హోమ్ /వార్తలు /సినిమా /

Nayanthara : నయనతారకు ‘గాడ్ ఫాదర్’ టీమ్ బర్త్ డే విషెస్.. చిరు సినిమాలో మరోసారి నయన్..

Nayanthara : నయనతారకు ‘గాడ్ ఫాదర్’ టీమ్ బర్త్ డే విషెస్.. చిరు సినిమాలో మరోసారి నయన్..

Nayanthara In Chiranjeevi God Father Photo : Twitter

Nayanthara In Chiranjeevi God Father Photo : Twitter

Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతారకు ‘గాడ్ ఫాదర్’ (God Father) టీమ్ బర్త్ డే విషెస్ తెలియజేసింది. ఈ సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ టీమ్ ప్రత్యేకంగా నయనతారతో కూడిన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.

Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతారకు ‘గాడ్ ఫాదర్’ (God Father) టీమ్ బర్త్ డే విషెస్ తెలియజేసింది. ఈ సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ టీమ్ ప్రత్యేకంగా నయనతారతో కూడిన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. దీంతో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో నయనతార నటించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించినట్టు అయింది. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) సరసన నయనతార కథానాయికగా నటిస్తుందా లేదా చెల్లెలు పాత్రలో నటించబోతుందా అనేదా చూడాలి. ఐతే.. ‘గాడ్ ఫాదర్’లో చిరు చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ (Ramya Krishna)ను దాదాపు ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక మోహన్‌లాల్ (Mohanlal) ఒరిజినల్ ‘లూసీఫర్’ లో హీరోయిన్ లేదు. మరి తెలుగులో చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు కథానాయికగా రోల్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి, నయనతార మరోసారి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసారు. ఈ సినిమాలో తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారు.  ఈ చిత్రంలో రామ్ చరణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు.

చిరంజీవి  ఆచార్య’ తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ రీమేక్ స్టార్ట్ చేసారు. ఈ సినిమా ఓ షెడ్యూల్ ఊటీలో పూర్తైయింది. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తోన్న  ఈ చిత్రాన్ని ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ  సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Krithi Shetty : బంగార్రాజులో ‘నాగ లక్ష్మి’గా కృతి శెట్టి.. అదిరిన బేబమ్మ కొత్త లుక్..


ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు తమన్ రీసెంట్‌గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.  మరోవైపు వరుణ్ తేజ్.. చిరంజీవి బ్రదర్ పాత్రలో సీఎంగా కాసేపు అలరించనున్నట్టు సమాచారం. మరోవైపు చిరు.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ డైరెక్షన్‌లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

ఇప్పటికే ‘భోళా శంకర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్‌లో రెండో వారంలో  ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమాను డిసెంబర్‌లో మొదలుపెట్టి నాన్‌స్టాప్‌గా జనవరి చివరి వరకు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్  చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ.. ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్‌తో చిరంజీవి కాంబినేషన్ సీన్స్ తెరకెక్కించనున్నారు. మొత్తంగా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్‌బిజీగా ఉన్నారు.

First published:

Tags: Chiranjeevi, God Father Movie, Konidela Productions, Nayanthara, Super Good Films, Tollywood

ఉత్తమ కథలు