Home /News /movies /

HAPPY BIRTHDAY NATURAL STAR NANI THESE ARE THE QUALITIES NANI BECOME NATURAL STAR TA

Happy Birthday Natural Star Nani: ఆ ప్రత్యేకతలే నానిని.. నాచురల్ స్టార్‌గా ఎదిగేలా చేసాయి..

ఈ రోజు నాచురల్ స్టార్ నాని పుట్టినరోజు (Twitter/Photo)

ఈ రోజు నాచురల్ స్టార్ నాని పుట్టినరోజు (Twitter/Photo)

Happy Birthday Natural Star Nani: ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాతో పరిచయమయ్యాడు నాని. ఆ సినిమా విడుదలైనపుడు నాని ఇంత పెద్ద హీరో అవుతాడని ఎవరు అనుకోలేదు. ఆ తర్వాత సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇంకా చదవండి ...
  Happy Birthday Natural Star Nani: ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాతో పరిచయమయ్యాడు నాని. ఆ సినిమా విడుదలైనపుడు నాని ఇంత పెద్ద హీరో అవుతాడని ఎవరు అనుకోలేదు. ఆ చిత్రంలో క‌ల‌ర్స్ స్వాతి త‌ప్ప మ‌రో ఫేస్ ఎవరికీ తెలియ‌దు. ఆ తర్వాత నాని ఇంతింతై అన్నట్టు ఒక్కో సినిమాతో తనలో టాలెంట్‌ను సాన పెడుతూ నాచురల్ స్టార్‌గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ అండ లేకుండా వ‌చ్చిన ఈ కుర్రాడు త‌ర్వాత రోజుల్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తాడ‌ని. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. చిరంజీవి, ర‌వితేజ త‌ర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్న న‌టుడు నాని. ఫిబ్ర‌వ‌రి 24న నాని పుట్టిన‌రోజు.

  అప్ప‌టికే శీనువైట్లతో ఢీ.. బాపు రాధాగోపాలం సినిమాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసి ద‌ర్శ‌క‌త్వం కోసం క‌థ సిద్ధం చేసుకుంటున్న రోజుల‌వి. అలాంటి స‌మ‌యంలో ఓ సినిమా ఎడిట్ సూట్‌లో ఇంద్ర‌గంటి ఏదో ప‌ని మీద వ‌చ్చి నానిని చూడటం.. కుర్రాడెవ‌రో బాగున్నాడే అని త‌న సినిమాలో హీరోగా అవ‌కాశం ఇవ్వ‌డంతో నాని ద‌శ మారిపోయింది.

  nani 10 years
  నాని ట్విట్టర్ ఫోటో (Twitter/Photo)


  అది మొద‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు న్యాచుర‌ల్ స్టార్. చిరంజీవి త‌ర్వాత ఏ అండదండ‌లు లేకుండా ఇంత‌గా మార్కెట్.. ఫ్యాన్స్ సంపాదించుకుంది ర‌వితేజ త‌ర్వాత నానినే. అష్టాచ‌మ్మా త‌ర్వాత కూడా నానిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రైడ్.. భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు లాంటి సినిమాలు న‌టుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి కానీ విజ‌యం కాదు. కానీ 2011 ఈ హీరో కెరీర్ ను మార్చేసింది. ఆ ఏడాది ‘అలా మొద‌లైంది’.. ‘పిల్ల జమీందార్’ విజ‌యాల‌తో నాని క్రేజీ హీరో అయిపోయాడు.

  nani 10 years
  నాని ట్విట్టర్ ఫోటో (Twitter/Photo)


  2012లో రాజమౌళి దర్శకత్వంలో  వ‌చ్చిన ‘ఈగ‌’ చిత్రంతో నేష‌న‌ల్ వైడ్ ఫేమ‌స్ అయిపోయాడు. అయితే అదే ఏడాది నానికి బ్యాడ్‌టైమ్ కూడా మొద‌లైంది. ‘ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు’.. ‘పైసా’.. ‘ఆహా క‌ళ్యాణం’.. ‘జెండా పై క‌పిరాజు’ ఇలా వ‌ర‌స సినిమాల‌యితే చేసాడు కానీ హిట్లు మాత్రం అందుకోలేదు నాని. అలాంటి టైమ్‌లో వ‌చ్చిన సినిమా ‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’. 2015 మార్చ్ 21న విడుద‌లైంది ఈ చిత్రం. అదే రోజున నాని హీరోగా నటించిన ‘జెండా పై కపిరాజు’ కూడా ఎన్నో అవాంతరాల తర్వాత విడుదలైంది. అప్పట్లో బాలకృష్ణ తర్వాత ఒకే హీరోొ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైన హీరోగా నాని రికార్డులకు ఎక్కాడు. ఆ త‌ర్వాత భ‌లేభ‌లే మగాడివోయ్ సినిమాతో నాని కాస్తా న్యాచుర‌ల్ స్టార్ అయ్యాడు.

  నాని వి సినిమా పోస్టర్ (Nani V movie poster)
  నాని వి సినిమా పోస్టర్ (Nani V movie poster)


  ఈ ప్ర‌యాణంలో ‘ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు’కు ఉత్తమ నటుడిగా నంది అవార్డు.. ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు నాని. ఇక అప్ప‌ట్నుంచి ‘కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ’.. ‘జెంటిల్ మ‌న్’.. ‘మ‌జ్ను’.. ‘నేను లోక‌ల్’.. ‘నిన్నుకోరి’.. ‘ఎంసిఏ’ సినిమాల‌తో వ‌ర‌సగా ఎనిమిది విజ‌యాలు అందుకున్నాడు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవ‌దాస్’ సినిమాల‌తో ఫ్లాపులు అందుకున్నాడు. ఆ తర్వాత గౌత‌మ్ తిన్న‌నూరితో చేసిన జెర్సీతో విజయాన్ని అందున్నాడు.  ఆ తర్వాత విక్ర‌మ్ కే కుమార్‌తో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. గతేడాది నాని హీరోగా నటించిన ‘వి’ సినిమా కరోనా కారణంగా థియేటర్స్‌లో కాకుండా ఓటీటీ వేదికగా విడుదలైంది. హీరోగా నానికి ఇది 25వ చిత్రం  ప్రస్తుతం నాని.. ‘టక్ జగదీష్’ మూవీతో ‘అయితే సుందరానికి’ సినిమాలతో పాటు ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల్లో నటిస్తున్నాడు. పక్కంటి కుర్రాడి పాత్రలోఅత్యంత సహజంగా నటించడం నాని స్పెషాలిటీ. అదే నాని సామాన్య ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది. మొత్తానికి నాని ఇలాంటి సక్సెస్‌ఫుల్ పుట్టినరోజులను మరిన్ని జరుపుకోవానలి కోరుకుంటుంది న్యూస్ 18.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nani, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు