Home /News /movies /

HBD Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు చిరు, చరణ్, బన్ని, రాఘవేంద్రరావు సహా పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..

HBD Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు చిరు, చరణ్, బన్ని, రాఘవేంద్రరావు సహా పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..

పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ (Twitter/Photo)

పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ (Twitter/Photo)

Happy Birthday Pawan Kalyan | ఈ రోజు పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసారు.

    HBD Pawan Kalyan | ఈరోజు టాలీవుడ్ సినీ నటుడు, రాజకీయ నాయకుడు జనసేనాని పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పవన్ కళ్యాణ్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేసారు. మీరు ఆయురాగోగ్యాలతో మీరు ఎల్లపుడు ప్రజలకు సేవ చేయాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నిప్పు కణం అంటూ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. అటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీరు నిండూ నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసారు. 

    మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెష్ తెలియజేసారు. మరోవైపు రామ్ చరణ్ కూడా బాబాయి పవన్ కళ్యాణ్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేసారు. నాకు ప్రేరణ.. నా గురువు పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాను. మరోవైపు రవితేజ, రాఘవేంద్రరావు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌తో పాటు దర్శకుడు మెహర్  రమేష్, హరీష్ శంకర్, బాబీ, వక్కంతం వంశీతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెష్ తెలియజేసారు. 





















    ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయ్యారు. ఆ తర్వాత ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’ సినిమాలతో యూత్ ను తనవైపు తిప్పుకున్నారు. పూరీ జగన్నాధ్ ‘బద్రి’ సినిమాతో తనలోని స్టైల్, స్టామీనాను నిరూపించుకున్న పవన్.. ఖుషి సినిమాతో అభిమానుల హృదయాల్లో బంగారం అయ్యారు.

    HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సహా ’వకీల్‌సాబ్’ పాత్రలో అదరగొట్టిన హీరోలు ఇంకెవరున్నారంటే..

    ఈ యేడాది ‘వకీల్ సాబ్‌’గా పలరించిన పవన్ కళ్యాణ్.. త్వరలో ‘భీమ్లా నాయక్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాంతో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు.

    Pawan Kalyan: పవర్ స్టార్ బిరుదును పవన్ కళ్యాణ్‌కు ఇచ్చింది ఎవరో తెలుసా..

    దానికి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చసారు.  దాంతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసారు.మరోవైపు పవన్ కళ్యాణ్.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Chiranjeevi, K. Raghavendra Rao, Pawan kalyan, Ram Charan, Ravi Teja, Tollywood, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు