ టీజర్‌ను చూస్తుంటే.. సినిమాపై మరింత ఆసక్తి పెరగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల భవిష్యత్తు చెప్పే వాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. టీజర్‌ను చూస్తుంటే.. రాధే శ్యామ్ ఓ విజువల్ ట్రీట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే హీరో హీరోయిన్’గా చేస్తోంది. ప్రేరణ పాత్రలో పూజా కనపడనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. రాధేశ్యామ్ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిసింది.
#Vikramaditya is here to cast his spell & win everyone's heart! ? Here's wishing our darling #Prabhas a very Happy Birthday! ☺️ #HappyBirthdayPrabhas
▶️https://t.co/7wuv17ivlN
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/Q6MAd60IR6
— UV Creations (@UV_Creations) October 23, 2021
ఈ సినిమా తెలుగు వర్షన్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించారు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల కానుంది.
Mahesh Babu | Sitara : ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మహేష్ కూతురు సితార.. వీడియో వైరల్..
ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రభాస్ హీందీ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదిపురుష్ (Adipurush) అనే పేరును ఖరారు చేశారు.
Bigg Boss Telugu 5 : తప్పించుకున్న లోబో.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే..
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం గతంలో తెలిపింది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే డిసెంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నారు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలతో పాటు ఆయన మరో సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ తన 24వ సినిమాను హిందీ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్‌తో చేయనున్నట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood news