HAPPY BIRTHDAY NITHYA MENEN DO YOU WHICH FILM SHE ACTED AS LESBIAN HERE ARE THE DETAILS SR
Happy Birthday Nithya Menen : లెస్బియన్‌గా నిత్యా మీనన్ ఏ సినిమాలో నటించిందో తెలుసా..
Nithya menen Photo : Instagram
Happy Birthday Nithya Menen : నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈరోజు ఈ టాలెంటెడ్ యాక్టర్ 30వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ.
Happy Birthday Nithya Menen : నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈరోజు ఈ టాలెంటెడ్ యాక్టర్ 30వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ. నిత్యా మీనన్ ఏప్రిల్ 8, 1990లో జన్మించింది. ఆమె నటిగానే కాకుండా ఓ గాయనీ కూడా. నిత్యా మీనన్ ప్రధానంగా మలయాళం , తెలుగు , తమిళం, కన్నడ చిత్రాలలో నటించిందింది. ఆమె తెలుగులో నటించిన గుండే జారి గల్లంతయ్యిందే , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, తమిళ చిత్రం మెర్సల్ చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. తెలుగులో అలా మొదలైంది (2011), తమిళ్లో 180 (2011) చిత్రాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక 2019 లో మిషన్ మంగల్ చిత్రంతో ఆమె హిందీ సినిమాలకు పరిచయమైంది. నిత్యామీనన్ బెంగుళూర్లో ఓ మలయాళీ తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె అక్కడే మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో జర్నలిజం చదివింది. చిన్నప్పుడు పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. 2011 లో ఆమె మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ అలా మొదలైంది చిత్రంలో నటించి పాపులర్ అయ్యింది.
ఈ సినిమాలో హీరోగా నాని చేశాడు. ఈ సినిమా నిత్యా మీనన్ తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో తన నటనకు ఆమెకు నంది అవార్డ్ దక్కింది. ఆ తర్వాత ఎన్నో తెలుగు తమిళ చిత్రాల్లో నటించి అదరగొట్టింది. ఇక 2012లో నితిన్ రెడ్డితో కలిసి ఇష్క్ అనే సినిమా చేసింది. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకుడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక 2014 లో, ఆమె మలయాళ చిత్రం బెంగళూరు డేస్‌లో అతిధి పాత్రలో నటించింది.
Nithya menen Photo : Instagram
ఇక క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రంలో తన నటనను విమర్శకులు ప్రశంసించారు. ఈ సినిమాకు ఆమెకు ఉత్తమ నటి సౌత్ ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమె త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో చిన్న పాత్రలో మెరిసింది. మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ఓకె కన్మణిలో హీరోయిన్గా చేసింది.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. నాని నిర్మాతగా 2018 లో వచ్చిన ఆ సినిమాలో నిత్యా మీనన్ లెస్బియన్‌గా నటించి అదరగొట్టింది. ఈ సినిమాలో ఆమె ఈషా రెబ్బాతో కలిసి జంటగా నటించింది. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నిత్యామీనన్ నిన్నిలా నిన్నిలాలో నటించింది. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడదులై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం నిత్యా మీనన్ తెలుగులో గమనం అనే సినిమా చేస్తోంది. దీంతో పలు తమిళ మలయాళీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.