Happy Birthday Hrithik Roshan: బాలీవుడ్లో సూపర్ హీరో అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు హృతిక్ రోషన్ దే. కేవలం సూపర్ హీరోగానే కాకుండా.. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రోజు ఈ బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న హృతిక్ రోషన్.. 1974 జనవరి 10న ముంబైలో జన్మించారు. తండ్రి రాకేష్ రోషన్ అప్పటికే పెద్ద హీరోతో పాటు నిర్మాత, దర్శకుడు కూడా. ఇక హృతిక్ రోషన్ తాత రోషల్ లాల్ నగ్రత్.. బాలీవుడ్లో పేరు మోసిన మ్యూజిక్ డైరెక్టర్. ఇక హృతిక్ రోషన్ బాబాయి రాజేష్ రోషన్ బాలీవుడ్లో ప్రముఖ సంగీత దర్శకుడు. ఈయన హృతిక్ రోషన్ నటించిన ‘కహోనా ప్యార్ హై’ తో పాటు ‘క్రిష్’ సిరీస్ వరకు రాకేష్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని చిత్రాలకు ఈయనే మ్యూజిక్ కంపోజ్ చేసారు.
స్వతహాగా ఇంట్లో సినిమా వాతావరణం ఉండటంతో హృతిక్ రోషన్ అడుగులు కూడా ఆ వైపు పడ్డాయి. చిన్నపుడేబాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన హృతిక్ రోషన్..ఆ తర్వాత తండ్రి దర్శక నిర్మాణంలో తెరకెక్కిన పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసారు.ఆ తర్వాత తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు ఫస్ట్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. బాలీవుడ్ ఖాన్ త్రయానికి తానే ప్రత్యామ్నాయం అని నిరూపించుకున్నాడు.
అంతేకాదు ‘కహో నా ప్యార్ హై’ తర్వాత ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ చిత్రం తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనా.. మళ్లొసారి తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కో మిల్ గయా’, ‘క్రిష్’ సిరీస్‌తో బాలీవుడ్ సూపర్ హీరో ఇమేజ్ సంపాదించాడు.
ముఖ్యంగా తానో మాస్ హీరో అన్న సంగతి పక్కన పెట్టి ప్రయోగాలు చేయడంలో ఎపుడు ముందుంటాడ హృతిక్. ముఖ్యంగా వికాస్ బహ్ల్ దర్శకత్వంలో ఈయన చేసిన ‘సూపర్ 30’ సినిమా చేసాడు. ఈ సినిమాలో హృతిక్..ఫేమస్ లెక్కల మాస్టారు ఆనంద్ కుమార్ పాత్రలో జీవించాడు.
ఆ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తోటి హీరో టైగర్ ష్రాఫ్‌తో చేసిన ‘వార్’ మూవీలో జేమ్స్ బాండ్ తరహా పాత్రలో మరోసారి మాస్ ప్రేక్షకులను మెప్పించాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం హృతిక్ రోషన్.. తన తండ్రి దర్శకత్వంలో‘క్రిష్ 4’ సినిమా చేస్తున్నాడు.
అంతేకాదు జస్ట్ డాన్స్ వంటి రియాలిటీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరించాడు. హృతిక్ రోషన్ నటనకు పలు ఫిల్మ్‌ఫేర్ సహా పలు పురస్కారాలు ఆయన్ని వరించాయి. అంతేకాదు త్వరలోనే ఓ హాలీవుడ్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన అగ్రమెంట్ సహా అన్ని పూర్తయ్యాయి. త్వరలో దానికి హృతిక్ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మొత్తానికి ఒక మూసకు పరిమితం కాకుండా వెరైటీ సబ్జెక్ట్స్‌తో అలరిస్తోన్న హృతిక్ రోషన్‌కు బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లో సైతం సత్తా చాటాలని కోరుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Hindi Cinema, Hrithik Roshan