హోమ్ /వార్తలు /సినిమా /

HBDSPBalu: గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి ఈ నిజాలు తెలుసా..

HBDSPBalu: గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గురించి ఈ నిజాలు తెలుసా..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (Twitter/Photo)

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (Twitter/Photo)

ఆయన గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలుస్తాయి. ఆయన పాట పంచామృతం.  ఆయన గానం స్వరరాగ నాదామృతం. నేడు గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు.

ఆయన గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలుస్తాయి. ఆయన పాట పంచామృతం. ఆయన గానం స్వరరాగ నాదామృతం. దివిలో తిరగాడే గంధర్వులు భువికి దిగి వచ్చి పాడినట్లుగా ఉంటుందా గాత్రం. ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి. ఆయనే గాన గంధర్వుడు పద్మభూషణ్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం. నేడు బాలు బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్...బాలు గొంతులో భక్తి తొణికిసలాడుతుంది. విరహము ఉంటుంది. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి. పాటలోని మాటలను ...గొంతులో అభినయ ముద్రలుగా నిలిపి తెలుగుదనం ఒలికించిన విలక్షణ గాయకుడు బాలసుబ్రమణ్యం. ఆయన గొంతకు తరాల అంతరాలు తెలియదు.

SP Bala Subrahmanyam donated his ancestral home in Thipparaju Vari street Nellore to Kanchi Veda Patashaala,S. P. Balasubrahmanyam,sp Balasubrahmanyam own house donated to kanchi kamakoti peetham,sp balu Vijayendra Saraswati,tollywood,telugu cinema,tollywood,telugu cinema,ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం,ఎస్పీ బాలు,వేద పాఠశాల,ఎస్పీ బాలు వేద పాఠశాల,కంచి కామకోటి పీఠం,విజయేంద్ర సరస్వతి
ఎస్పీ బాలసుబ్రమణ్యం

బాలసుబ్రహ్మణ్యం.. ,1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది.ఎంతమంది కథానాయకులకైనా తన అద్భుతమైన స్వరంతో వారికి అనుగుణంగా పాటలు పాడగల గొప్పగాయకుడు ఎస్. పి. బీ. తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం బాలసుబ్రహ్మణ్యం.  తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరువాత లభించిన సిసలైన వారసుడు బాలసుబ్రహ్మణ్యం.

sp balasubramaniam, sp balasubramaniam comments on Chennai water crisis, tamilnadu, singer sp balasubramaniam, tamilnadu water crisis, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చెన్నై నీటి కష్టాలపై ఎస్పీ బాలు కామెంట్స్, తమిళనాడు, సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తమిళనాడు నీటి కష్టాలు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం

గాయకుడిగా కెరీర్ ప్రారంభించాక ఆయనకు పెద్ద స్టార్స్ కు పాడే అవకాశం రాలేదు. కేవలం అప్పుడే వస్తున్న అప్ కమింగ్ హీరోలకే పాడే అవకాశం మాత్రమే వచ్చేది. అప్పటికే ఎన్టీఆర్, ఏన్నార్ లకు ఘంటసాల తప్ప ఎవరు పాడినా.. ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు. అయిన అడపా దడపా ఘంటసాలతో గొంతు కలిపే పాడే అరుదైన అవకాశాలు.. బాలుకు రానే వచ్చాయి. ప్రతిరాత్రి వసంత రాత్రి.. ప్రతిగాలి పైర గాలి.. అంటూ ‘ఏకవీర’ లో అమర గాయకుడు ఘంటసాల తో బాలు ఆలపించిన గానం నేటికి శ్రోతలను హమ్ చేసుకునేలా ఉంటాయి.

అమర గాయకుడు ఘంటసాలతో ఎస్పీ బాలు (File/Photo)

ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కైయ్యాడు బాల సుబ్రహ్మణ్యం. సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ..సన్నివేశ బలానికి తగినట్టు నటనను గాత్రంలో ప్రస్పుటంగా ప్రకటించగల గాయకుడు ఎప్పీ. ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు.

శంకరాభరణం చిత్రానికి తొలిసారి జాతీయ అవార్డు అందుకున్న బాలు (File/Photos)

పదాల మాధుర్యాన్ని గమనించి.. బాలూ చేసే ఉచ్చారణ పాటను పండిత పామరులకి చేరువ చేసింది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి.. ప్రాణం పోశారు. ఒక పాట విన్న తర్వాత ఆ పాట ఏ హీరోదో చెప్పడం అది బాలూ పాడితేనే సాధ్యం. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటాడు బాలూ. హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో..  అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఈ విధంగా తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ లాంటి నాలుగు భాషల్లో కలిపి ఆరు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడిగా నిలవడం ఒక్క బాలసుబ్రహ్మణ్యానికే చెల్లింది.

ఏక్ దూజే కే లియే సినిమాకు మరో నేషనల్ అవార్డు (File/Photo)

‘చెల్లెలి కాపురం’ లో బాలు పాడిన.. చరణ కింకరులు ఘల్లు ఘల్లు మన...కర కంకణములు గల గల లాడగా అంటూ ఎస్పీ తన గొంతులో పలికించిన వేరియేషన్స్ శ్రోతల మదిలో ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. ఏపాట పాడినా.. ఆ పాటకే అందం వచ్చేంతగా ఆలపించడం బాలు కి తప్పించి మరొకరికి సాధ్యం కాదు. భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడ్డంలో బాలూ శైలే వేరు. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం చిత్రాలలో ఎస్పీ ఆలపించిన భక్తి గీతాలు ఇప్పటకి ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉన్నాయి.

న గంధర్వుడు పద్మభూషణ్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం. నేడు బాలు బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్...
ఇతర గాయకులతో ఎస్పీ బాలు (File/Photo)

గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించాడు బాలు. సంగీత దర్శకుడిగా యాభై చిత్రాల వరకూ మ్యూజిక్ అందించాడు. నిర్మాతగా ఆదిత్య369, శుభసంకల్పం, భామనే సత్యభామనే, వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తన అభిరుచి  చాటుకున్నాడు. బాలసుబ్రమణ్యం పాటలు పాడుతుంటే వినేవారికి మాటలు రావు. ఓ పాపా లాలి చిత్రంలో ‘మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు’ అంటూ...బాలూ నటించి, ఆలపించిన బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.

నటుడిగా పలు చిత్రాల్లో మెప్పించిన ఎస్పీ బాలు (Twitter/Photo)

నాడు ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరి పాట తెలియని సంగీత రసజ్ఞులు ఉండరు. తన గురువు ఘంటసాల బాటలో ‘భైరవ ద్వీపం’లో బాలూ పాడిన శ్రీ తుంబుర నారద నాదామృతం పాటలో..బాలూ ఆలపించిన గంధర్వ గానం శ్రోతలకు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.నాలుగు దశాబ్దాల్లో...11భాషల్లో 50వేల పాటలు పాడి గిన్నీస్ రికార్డు నెలకొల్పాడు బాలు. ఆయన అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలకు లెక్కే లేదు.

అప్పటి రాష్ట్రపతి నుంచి పద్మభూషణ్ అవార్డు స్వీకిరంచిన బాలు (Twitter/Photo)

రీసెంట్‌గా నెల్లూరిలో ఉన్న సొంత ఇంటిని శంకరాచార్య పీఠానికి ఇచ్చారు.  ఉత్తమ గాయకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డు. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మక  పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నాడు. అందుకే బాలు నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం నేటికి కొనసాగుతునే ఉంది.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood, Kollywood, S. P. Balasubrahmanyam, Tollywood

ఉత్తమ కథలు