Home /News /movies /

HAPPY BIRTHDAY DIALOGUE KING SAI KUMAR DO YOU FACTS ABOUT HIS FILM JOURNEY TA

HBD Sai Kumar: అమితాబ్ టూ రజినీకాంత్.. సాయి కుమార్ డైలాగ్ చెబితే అదిరిపోవాల్సిందే..

హ్యాపీ బర్త్ డే డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Twitter/Photo)

హ్యాపీ బర్త్ డే డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Twitter/Photo)

Happy Birthday Sai Kumar: అమితాబ్ టూ రజినీకాంత్.. సాయి కుమార్ ఏ హీరోకు  డైలాగ్ చెబితే అదిరిపోవాల్సిందే.. ఈ రోజు డైలాగ్ కింగ్ సాయి కుమార్ పుట్టినరోజు..

Happy Birthday Sai Kumar: అమితాబ్ టూ రజినీకాంత్.. సాయి కుమార్ ఏ హీరోకు  డైలాగ్ చెబితే అదిరిపోవాల్సిందే.. అంతలా వేరే భాషల్లో యాక్ట్ చేసిన హీరోలకు తన తెలుగు డబ్బింగ్‌తో వాళ్లకు మనకు దగ్గర చేసారు. ముఖ్యంగా  రజినీకాంత్ భాషా సినిమా చూసారా...అందులో రజినీ..భాషా ఒక్కసారి చెబితే...వంద సార్లు చెప్పినట్టు అనే డైలాగ్ గుర్తుంది కదా. రజినీకాంత్ చెప్పిన డైలాగులు థియేటర్స్‌లో పేలడం వెనక వున్న వ్యక్తి ఎవరో కాదు డైలాగ్ కింగ్ సాయి కుమార్. తన వాయిస్‌తో భాషా సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. అంతేకాదు ’పెదరాయుడు’ లో రజినీకాంత్ చేసిన పాపారాయుడు పాత్రకు తన గాత్రంతో జీవం పోసారు సాయి కుమార్.

ఒక్క రజనీకాంత్ మాత్రమే కాదు...రాజశేఖర్  ‘అంకుశం’ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంతలా పండనీకి కారణం సాయి కుమార్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. హీరోగా సుమన్ నటించిన ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు గాత్ర దానం చేసింది సాయికుమారే. ఇలా తెలుగు హీరోలకే కాదు...ఇక్కడ డబ్ అయిన చాలా చిత్రాలకు తన గొంతుతో ప్రాణ ప్రతిష్ఠ చేసి కింగ్ ఆఫ్ వాయిస్‌గా ఫేమస్ అయ్యారు.

ఫెదరాయుడులో రజినీకాంత్‌కు డబ్బింగ్ చెప్పిన సాయి కుమార్ (Twitter/Photo)


డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా...హీరోగా...విలన్‌గా..తండ్రిగా...క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలకు తన నటనతో జీవం పోసారు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సాయికుమార్...1960 జూలై 27న మద్రాసులో ప్రముఖ నటుడు పిజే శర్మ, కృష్ణ జ్యోతిలకు జన్మించాడు. సాయి కుమార్ తండ్రి పి.జే.శర్మ మంచి నటుడే కాదు...డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. తండ్రి డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించి మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా సాయి కుమార్ తన షష్టి పూర్తి వేడుకలను సినీ ప్రముఖుల సమక్షంలో చేసుకున్నారు.

సాయి కుమార్ షష్టిపూర్తి వేడుకలు (Sai Kumar Shastipurthi celebrations)


డబ్బింగ్ కళాకారుడిగా సాయి కుమార్ తొలి చిత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ‘సంసారం’. ఆ తర్వాత  కొన్నిసినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు సాయి కుమార్. బాలనటుడిగా సాయి కుమార్ మొదటి సినిమా ‘దేవుడు చేసిన పెళ్లి’. ఆ తర్వాత తెలుగు, కన్నడ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసారు. తెలుగులో నటుడిగా సాయికుమార్‌కు పేరు తెచ్చిన సినిమా ‘కలికాలం’. ఇక  హీరోగా డైలాగ్ కింగ్‌కు పేరు తెచ్చిన మూవీ ‘పోలీస్ స్టోరీ’.

సాయి కుమార్‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన మూవీ ‘పోలీస్ స్టోరీ’ (Youtube)


పోలీస్ స్టోరీ తర్వాత సాయి కుమార్ కన్నడలో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో డబ్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్టైయింది. ఈ మూవీలో సాయి కుమార్ చెప్పిన డైలాగులు థియేటర్స్‌లో మారు మోగాయి. ఈ మూవీలో కనిపించే మూడు సింహాలు చట్టానికీ,న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే...కనిపించని ఆ నాల్గో సింహమేరా పోలీస్ అని చెప్పిన డైలాగ్.. ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంది. అంతలా తన డైలాగులతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.  ప్రస్తుతం హీరోగా అవకాశాలు తగ్గడంతో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కే చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా  ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

తండ్రి పీజే శర్మ, తనయుడు ఆదితో డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Twitter/Photo)


40 ఏళ్ల సినీ  ప్రస్థానంలో దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు సాయికుమార్. అమితాబ్, వినోద్ ఖన్నా, రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, విష్ణు వర్థన్, విజయ్ కాంత్, సత్యరాజ్ సహా ఎంతో మందికి గాత్ర దానం చేసారు. ఒక్క కమల్ హాసన్‌కు తప్ప మిగతా దక్షిణాది హీరోల చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన రికార్డు సాయి కుమార్  సొంతం.

Sai Kumar Shastipurthi celebrations,Sai Kumar Shastipurthi celebrations chiranjeevi,Sai Kumar Shastipurthi celebrations venkatesh,Sai Kumar Shastipurthi celebrations rajasekhar,Sai Kumar Shastipurthi celebrations tollywood,telugu cinema,సాయి కుమార్,సాయి కుమార్ షష్టిపూర్తి వేడుకలు,చిరంజీవి వెంకటేష్ సాయి కుమార్ షష్టిపూర్తి వేడుకలు
Sai Kumar Shastipurthi celebrations: డైలాగ్ కింగ్ సాయి కుమార్ షష్టిపూర్తి వేడుకలు ఘ


మరోవైపు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి ఎంతో మంది అగ్రహీరోలు తమిళంలో డబ్ చేసిన సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. తన గాత్రంతో యువ కళా వాచస్పతి అనే బిరుదును పొందారు. సామాన్యుడు సినిమాలోని నటనకు కాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది బహుమతి అందుకున్నారు. మరోవైపు ‘ప్రస్థానం’ మూవీలోని నటనకు కాను ఉత్తమ సహాయ నటుడు సహా పలు సంస్థలు ఇచ్చే ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. మరోవైపు రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సాయి కుమార్ (Twitter/Photo)


ఒకవైపు సినిమాల్లో నటిస్తూ స్మాల్ స్క్రీన్ పై ఎన్నో కార్యక్రమాలతో సందడి చేసారు. కుటుంబ విషయానికొస్తే సాయికుమార్ తమ్ముళ్లు రవిశంకర్, అయ్యప్ప కూడా కన్నడ, తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్టులుగా, నటులుగా రాణిస్తున్నారు.

తమ్ముళ్లు రవి శంకర్, అయ్యప్ప శర్మలతో సాయి కుమార్ (File/Photo)


సాయి కుమార్ కొడుకు ఆది సాయికుమార్  కూడా టాలీవుడ్‌ హీరోగా ఆయకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఏమైనా తన నటనతో వాయిస్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ డైలాగ్ కింగ్‌కు మరోసారి బర్త్ డే విషెస్ చెబుతుంది న్యూస్ 18.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Sai Kumar, Sandalwood, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు