Prabhas : ప్రస్తుతం తెలుగులో జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలకు మళ్లీ ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటికే ‘బాహుబలి’ (Bahubali) సినిమాతో జానపద సినిమా చేసి సాహోరే బాహుబలి అనిపించుకున్న ప్రభాస్(Prabhas).. త్వరలో ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ (Adipurush)ప్రభు శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ రోజు ప్రభాస్ 42వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక ప్రభాస్ చేస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్స్ ప్రధానం కావడంతో ముందుగా టాకీ పార్ట్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో కృతి సనన్ (Kriti Sanon)సీతా మాత పాత్రలో అలరించనుంది.
ఐతే.. ప్రభాస్ తన సినీ కెరీర్‌లో ‘ఆదిపురుష్’ కంటే ముందు ఓ సినిమాలో పౌరాణిక పాత్ర చేసారు. వివరాల్లోకి వెళితే..ఇక ప్రభాస్ పర్సనల్ విషయానికి వస్తే.. వాళ్ల కుటుంబంలో వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరు. తండ్రి సూర్య నారాయణ రాజు నిర్మాత. ఇంట్లో ఎపుడు సినిమా వాతావరణమే. ఐనా కలలో కూడా సినిమా హీరో అవుదామని అనుకోలేదట. పెద్దయ్యాక ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నాడట.
ఐతే.. స్నేహితులు మాత్రం ఎపుడు ప్రభాస్‌ను సరదాగా ‘హీరో’ అని పిలుచేవాళ్లట. ఇక చదువు పూర్తి అవ్వగానే ప్రభాస్‌కు సడెన్‌గా హీరో అవ్వాలనిపించట. ఇంట్లో చెబితే... పెదనాన్న సహా అందరు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసారు. యాక్ట్ చేయాలని ఉంటే యాక్టింగ్‌లో శిక్షణ తీసుకోమని చెప్పి విశాఖలోని సత్యానంద్ దగ్గర పంపారట. నటనలో శిక్షణ తీసుకుంటున్న టైమ్‌లోనే ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ సినిమా చేద్దామన్నారు. ముందు ఓకే చేయలేదు. ఆ తర్వాత పెదనాన్న కృష్ణంరాజు జోక్యం చేసుకొని సినిమా చేయమని చెప్పడంతో జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ‘ఈశ్వర్’ సినిమాలో నటించారు.
Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..
అలా సినీ రంగంలో అడుగుపెట్టారు ప్రభాస్. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమ దొంగ’ సినిమాను విశ్వామిత్రా క్రియేషన్ బ్యానర్‌లో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏమైనా చేద్దామనుకున్నారు రాజమౌళి. అలా టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ విశ్వామిత్రుడిగా కనిపించారు.
నేనేంటి విశ్వామిత్రుడి వేషం ఏంటీ అనుకున్నాడట ప్రభాస్. కానీ రాజమౌళి కన్విన్స్ చేయడంతో విశ్వామిత్రుడి వేషం వేసినట్టు చెప్పుకొచ్చారు. అంటే ఆదిపురుష్ సినిమా కంటే ముందు ‘యమ దొంగ’ సినిమాలో కేవలం ఒకే ఒక్క సన్నివేశం కోసము అది కూడా టైటిల్స్ కార్డ్స్‌లో విశ్వామిత్రా క్రియేషన్స్ బ్యానర్ వచ్చేటపుడు ప్రభాస్.. విశ్వామిత్రుడి వేషంలో కనిపించి అలరించారు. ఇక ప్రభాస.. డైరెక్ట్‌గా నటించిన హిందీ చిత్రం ‘యాక్షన్ జాక్సన్’. అజయ్ దేవ్‌గణ్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేసారు.
చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..
ప్రస్తుతం ప్రభాస్ నటించే సినిమాలన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు దేశం మొత్తంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ రికార్డులకు ఎక్కారు. ఈయన హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ మూవీ వచ్చే యేడాది దసరా బరిలో రిలీజ్ కానున్నట్టు సమాచారం. ఇంకోవైపు ఆదిపురుష్ మాత్రం అనుకున్న టైమ్‌కు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇక నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ K’ మూవీతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 25వ చిత్రంగా ‘స్పిరిట్’ మూవీకి ఓకే చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adipurush, Bollywood news, Prabhas, Project K, Radhe Shyam, Salaar, Tollywood