హోమ్ /వార్తలు /సినిమా /

HBD Mohan Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెదరాయుడు.. నట ప్రపూర్ణ మోహన్ బాబు..

HBD Mohan Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెదరాయుడు.. నట ప్రపూర్ణ మోహన్ బాబు..

హ్యాపీ బర్త్ డే మోహన్ బాబు (File/Photo)

హ్యాపీ బర్త్ డే మోహన్ బాబు (File/Photo)

Happy Birthday Mancu Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన రూటే సెపరేటు. తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. డైలాగ్ కొడితే ఆయనే కొట్టాలి. అదీ మోహన్ బాబు అంటే. ఈ రోజు ఈ నట ప్రపూర్ణుడు పుట్టినరోజు సందర్భంగా ఈయన సినీ, రాజకీయానికి సంబంధించిన కొన్ని విశేషాలు..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Happy Birthday Mancu Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన రూటే సెపరేటు. తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. డైలాగ్ కొడితే ఆయనే కొట్టాలి. అదీ మోహన్ బాబు అంటే. ‘అసెంబ్లీ రౌడీ’గా మాస్ ఆడియన్స్‌ను మెప్పించినా...‘అల్లుడుగారి’గా క్లాస్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసిన అది ఆయనకే చెల్లింది. నలభై ఆరేళ్ల ఏళ్ల క్రితం ‘స్వర్గం నరకం’తో మొదలైన నటప్రపూర్ణుని నట ప్రస్థానం స్వర్గం నరకంలానే ఎన్నో ఎత్తు పల్లాలతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నేడు మోహన్ బాబు పుట్టినరోజు.  మోహన్ బాబు టాలీవుడ్ పెదరాయుడు. అంతేకాదు.. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ ఇలాంటి బిరుదులెన్నో ఆయన నటనకు దాసోహం అన్నాయి.ఒకవైపు నటుడిగా 550 పైగా సిన్మాలు...నిర్మాతగా 50 పైగా చిత్రాలు. అటు మాజీ రాజ్యసభ సభ్యుడు..  ఇది మోహన్ బాబు ట్రాక్ రికార్డు.

ఒక వైపు సినిమా నటుడిగా ఉంటూనే  రాజకీయ నాయకుడిగా...విద్యాసంస్థల అధినేతగా అటు సినీ, సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన అతికొద్ది నటుల్లో మోహన్ బాబు ఒకరు.నటుడిగా ఒక మూసకు పరిమితం కాకుండా...హీరోగా...విలన్ గా...కమెడియన్ గా...క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం మోహన్ బాబు ప్రత్యేకత. ఈయన 19 మార్చి 1952 లో మంచు నారాయణ స్వామి, మంచు లక్ష్మమ్మలకు పెద్ద కుమారుడిగా తిరుపతి సమీపంలోని మోదుగుల పాలెంలో జన్మించారు.

మోహన్ బాబు పుట్టినరోజు నేడు (Twitter/Photo)

తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. డైలాగ్ కొడితే మోహన్ బాబే కొట్టాలి.. ఇదీ ఆయన రేంజ్. నటుడిగా తొలి నుంచి మోహన్ బాబు రూటు సెపరేటే అని చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే విలనిజం, మేనరిజం, హీరోయిజాన్ని కలబోసుకున్న విలక్షణమైన నటన మోహన్ బాబు సొంతం.

’స్వర్గం నరకం’మూవీతో హీరోగా పరిచమైన మోహన్ బాబు (Twitter/Photo)

మోహన్ బాబు నటనకు 47యేళ్లు పూర్తి చేసుకొని ఇప్పటికీ తన నటనను కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా ఆయన నటన మాత్రం ఎక్కడ తగ్గలేదు. అదే ఉత్సహంతో .. అదే స్టైయిల్ తో, అంతే క్రేజ్ తో సినిమాలను చేస్తూనే ఉన్నారు. క్యారెక్టరైజేషన్ మేనరిజంతో ప్రేక్షకులను మేస్మరైజ్ చేస్తున్నాడు. ఆయన కోసం ఇప్పటికి కొత్త కొత్త పాత్రలు పుడుతూనే ఉన్నాయి.తెలుగు చిత్ర పరిశ్రమలో మోహన్ బాబుది ఓ విలక్షణమైన శైలి. దేనికి వెరవని తత్వం. ఎవరికి లొంగని మనస్తత్వం. అందరిని అక్కున చేర్చుకునే తత్వం. నటుడిగా, నిర్మాతగా, కథకుడిగా ఆయన రూటే సెపరేటు. సినిమా సినిమాకు నటనలో కొత్త వైవిధ్యాన్ని చూపిస్తూ.. విలక్షణమైన నటుడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు మోహన్ బాబు. పెదరాయుడిగా, శ్రీరాములయ్య గా, అడవిలో అన్నలాంటి పాత్రలు నటుడిగా ఆయన స్థాయిని పెంచాయి.

అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబు (Twitter/Photo)

నటుడిగా ఆయన ఒక భాషకే పరిమితం కాలేదు. తొలినాళ్లలో హీరోగా కెరీర్ ప్రారంభించి.. ఆ తరువాత విలన్ గా టర్న్ తీసుకున్నారు.  కామెడీ విలన్ గానూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. తరువాత హీరోగా మారి నటుడిగా ఆయన టాలెంట్ నిరూపించుకున్నాడు ఈ అధిపతి.మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఫిజిక్స్ లో డిగ్రీ చదివి.. ఫిజికల్ ట్రైనర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి సినిమాల్లోకొచ్చి మోహన్ బాబుగా పేరు మార్చుకున్నారు. నారాయణస్వామి నాయుడు జన్మనిస్తే.. మోహన్ బాబుకు నటుడిగా జన్మనిచ్చింది దాసరి నారాయణరావు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం- నరకం చిత్రంలో నటనతో లైమ్ లైట్ లోకొచ్చారు మోహన్ బాబు. హీరోగా పరిచయమై.. విలన్‌గా కమెడియన్‌గా.. ఆపై హీరోగా కెరీర్ కొనసాగించిన భారతీయ చిత్ర పరిశ్రమలో మోమన్ బాబు ఒక్కరే అని చెప్పాలి. ఎన్ని సార్లు కింద పడ్డా.. మళ్లీ గోడకు కొట్టిన బంతిలా పైకెచ్చారు.

దాసరి నారాయణరావుతో మోహన్ బాబు (Twitter/Photo)

మోహన్ బాబు కెరీర్ ఫస్ట్ డేస్ లో కామెడీ విలన్ వేషాలెక్కువ వేశారు. మోహన్ బాబు సీన్లోకి ఎంటరైతే చాలు.. ఆ హంగామా వేరు. తనదైన పంచ్ డైలాగ్ పవర్ తో సీన్లకు సీన్లు రక్తి కట్టించే వారు. ఇప్పటికీ ఆ ఫ్లో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మోహన్ బాబు వేసే పాత్ర చిన్నదైనా దాని పవర్ సినిమాలో హెవీగా ఉంటుంది. దర్శకులు చెప్పినదానికి తనవైన కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కేరెక్టర్ హైలెట్ అయ్యేలా చూసుకునే వారు. మేనరిజమ్స్ కు మేనమామ మోహన్ బాబు. డైలాగ్ నుంచి.. యాక్షన్ మూమెంట్స్ వరకూ.. ఆయనిచ్చినన్ని వేరియేషన్స్ మరే నటులూ ఇవ్వలేరు. డైరెక్టర్ చెప్పారు- మనం చేసాం అన్నది మోహన్ బాబు స్టైలే కాదు. కేరెక్టర్ కి తనదైన స్పెషాలిటీ అప్లై చేసి సెపరేటు క్రేజ్ తెస్తారు. కెరీర్‌లో తొలిసారి తన నిజమైన పేరు భక్తవత్సలం నాయుడుగా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో కనిపించడం విశేషం.

‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో మోహన్ బాబు (Twitter/Photo)

మోహన్ బాబు చేసిన విలనీకి హీరోల హీరోయిజం పీక్ కి చేరేది. అందుకు పదహారేళ్ల వయసు, ప్రేమాభిషేకం, దేవత వంటి చిత్రాలే ఉదాహరణ. ఈ చిత్రాల్లో మోహన్ బాబు నటనకు మంచి రెస్పాన్స్ లభించింది.ఒకటా రెండా ఏ పెద్ద సినిమా చూసినా అందులో మోహన్ బాబు పాత్ర కంపల్సరీ. అందులోనూ ప్రేక్షకులు కసిదీరా తిట్టుకునే కేరెక్టర్లు వేయడంలో మోహన్ బాబుది.. మొదటి ప్లేసు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు మోహన్ బాబు పాత్రను తిడుతూ హాలు నుంచి బయటికొచ్చేవారు అప్పట్లో అంటే ఆయన విలనిజం ఎలా ఉండేదో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.

