Happy Birthday Pawan Kalyan : ఆ విలక్షణతే పవన్ కళ్యాణ్‌‌ను పవర్ స్టార్ చేసింది..

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

Happy Birthday Pawan Kalyan : ఈరోజు టాలీవుడ్ సినీ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 50వ పుట్టినరోజు.

  • Share this:
    Happy Birthday Pawan Kalyan : ఈరోజు టాలీవుడ్ సినీ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 50వ పుట్టినరోజు. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు (సెప్టెంబర్ 2) పండగ రోజు. ఆయన  పవన్ కళ్యాణ్.. చిరంజీవి (Chiranjeevi) తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయ్యారు. ఆ తర్వాత ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’ సినిమాలతో యూత్ ను తనవైపు తిప్పుకున్నారు. పూరీ జగన్నాధ్ ‘బద్రి’ సినిమాతో తనలోని స్టైల్, స్టామీనాను నిరూపించుకున్న పవన్.. ఖుషి సినిమాతో అభిమానుల హృదయాల్లో బంగారం అయ్యారు.

    ‘ఖుషి’ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనా.. ఇమేజ్ ఏమాత్రం తగ్గని పవన్ త్రివిక్రమ్ జల్సాతో అలరించారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటిది దారేది’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. మధ్యలో ‘తీన్మార్’, ‘పులి’ సినిమాలు కొంత నిరాశపరిచిన.. ‘కాటమరాయుడు ఈ యేడాది ‘వకీల్ సాబ్‌’గా పలరించారు.

    పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    ఈ సినిమా హిందీలో సూపర్ హిట్టైనా ‘పింక్’ కు రీమేక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. సాగర్ కే.చంద్ర దర్శకత్వంలో ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా ’వకీల్‌సాబ్’ పాత్రలో అదరగొట్టిన హీరోలు ఇంకెవరున్నారంటే..


     దీంతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసారు.

    ‘యథా కాలం తథా వ్యవహారం’ (Twitter/Photo)


    మరోవైపు పవన్ కళ్యాణ్.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.  దీనికి తోడు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు పవన్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    అంతేకాదు.. పవన్ కళ్యాణ్ విజయాలు వస్తే పొంగిపోవడం.. అపజయాలు వస్తే కృంగిపోవడం అనేది జరగలేదు. అంతేకాదు పవన్‌కు విజయాలు ఉన్నపుడే కాదు.. అపజయాల్లో ఉన్నపుడు కూడా అభిమానులు ఆయన వెన్నంటి ఉన్నారు. ఆ విలక్షణతే పవన్ కళ్యాణ్‌ను అసలు సిసలు పవర్‌స్టార్‌ను చేసిందని ఆయన సన్నిహితులు, అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.

    Pawan Kalyan: పవర్ స్టార్ బిరుదును పవన్ కళ్యాణ్‌కు ఇచ్చింది ఎవరో తెలుసా..

    ఇక  అది అలా ఉంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు గెలిచిన పవన్.. ఓటమి నుంచి ఎన్ని విషయాలు తెలుసుకున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని అంటున్నారు. పవ‌న్ కళ్యాణ్ ఇటు సినిమా రంగంలోనూ అటు రాజకీయాల్లోనూ మంచి విజయాలను పొందాలనీ మనసారా కోరుకుంటోంది న్యూస్ 18.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: