Happy Birthday Rajasekhar: డాక్టర్ రాజశేఖర్ ఫ్యామిలీ ప్రేక్షకులను అన్నగా మెప్పించి మా అన్నయ్య. అక్క మొగుడుగా..అల్లరి ప్రియుడుగా అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టిన మగాడు..తెరపై విలన్స్‌తో ఎవడైతే నాకేంటి అని మూడో కన్నుతెరిచే శివయ్య. ఆగ్రహంలో కానీ, అల్లరిలోకానీ, తనదైన ప్రత్యేకమైన నటన కనబరిచినా అది ఆయనకే చెల్లింది. మ్యానరిజంలో తన స్టైలే వేరని నిరూపించి... యాంగ్రీ యంగ్ మాన్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాందించుకున్న గ్యాంగ్ మాస్టర్. ఈ రోజు డాక్టర్ రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్. రాజశేఖర్ అంటే ముఖ్యంగా గుర్తుకువచ్చేవి యాంగ్రీ మ్యాన్ పాత్రలై అయినా..ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యే పాత్రలతో కూడా మెప్పించి కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.ఎన్నో సినిమాలతో తనదైన నటనతో ఆకట్టుకున్న రాజశేఖర్ 1962 ఫిబ్రవరి 4న తమిళనాడులోని లక్ష్మీపురంలో జన్మించారు. నేటితో రాజశేఖర్‌కు 61వ యేట అడుగుపెట్టాడు.
చాలామంది నటులు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతారు. కానీ రాజశేఖర్ నటుడు కాక ముందే డాక్టర్. సినిమా ఇండస్ట్రీకి రాకముందే ఎమ్.బి.బి ఎస్ చేసి చెన్నైలో డాక్టర్‌గా ప్రాక్టీస్ కూడా పెట్టారు. రాజశేఖర్ మొదటిసారి భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా ‘పుదుమాయ్ పెన్’ చిత్రంతో తెరంగేట్రం చేసారు. ఆ తర్వాత 1885 లో హీరో గోపీచంద్ వాళ్ల నాన్న టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వందేమాతరం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ సినిమా తర్వాత నటుడుగా గుర్తింపు తెచ్చే సినిమాలు చేసినా... బ్రేక్ నిచ్చిన మూవీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తలంబ్రాలు’...ఈ సినిమా కథ,కథనంతో పాటు..పాటలు కూడా కొత్తగా ఉండి సూపర్ హిట్ అయ్యింది. లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ తనదైన విలనిజం పండించారు.
తెరమీద హీరోగా రాజశేఖర్ నటనకు తెరవెనుక డబ్బింగ్ తో సాయికుమార్ ప్రాణం పోసేవాడు. వీరిద్దరి కాంబినేషన్ వల్లే రాజశేఖర్ ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రాజ శేఖర్ కెరీర్‌లో ‘శ్రుతిలయలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’, ‘మగాడు’, ‘అన్న’, అల్లరి ప్రియుడు’ ‘శివయ్య’, ‘మనసున్నమారాజు’, ‘మా అన్నయ్య’, సింహరాశి, ‘ఎవడైతే నాకేంటి’, ‘గోరింటాకు’ ,‘PSV గరుడ వేగ’ లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి..
రాజశేఖర్, జీవిత హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యి వీరిద్దరి జంట హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది...రీల్ లైఫ్ లో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీళ్లిద్దరు ఆ తర్వాత నిజ జీవిత భాగస్వాములయ్యారు.
యాంగ్రీయంగ్ మ్యాన్ గా ఎన్నో సక్సెస్‌లు అందుకున్న రాజశేఖర్ కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ సినిమాతో అమ్మాయిల మనసుదోచే లవర్ బాయ్ గా మారాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి రాజశేఖర్ ను ప్లే బాయ్‌గా కూడా నిరూపించింది. అంతేకాదు అప్పటి సీనియర్ టాప్ హీరోలైనా.. చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చారు.
కెరీర్ లో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్... ఆ మధ్య ‘PSV గరుడవేగ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. అంతేకాదు ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత కోలుకున్నారు.
అంతేకాదు తన భార్య జీవిత దర్శకత్వంలో ‘శేఖర్’ సినిమా చేసారు. ఈ చిత్రంలో రాజశేఖర్ తనయ శివానీతో తొలిసారి కలిసి యాక్ట చేసారు. దీంతో పాటు మర్మాణువు అనే మరో మూవీ చేస్తున్నారు.దాంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒకప్పటితో పోలిస్తే.. హీరోగా మార్కెట్ పడిపోయింది. ఇక రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక హీరోయిన్స్‌గా టాలీవుడ్‌లో లక్ పరీక్షించుకుంటున్నారు. ఏమైనా టాలీవుడ్ సినీ హీరోగా రాజశేఖర్‌కు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dr Rajashekar, Tollywood