నటుడిగా, నిర్మాతగా, విద్యా సంస్థల అధినేతగా, రాజకీయ నేతగా మోహన్ బాబు ప్రత్యేక శైలి (Twitter/Photo)

నైన్టీస్ వరకూ దాదాపు.. మోహన్ బాబు కన్నింగ్ విలన్, కామెడీ విలన్ వేషాలను ఎక్కువగా వేశారు. తొంభై దశకం ప్రారంభంలో ‘అల్లుడుగారు’ వంటి చిత్రాలతో హీరో కేరెక్టర్లకు షిఫ్టయ్యారు. అక్కడి నుంచీ ఆయన ఓ పది సినిమాల్లో మాములు కేరెక్టర్ వేస్తే.. ఓ సినిమా హీరోగా చేసేవారు.మోహన్ బాబు హీరోగా నటించిన అసెంబ్లీ రౌడీ పెద్ద హిట్. అక్కడి నుంచి కలెక్షన్ కింగ్ అన్న పేరొచ్చింది. రౌడీగారి పెళ్లాం, అల్లరి మొగుడు, బ్రహ్మ, సిల్వర్ జూబ్లీ హిట్స్ తో ఆ పేరు స్థిరపడిపోయింది.

‘అల్లుడుగారు’ మూవీలో మోహన్ బాబు (Twitter/Photo)

మోహన్ బాబు, రజనీకాంత్ లు బెస్ట్ ఫ్రెండ్స్.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పెదరాయుడు పెద్ద హిట్. 650రోజుల పైగా ఆడిన ఈ సినిమాలో.. డ్యూయల్ రోల్ చేశారు మోహన్ బాబు. ఇందులోని డైలాగులు ఇప్పటికీ హైలట్టే. ఈ కేరెక్టర్ కు గానూ బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అందుకున్నారు.మోహన్ బాబు సినిమాలు అంటే డైలాగ్స్ పెట్టింది పేరు.

తెలుగులో మోహన్‌బాబుతో రజినీకంత్ ప్రత్యేక అనుబంధం (Youtube/Credit)

ఆయన డైలాగ్ డెలువరీ చేస్తుంటే అభిమానులకు మతి పోవాల్సిందే. అదే ఆయన్ను డైలాగ్ కింగ్  అనేపేరు కూడా ఉంది. ఆయన డైలాగ్ డెలవరి నేటికి కూడా ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా అరిస్తే కరుస్తా.. కరిస్తే చరుస్తా.. చరిస్తే ఇక్కడి నుంచి నిష్క్రమిస్తా వంటి డైలాగ్ ఇప్పటికి ప్రేక్షకుల గుండెల్లో నిలిచే ఉన్నాయి.ఇటు సినిమాల్లో యాక్ట్ చేస్తూనే- నిర్మాతగా మారారు మోహన్ బాబు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి.. 50కి పైగా చిత్రాలను నిర్మించారు. వీటిలో అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్, వంటి ఎన్నో సూపర్ హిట్  చిత్రాలున్నాయి.

అడివిలో అన్నలో మోహన్ బాబు (Twitter/Photo)

పెదరాయుడు తర్వాత కలెక్టర్ గారు, అడవిలో అన్న, రాయలసీమ రామన్న చౌదరి వంటి చిత్రాల్లో హీరోగా చేశారాయన. తర్వాత వచ్చిన ‘తప్పు చేసి పప్పు కూడు’, ‘శివశంకర్’ లాంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. తర్వాత ‘యమదొంగ’ వంటి సినిమాల్లో మళ్లీ కేరెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకున్నారు.మహానటిలో ఎస్వీఆర్ పాత్రలో నటించారు.అటు అన్నఎన్టీఆర్‌తో ఈయనకు ప్రత్యేక అనుబంధం ఉంది.

అన్న ఎన్టీఆర్‌తో ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాను తెరకెక్కించిన మోహన్ బాబు

మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మనోజ్ లు కూడా హీరోలుగా చేస్తున్నారు. కూతురు ల క్ష్మి ప్రసన్న నటిగా, టీవీషోస్ హోస్ట్‌గా ప్రెజంటర్ గా బిజీగా వున్నారు. అన్న ఎన్టీఆర్ ప్రోద్బలంలో టీడీపీలో చేరిన  మోహన్ బాబు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగానూ తన సేవలందించారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి అలా కూడా సొసైటీకి సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూనే.. బీజేపీతో సఖ్యతగా మెలుగుతున్నారు. కరోనా టైమ్‌లో  ఈయన సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో ముఖ్యపాత్రలో మెరిసారు. త్వరలో ఈయన సన్నాఫ్ ఇండియా సినిమాతో పలకరించారు. చాలా యేళ్ల తర్వాత  మోహన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల తిరస్కరానికీ గురైంది.  దీంతో పాటు ‘శాకుంతలం’సినిమాలో దుర్వాస ముని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

శాకుంతలం మూవీలో దుర్వాస ముని పాత్రలో మోహన్ బాబు (Twitter/Photo)

మోహన్ బాబు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన నటనకు అనేక అవార్డులు నడుచుకుంటూ వచ్చాయి. నటప్రపూర్ణ, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ వంటి బిరుదులు ఆయన సొంతం. మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమలో మోహన్ బాబుది ప్రత్యేక శైలి అనే చెప్పాలి.

First published:

Tags: Mohan Babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు