Home /News /movies /

HAPPY BIRTHDAY BRAHMANANDAM A SPECIAL STORY COMEDY KING BRAHMANANDAM SR

Happy Birthday Brahmanandam : నవ్వుల రాజు ఏ పాత్ర వేసిన బ్రహ్మానందమే..

Happy Birthday Brahmanandam Photo : Twitter

Happy Birthday Brahmanandam Photo : Twitter

Happy Birthday Brahmanandam : ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తికాదు. తన హాస్యంతో తెలుగువారిని అలరించిన బ్రహ్మి ఈరోజు 65వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.

  ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తికాదు. తన హాస్యంతో తెలుగువారిని అలరించిన బ్రహ్మి ఈరోజు 65వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. చెప్పాలంటే బ్రహ్మానందం కామెడీ టైమింగ్‌తో కొన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. సినిమాలో కామెడీ పండించాలంటే బ్రహ్మి ఉండాల్సిందే. ఓ దశలో అయితే విడుదలైన దాదాపు ప్రతి సినిమాలో ఆయన పాత్ర ఉండేది. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సినిమాలను తగ్గించేశాడు. కామెడీ పండించడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఎన్నో ఏళ్లుగా అలరిస్తోన్న బ్రహ్మానందం.. తెలుగు సినీ చరిత్రలో తన కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. ఇక ఇవాళ ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా బ్రహ్మానందం గురించి మరికొన్ని విషయాలు..

  బ్రహ్మానందం ఇంటిపేరు కన్నెగంటి. బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 లో సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు. తెలుగులో మాస్టర్స్ చేసిన బ్రహ్మీ మొదటి సినిమా జంద్యాల దర్శకత్వంలో వచ్చిన ’అహానా పెళ్లంటా’. ఈ సినిమాలో నటించడం కంటే ముందు బ్రహ్మానందం అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేశాడు. జంద్యాల అహానా పెళ్ళంటలో బ్రహ్మానందం కామెడీ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత బ్రహ్మానందంకు విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో కామెడీ రారాజుగా మారిపోయాడు. చెప్పాంటే కొందరు దర్శకులు బ్రహ్మానందం కోసమే ప్రత్యేకించి పాత్రను సృష్టించేవారు.. ఆయన దృష్టిలో పెట్టుకుని రాసుకునేవారు. బ్రహ్మానందం వేసిన పాత్రల్లో కొన్ని.. ఆయనకు పేరుతెచ్చినవి.. మనకు గుర్తుండేవి.. అహానా పెళ్లంటలో అర‌గుండు పాత్ర.. ఆ తర్వాత ఖాన్‌దాదా, మైఖెల్ జాక్సన్‌గా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీలో మెక్‌డోల్డ్ మూర్తి, వినాయక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన అదుర్స్‌లో భ‌ట్టు పాత్ర, కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో గ‌చ్చిబౌలి దివాక‌ర్, బాద్ షాలో జ‌య‌సూర్య ఇలా బ్రహ్మీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రంలో కిల్ బిల్ పాండే, రవితేజ, వినాయక్ కృష్ణ సినిమాలో బాబీ ఇలా చాలా ఉన్నాయి. అయితే బ్రహ్మానందం ఏ రూపంలో వ‌చ్చినా, ఏ వేశం వేసినా జ‌నం ప‌డీ ప‌డీ న‌వ్వారు.. నవ్వుతూనే ఉన్నారు. ఇక ఆయన తెలుగు సినిమాల్లో కామెడీ పండించి ప్రజలను అలరించినందుకు అనేక అవార్డులు వ‌రించాయి. ప్రస్తుతం ఆరోగ్యం సరిగాలేక సినిమాలను తగ్గించేసిన బ్రహ్మానందం ఈరోజు 65వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా బ్రహ్మానందం ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని న్యూస్ 18 కోరుకుంటోంది.
  Happy Birthday Brahmanandam
  Happy Birthday Brahmanandam Photo : Twitter


  అది అలా ఉంటే నవ్వుల రారాజు బ్రహ్మానందం ఆత్మకథ రాస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తను చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటవరకు జరిగిన అతి ముఖ్యమైన విషయాలను పొందు పరుస్తూ ఈ పుస్తకాన్ని రచిస్తున్నారు. పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలు కూడా ఈ రచనలో వుంటాయని, ఈ పుస్తకం త్వరలో ప్రింటింగ్ కి వెళ్లనుందని తెలిసింది. మంచి, చెడు,కష్టం,సుఖం,ఆధ్యాత్మికం ప్రధాన అంశాలుగా రచన కొనసాగింది అని విశ్వసనీయ సమాచారం..ఈ పుస్తకాన్ని అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో తన ఆత్మకథ ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఆయన వీలున్నప్పుడల్లా.. బొమ్మలు గీస్తూ.. అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల ఆయన అయోధ్య రామమందిర నిర్మాణానికి పునాది రాయి పడిన నేపథ్యంలో మరోసారి తన టాలెంట్‌కు పని చెప్పాడు. ఈ సందర్భంగా బ్రహ్మనందం శ్రీరాముడి స్కెచ్ వేశారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అయన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మరాఠి సినిమా నట సామ్రాట్‌కు రీమేక్’గా వస్తోంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బ్రహ్యనందం కీలక పాత్రలో రోల్ నటిస్తున్నాడు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Brahmanandam, Tollywood news, Tollywoood

  తదుపరి వార్తలు