Happy Birthday NTR : ఎన్టీఆర్ రేపు తన 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొరటాల టీమ్ ఓ వీడియోను వదిలింది. ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు అనిరుధ్ మ్యూజిక్ కూడా ఏ ఓ రేంజ్లో ఉందని చెప్పోచ్చు.
NTR 30 | Koratala Siva : ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ఓ సినిమా (NTR30) రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. ఎట్టకేలకు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం గురించి అప్డేట్ వచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడు శివ కొరటాలతో చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఎన్టీఆర్ రేపు తన 39వ పుట్టినరోజును (Happy Birthday NTR) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కొరటాల టీమ్ ఓ వీడియోను వదిలింది. ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు అనిరుధ్ మ్యూజిక్ కూడా ఏ ఓ రేంజ్లో ఉందని చెప్పోచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ ప్యాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. . ఇక మొన్నటి వరకు ఆలియా భట్ (Alia Bhatt) హీరోయిన్గా చేస్తుందని టాక్ నడిచింది. అయితే ఆమె ప్రస్తుతం తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కాస్తా బిజీ అయ్యింది.
దీనికి తోడు గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియా, ఎన్టీఆర్ 30 చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె ప్లేస్‌లో రష్మిక మందన్న (Rashmika Mandanna) పరిశీలిస్తున్నారట టీమ్. అందులో భాగంగా రష్మిక మందన్నతో ఎన్టీఆర్ 30 టీమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీత అందించనున్నారు.
NTR 30 Photo : Twitter
ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు (Prashanth Neel) ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తున్నారు.
— Anirudh Ravichander (@anirudhofficial) May 19, 2022
ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాధించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది.
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు. మరోవైపు ఈ (RRR) చిత్రానికి చెందిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. అన్ని భాషాల్లో ఈ సినిమా మే 20న స్ట్రీమింగ్ కానుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.