HAPPY BIRTHDAY NAGA SHAURYA KRISHNA VRINDA VIHARI FIRST LOOK POSTER RELEASED TA
HBD Naga Shaurya : నాగ శౌర్య బర్త్ డే సంద్భంగా ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)
HBD Naga Shaurya : నాగ శౌర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన పుట్టినరోజు సందర్భంగా ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
HBD Naga Shaurya : నాగ శౌర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన 22 జనవరి 1989న తూర్ప గోదావరి జిల్లా ఏలూరిలో జన్మించిన ఇతను.. విజయవాడలో పెరిగాడు. ఆ తర్వాతా వీరి ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిప్ట్ అయింది. ఇక నాగ శౌర్య 2011లో వచ్చిన ‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ‘చందమామ కథలు’ సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘ఊహాలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాలు నాగ శౌర్యకు పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత ‘జాదూగాడు’ సినిమాతో మాస్ హీరో ట్రై చేసాడు. ఆ తర్వాత ‘జ్యో అచ్యుతానందా’ ‘అబ్బాయితో అమ్మాయి’, ‘కళ్యాణ వైభోగమే’ ‘ఒక మనసు’ చిత్రాల్లో అంత గొప్పగా ఆడలేదు.
ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛలో’ సినిమాతో మంచి సక్సెస్ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. గతేడాది ‘వరుడు కావాలెను’, ‘లక్ష్య’ సినిమాలతో పలకరించినా.. అంత పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం నాగ శౌర్య చేతిలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ‘నారీ నారీ నడుమ మురారి’ ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈయన అనీష్ కృష్ణ దర్శకత్వంలో ‘కృష్ణం వ్రింద విహారి’ సినిమాతో పలకరించనున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫోటోలో సాంప్రదాయంగా కనిపిస్తూ.. కలశంలోని నీటిని చిలకరిస్తూ కనిపిస్తున్నాడు.
రీసెంట్గా యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ (Ritu Varma) జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ‘వరుడు కావలెను’. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 29 న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదలై జస్ట్ ఓకే అనిపించింది. కొన్ని సినిమాలు టాక్ బాగున్నా.. థియేటర్స్‌లో అంతగా ఆకట్టుకోవు. కానీ ఓటీటీ వేదికగా కొన్ని సినమాలు అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటూ వుంటాయి. అలాంటి కోవలో ‘వరుడు కావాలెను’ మూవీ ఒకటి. ఈ సినిమాను లక్ష్మీ సౌజన్యను తెరకెక్కించారు. అయితే.. బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అయిన ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను విశాల్ చంద్ర సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ వాళ్లు నిర్మించారు.
ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు.
ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంది. ఈ పాటపై కొందరు విమర్శలు చేశారు. దిగు దిగు నాగ అంటూ వచ్చిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా మసాలా పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. ‘వరుడు కావలెను’ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.