మహేష్ బర్త్ డే సందర్భంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని మహేష్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ లో మహేశ్ ఆర్మీ ఆఫీసర్ అజయ్‌కృష్ణగా కనిపిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది. మహేష్ బర్త్ డే సందర్భంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని మహేష్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ లో మహేశ్ ఆర్మీ ఆఫీసర్ అజయ్‌కృష్ణగా కనిపిస్తున్నారు. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ సాగిన బ్యాగ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. ఎఫ్ 2 సినిమాతో బంపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అలాగే ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం హైలైట్. ఏకే ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.