HBD Balakrishna: నట సింహా బాలకృష్ణకు చిరంజీవి, మహేష్ బాబు సహా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు..

బాలకృష్ణకు బర్త్ డే విషెస్ తెలియజేసిన చిరంజీవి, మహేష్ బాబు (Twitter/Photos)

Happy Birthday Balakrishna Nandamuri | నందమూరి బాలకృష్ణ తెలుగులో తొలి నట వారసుడు. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖులు బాలకృష్ణకు బర్త్ డే విషెస్ తెలియజేసారు.

  • Share this:
    Happy Birthday Balakrishna Nandamuri | నందమూరి బాలకృష్ణ తెలుగులో తొలి నట వారసుడు. 14 ఏళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ అప్రతిహతంగా హీరోగా తెలుగు వెండితెరను ఏలుతున్నారు. ఈ రోజు ఈ నందమూరి నట సింహం పు61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. మిత్రుడు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలియజేసారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బాలయ్యకు స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.





    మరోవైపు ఎన్టీఆర్ జన్మ దిన శుభాకాంక్షలు బాల బాబాయి. మీరు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరకుంటున్నాను. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా బాబాయి బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.







    మరో వైపు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా నందమూరి నట సింహా బాలకృష్ణకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.



    మరోవైపు సాయి ధరమ్ తేజ్ కూడా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మరోవైపు జానపద, చారిత్రక, పౌరాణిక, సాంఘిక పాత్రలలో అద్భుతంగా నటించిన తనదైన ముద్రవేస్తూ, సాంఘిక సేవా కార్యక్రమాలలో నిత్యం పాల్గొంటూ నందమూరి తారకరామారావు గారి వారసత్వానికి వెలుగు తెచ్చిన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదినం నేడు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.












    మరోవైపు దర్శకులు  క్రిష్, సురేందర్ రెడ్డి, గోపీచంద్ మలినేని, బాబీ,అనిల్ రావిపూడి, బీవీఎస్ రవి, హీరో నాగ శౌర్యతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సహా పలువురు నిర్మాతలు, హీరోలు, దర్శకులు బాలయ్యకు బెస్ట్ విషెస్ తెలియజేసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: