Home /News /movies /

HAPPY BIRTHDAY NANDAMURI KALYAN RAM NKR DO YOU KNOW FACT ABOUT HIS FAMILY AND MOVIE JOURNEY TA

HBD Nandamuri Kalyan Ram: హ్యాపీ బర్త్ డే నందమూరి కళ్యాణ్ రామ్.. టాలీవుడ్‌లో నిర్మాతగా సత్తా చూపెడుతున్న హీరో..

హ్యాపీ బర్త్ డే నందమూరి కళ్యాణ్ రామ్ (Twitter/Photo)

హ్యాపీ బర్త్ డే నందమూరి కళ్యాణ్ రామ్ (Twitter/Photo)

Happy Birthday Nandamuri Kalyan Ram NKR: బాలగోపాలుడుగా సినీ రంగంలో అడుగుపెట్టి..‘తొలిచూపులోనే’ తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న సినీ అభిమన్యుడు నందమూరి కళ్యాణ్ రామ్. హీరోగా, నిర్మాతగా సత్తా చాటుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా కొన్ని విశేషాలు..

ఇంకా చదవండి ...
Happy Birthday Nandamuri Kalyan Ram NKR: బాలగోపాలుడుగా సినీ రంగంలో అడుగుపెట్టి..‘తొలిచూపులోనే’ తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న సినీ అభిమన్యుడు. చలనచిత్ర రంగంలో ఎంతో మంది గాడ్ పాదర్స్ వున్న తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో ‘అతనొక్కడే’. సినీ నిర్మాణం అసాధ్యమనుకుంటున్న ఈ రోజుల్లో కథానాయకుడిగా..అబిరుచిగల నిర్మాత జయాలను అందుకుంటున్న ‘అసాధ్యడు’. అతడే నందమూరి కళ్యాణ్ రామ్. ఈ నందమూరి కథానాయకుడి బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్ స్టోరీ. నందమూరి నట వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టినా... ఎక్కడా తాత, తండ్రి, బాబాయి, సోదరుల పేర్లు ఎక్కడ ఎక్కువగా యూజ్ చేసుకోకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు కళ్యాణ్ రామ్.

వివాదాలకు, రాజకీయాలకు దూరంగా తన పనేంటో తాను సైలెంట్ గా చేసుకుపోతున్నారు. గతేడాది ‘ఎంత మంచివాడవురా సినిమాతో పలకరించిన ఈ నందమూరి కథానాయకుడు.. ఇపుడు ‘బింబిసార’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.

Bimbisara Nandamuri Kalyan Ram as Bimbisaram NKR 18
‘బింబిసార’గా నందమూరి కళ్యాణ్ రామ్ (Twitter/Photo)


తాత స్వర్గీయ ఎన్టీఆర్ బాటలోనే నటుడిగా...అభిరుచిగల నిర్మాతగా రాణిస్తున్నారు. కథల విషయంలో రాజీ పడకుండా తన టేస్టుకు తగ్గట్టు సినిమాలు నిర్మిస్తున్నాడు. ఒకపక్క తమ్ముడు ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణలతో ఎలాంటి పోటీ లేకుండా తనకంటూ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు సినీ ప్రేక్షక లోకంలో తనకంటూ ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. తన తోటి సోదరుడు తారకరత్న హీరోగా వచ్చి ఫేడౌట్ అయిన మాస్ హీరోగా నందమూరి అభిమానుల్ని అలరిస్తున్నారు కళ్యాణ్ రామ్.

Kalyan Ram 118 Movie To Release 118 locations in USA, కళ్యాణ్ రామ్‌ ‘118’ మూవీకి యూఎస్‌లో పెరిగిన 118 లొకేషన్స్.. 118 us Collections, 118 to Release 118 locations in US, 118 first day collections, 118 movie first day world wide collections, kalyan ram 118 movie First day world Wide collections, kalyan Ram 118 movie Collections, 118 movie review, telugu cinema, Kalyan Ram, jabardasth, ntr kalyan Ram, NBK Films, tollywood news, 118 ఫస్ట్ డే కలెక్షన్స్, 118 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్, 118 మూవీ వాల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్, కళ్యాణ్ రామ్ 118 ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్, 118 లొకేషన్స్‌లో 118 రిలీజ్, కళ్యాణ్ రామ్ 118 మూవీకి యూఎస్‌లో పెరగిన లొకేషన్స్, జబర్ధస్త్, టాలీవు్డ న్యూస్, తెలుగు సినిమా,
118 మూవీ రివ్యూ


ఒక పక్క హీరోగా నటిస్తూనే...ప్రొడ్యూసర్ గా తెలుగులో తొలి 3D యాక్షన్ మూవీగా ‘ఓం’ సినిమాను తీసి ...నిర్మాతగా తన గట్స్ ఏంటో చూపించారు.హీరో అంటే అందంగా జుట్టుతో ఉండాలన్న టాలీవుడ్ రూల్స్ ను ఓం సినిమాతో బ్రేక్ చేసారు కళ్యాణ్ రామ్. స్టోరీ డిమాండ్ చేస్తే గుండుతో కనిపించాడినికి కూడా వెనకాడకుండా ఆయా పాత్రలకు నిండుదనం చేకూర్చారు. హీరోగా తన స్వీయ నిర్మాణంలో సినిమాలు నిర్మించడమే కాకుండా తోటి హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. మాస్ రాజా రవితేజతో తను సినీ రంగానికి పరిచయం చేసిన సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ‘కిక్ 2’ సినిమాను నిర్మించారు.

హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ రామ్ (Twitter/Photo)


ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఆ తర్వాత తమ్ముడు ఎన్టీఆర్‌తో బాబీ డైరెక్షన్‌లో చేసిన ‘జై లవకుశ’ మంచి విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు ఈ యేడాది తన తాతా నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాబాయి బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో బాబాయి బాలకృష్ణ.. ఎన్టీఆర్ పాత్రలో నటిస్తే.. కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చేదు ఫలితాన్ని అందుకున్న నటుడిగా కళ్యాణ్ రామ్‌కు మాత్రం తీపి జ్ఞాపకాన్నే మిగిల్చింది.

NTR Mahanayakudu movie Censor Completed with U certificate and movie is very Emotional pk.. క‌థానాయ‌కుడు ఫ్లాప్ త‌ర్వాత మ‌హానాయ‌కుడు సినిమాపై నిజంగానే అంచ‌నాలు త‌గ్గిపోయాయి. కానీ ఈ చిత్రంతో క‌చ్చితంగా తానేంటో చూపిస్తానంటున్నాడు బాల‌య్య‌. ఇప్పుడు ఈ చిత్ర సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రెండో భాగంగా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు వ‌స్తుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. ntr mahanayakudu censor,ntr mahanayakudu censor review,ntr mahanayakudu censor completed U certificate,compansate,ntr mahanayakudu censor review,ntr mahanayakudu release date,ntr mahanayakudu distributors,ntr mahanayakudu buyers free,theatrical rights of NTR Mahanayakudu for free,NTR Mahanayakudu compensate Distributors,Balakrishna to compensate NTR Kathanayakudu losses,NTR Kathanayakudu losses,balakrishna ntr biopic,kathanayakudu collections,kathanayakudu losses compensate with mahanayakudu,ntr kathanayakudu mahanayakudu,telugu cinema,krish balakrishna,ఎన్టీఆర్ మహానాయకుడు సెన్సార్,ఎన్టీఆర్ మహానాయకుడు సెన్సార్ రివ్యూ,ఎన్టీఆర్ కథానాయకుడు,కథానాయకుడు నష్టాలు,మహానాయకుడు సినిమాను ఉచితంగా ఇస్తున్న బాలయ్య,బయ్యర్లకు మహానాయకుడు ఉచితం, రైట్స్ ఉచితంగా ఇస్తున్న బాలకృష్ణ, మహానాయకుడు నష్టాలు,కథానాయకుడు మహానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్, హరికృష్ణ పాత్రల్లో బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ (ట్విట్టర్ ఫోటో)


ఈ సినిమా తర్వాత ‘118’ అంటూ చేసిన థ్రిల్లర్ మూవీ నటుడిగా కళ్యాణ్‌రామ్‌కు మంచి విజయాన్నే అందించింది. ఆ తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘ఎంతమంచివాడవురా’ సినిమాతో పలకరించారు. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. సరైన ఫలితాన్ని అందుకోలేదు.

హ్యాపీ బర్త్ డే నందమూరి కళ్యాణ్ రామ్ (Twitter/Photo)


ఇపుడు కొత్త దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ‘బింబిసార’ అనే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నారు. మరోవైపు నవీన్ మేడారం దర్శకత్వంలో కొత్త సినిమాను అనౌన్స్ చేసారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ రోజు సాయంత్రం  ప్రకటించనున్నారు.

కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం పోస్టర్ (Twitter/Photo)


‘అన్ రిటన్ ఛాప్టర్ ఇన్ హిస్టరీ’ అంటూ ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. చేతిలో గొడగుతో రైలు పట్టాలపై వెళుతున్నట్టు ఉన్న కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.  మరోవైపు ‘రావణ’ అనే డిఫరెంట్ మూవీ చేయనున్నారు. ఇంకోవైపు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర కొత్త దర్శకుడితో మరో సినిమా చేయనున్నారు. మొత్తానికి డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్‌కు మరోసారి బర్త్ డే విషెస్ అందజేద్దాం.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bimbisara Movie, Kalyan Ram Nandamuri, NKR, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు