Home /News /movies /

HAPPY BIRTHDAY BHARAT RATNA LATA MANGESHKAR FILM JOURNEY TA

HBDLataMageshkar: భారతరత్న లతా మంగేష్కర్ సినీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

భారత రత్న లతా మంగేష్కర్ (File/Photo)

భారత రత్న లతా మంగేష్కర్ (File/Photo)

Happy Birthday Lata Mangeshkar | లతా మంగేష్కర్ ఈ పేరు తెలియని సంగీతాభిమానులుండరు. ఏడు దశాబ్దాలుగా ఎంతో మంది శ్రోతలను తన స్వర మాధుర్యంతో అలరిస్తూనే ఉంది. వయసు తొంభై పడిలో పడిన ఇప్పటికీ లత గాన మాధుర్యంలో ఎలాంటి మార్పు లేదు.

Happy Birthday Lata Mangeshkar |ఆ గానానికి వసంతమే తప్ప శిశిరం లేదు. భావమే తప్ప భాష తెలీదు. ఆ గళంలో జాలువారే పాట వింటే ఆ గాన మాధుర్యానికి సాటి, పోటి రాగల గళం మరోకటి లేదనిపించేంతటి తీయని గానం ఆమెది. దశాబ్దాలు గడిచిన మాధుర్యం తరగని స్వరం ఆమె సొంతం. ఆ గొప్ప గాయణి.. బాలీవుడ్ నైటింగేల్ లతా మంగేష్కర్. నేడు లతాజీ 91వ పుట్టినరోజు జరుపుకుంటోంది.  లతా మంగేష్కర్ ఈ పేరు తెలియని సంగీతాభిమానులుండరు. ఏడు దశాబ్దాలుగా ఎంతో మంది శ్రోతలను తన స్వర మాధుర్యంతో అలరిస్తూనే ఉంది స్వరం. వయసు తొంబైలో పడిన లత గాన మాధుర్యంలో ఎలాంటి మార్పు లేదు. అది యుగళ గీతమైనా...జానపదమైనా...గజల్ గానమైనా..ఖవ్వాలి రాగమైనా ....భక్తి గీతమైనా ఆమె గొంతులో అలవోకగా సాగాల్సిందే... ఎలాంటి సాహిత్యానికైనా తన స్వరంతో పట్టంకట్టే అపురూప గాన గీతికే లతా మంగేష్కర్.

లతా మంగేష్కర్ (file photo)


ఎన్నో అద్భుత గీతాలకు తన స్వరంతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన లతా మంగేష్కర్...1929 సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించింది. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిలకు మొదటి సంతానం ఆమె. మాటలే వచ్చేవయసునుండే పాటలను నేర్చిందీ ఈ గానకోకిల. చిన్నప్పుడే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ అలీ ఖాన్, అమానత్ అలీ ఖాన్ శిష్యరికం చేసింది.. 13 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో అప్పటినుండే కుటుంబ పోషణా భారం లతాజీపై పడింది.

లతా మంగేష్కర్


హిందీ చిత్రసీమలో ప్రముఖ సంగీత దర్శకులందరితో పాట పాడిన ఘనత ఆమె సొంతం. ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ వంటి అగ్ర సంగీత దర్శకులందరితో కలిసి లెక్కలేనన్ని పాటలు పాడారు. లతా మంగేష్కర్ మొదటి సారిగా మరాఠి మూవీలో పాడారు. అయితే ఈ మూవీ విడుదలయ్యే సమయానికి ఆమె పాటను తొలగించారు. లతాజీ కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. గులాం హైదర్ ప్రోత్సహంతో ‘మజ్‌బూర్’ సినిమాలో దిల్ మేరా తోడా పాటపాడారు లతా. ఈ పాట విన్న వారంతా లతాను విమర్శించారు.

చెల్లెలు ఆశా భోంస్లే‌తో లతాజీ (File Photo)


ఆ విమర్శలను చాలెంజ్ గా తీసుకున్న లతాజీ ఉర్దులో సంగీత శిక్షణ తీసుకున్నారు. కొంత కాలం తరువాత దిలీప్ కుమార్, హేమమాలిని నటించిన ‘మధుమతి’ సినిమాలోని ఒక పాటను పాడారు. ఆ పాటకు మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు లతామంగేష్కర్. దాంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.

గాన కోకిల లతా మంగేష్కర్‌తో మహమ్మద్ రఫీ


సినీ నేపథ్య గానంలో శిఖరాగ్రాన చేరిన లతాజీకి ‘మహాల్’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆయేగా ఆయేగా.. పాటతో లతాజీ దశ తిరిగింది. ‘మహాల్’ సినిమా హిట్ కావడంతో లతాజీకి వెనుదిరిగి చూసుకోలేదు.

కుటుంబ సభ్యులతో లతా మంగేష్కర్


ఆ తర్వాత వచ్చిన ‘ఆగ్’, ‘శ్రీ 420’, ‘చోరి చోరి’, ‘హైవే నెంబర్ 44’, ’దేవదాస్’ వంటి చిత్రాలు లతాజీని బాలీవుడ్‌లో తిరుగులేని గాయనిగా నిలబెట్టాయి.  1960లో నౌషాద్ అలీ సంగీతంలో వచ్చిన ‘మొఘల్--ఆజమ్’ సినిమాలో పాడిన ‘ప్యార్ కియాతో డర్నా క్యా పాట’ లతా మంగేష్కర్ ఖ్యాతిని శిఖరాగ్రానికి  చేర్చింది.

తోటి గాయనీ గాయకులతో లతా మంగేష్కర్ (File Photo)


సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన లతాజీ 1990లో సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ఈ సంస్థ గుల్జార్ దర్శకత్వంలో ‘లేఖిని’ మూవీ తీశారు. ఈ మూవీలో పాడిన పాటకు గానూ లతాజీకి నేషనల్ అవార్డు వరించింది.లతా మంగేష్కర్ మొదటి సారి తెలుగులో పాడిన పాట తెలుగు ప్రేక్షకుల్ని అలరిచింది.

లతా మంగేష్కర్ (file photo)


‘సంతానం’ సినిమా కోసం ఆమెతో పాడించిన పాట తెలుగు ప్రేక్షకులను హాయిగా నిద్రపుచ్చింది. అంతేకాకుండా ‘ఆఖరి పోరాటం’ సినిమాలో తెల్లచీరకు అనేసాంగుని కూడా పాడింది లతామంగేష్కర్. ఈ పాటలు విన్నతరువాత ఆమె బాలీవుడ్ సింగర్ అంటే ఎవ్వరు కూడా నమ్మరు కూడా.

తోటి గాయనీమణులతో లతా మంగేష్కర్


అమరవీరులను నివాళులర్పించడమే కాదు.. దేశభక్తి గీతం ‘‘వందేమాతరం’’ కూడా అంతే పాపులరిటీని సంపాదించింది. రెహ్మన్ మ్యూజిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ గీతం దేశభక్తి గీతాల్లో టాప్ రేంజ్‌లో నిలిచింది. దేశభక్తి గీతాలను ఆలపించడంలో కూడా లతాజీ తనకు తానే సాటి అనిపించుకున్నారు.

Pulwama Attack: Lata Mangeshkar to Donate Rs 1 Crore for the Welfare of Indian Soldiers, pulwama Attack, Surgical Strike, lata mangeshkar Donate Rs.1 Crore For Welfare of indian soldiers, lathamangeshkar pulwama attacks,Bollywood, Hindi cinema, లతా మంగేష్కర్, పుల్వామా దాడి బాధితులకు లతా మంగేష్కర్ సాయం, కోటీ రూపాయల విరాళం ప్రకటించిన లతా మంగేష్కర్, లతా మంగేష్కర్ కోటీ విరాళం, భారత సైనికుల సంక్షేమ నిధికి కోటీ విరాళం ప్రకటించిన లతా మంగేష్కర్,
లతా మంగేష్కర్ (ఫైల్ ఫోటో)


రాజశ్రీ ప్రొడక్షన్ లో లత పాడిన పాటలు బాలీవుడ్ లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ‘‘మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్’’ సినిమాల్లో ఎస్పీబాలుతో లతా పాడిన పాటలను హమ్ చేయని సంగీతాభిమాని లేరంటే అతిశయోక్తి కాదు.ఈ తరం హీరోయిన్స్ కు సరిపోయే గళం ఆమె సొంతం. తరాలు మారినా.. చెక్కు చెదరని ఆ స్వరానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మణిరత్నం, షారూఖ్, రెహ్మన్ కాంబీనేషన్ లో వచ్చిన ‘దిల్ సే’ సినిమాలో జియా జిలే సాంగ్ లతా స్వరం అందించిన సర్వ కళల్లో ఒక్కటి.

మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌తో లతాజీ


లతామంగేష్కర్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1948 నుంచి 1978 వరకు దేశ, విదేశాల్లో కలిపి 36 భాషల్లో 50వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గీన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకుంది. ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకుంది. , 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వంటి పురస్కారం అందుకున్నారు.

president of india ramnath kovind courtesy meet with legendary bollywood playback singer lata mangeshkar,ram nath kovind,ramnath kovind,president of india ramnath kovind,lata mangeshkar,lata mangeshkar ramnath kovind,ramnath kovind mets lata mangeshkar,president kovind,kovind,president ram nath kovind,lata mangeshkar songs,lata mangeshkar,ram nath kovind speech,president ramnath kovind,narendra modi & ramnath kovind,about ramnath kovind hindi,ramnath kovind interview,ramnath kovind nomination,foreign visits of ramnath kovind,ramnath,ramnath kovind journey hindi,president of india kovind,ramnath kovind first foreign trip,bollywood,national,రామ్‌నాథ్ కోవింద్,లతా మంగేష్కర్,లతా మంగేష్కర్ రామ్‌నాథ్ కోవింద్,రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,లతా మంగేష్కర్‌ను పరామర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,
రాష్ట్రపతితో లతా మంగేష్కర్ (twitter/Photo)


ఆమె గాత్ర మాధుర్యానికి పరవశించని ప్రేక్షకులుండరు. ఎన్ని పురాస్కారాలు అందుకున్న.. ఆమె ప్రతిభ ముందు అవన్నీ వెలవెలబోతాయి.

పీఎం నరేంద్ర మోదీతో లతా మంగేష్కర్ (file photo)


ఆ మధుర గాయని గురించి ఎన్ని చెప్పినా ఇంకా ఏదో మిగిలే వుంటుంది. అదే లతా మంగేష్కర్ గాన మాధుర్యంలో ఉన్న గొప్పతనం. సినీ సంగీతంలో తన గళంతో ఎన్నో అద్బుతాలు చేసిన ఈ మ్యూజిక్ లెజెండ్‌కు మరోసారి న్యూస్ 18 బర్త్‌డే విషెస్ అందజేస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood, Lata Mangeshkar, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు