హోమ్ /వార్తలు /సినిమా /

HBD AshwiniDutt: హ్యాపీ బర్త్ డే వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్.. భారీ చిత్రాలకు మారు పేరు..

HBD AshwiniDutt: హ్యాపీ బర్త్ డే వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్.. భారీ చిత్రాలకు మారు పేరు..

సి.అశ్వనీదత్ భారీ చిత్రాల నిర్మాత (File/Photo)

సి.అశ్వనీదత్ భారీ చిత్రాల నిర్మాత (File/Photo)

HBDAshwiniDutt | తెలుగు భారీ చిత్రాల నిర్మాత అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే పేరు వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్. ఈరోజు ఈయన పుట్టినరోజు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

HBDAshwiniDutt | తెలుగు భారీ చిత్రాల నిర్మాత అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే పేరు వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్. టాలీవుడ్‌లో మూడు తరాల అగ్ర హీరోలతో భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు.  ఈ రోజు ఈయన పుట్టినరోజు. ముఖ్యంగా ఆయన  సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో పాటు కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబులతో పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత తరంలో చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి కథానాయికులతో భారీ చిత్రాలను తెరకెక్కించారు. మూడో జనరేషన్‌లో ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్‌లతో  సినిమాలను నిర్మించిన ట్రాక్ రికార్డ్  సి.అశ్వనీదత్ సొంతం. తెలుగులో విజయా ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్,అన్నపూర్ణ, జగపతి పిక్చర్స్ తర్వాత తెలుగులో వైజయంతీ మూవీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

మాములుగా చాలా మంది నిర్మాతలు ఏదో కొన్ని సినిమాలు నిర్మిస్తుంటారు. కానీ అశ్వనీదత్ అలాంటి ఇలాంటి ప్రొడ్యూసర్ కాదు. తను ఏ సినిమాను నిర్మించిన భారీ హంగులు, ఆర్భాటాలు ఉండాల్సిందే. కొన్నిసార్లు వీటితో దెబ్బ తిన్నా.. ఎక్కువ సార్లు మాత్రం అలాంటి చిత్రాలతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

chiranjeevi jr ntr balakrishna movies producer vyjayanathi movies producer chalasani aswani dutt throw back photo,Vyjayanthi Movies c Aswani Dutt,chalasani aswani dutt,aswani dutt ntr,aswani dutAt anr krishna kiishnam raju shobhan babu,c aswani dutt chiranjeevi balakrishana venkatesh nagarjuna,c aswani dutt jr ntr ram charan prabhas mahesh babu pawan kalyan raviteja, Vyjayanthi Movies c Aswani Dutt donates 5 lakh rupees to corona crisis charity,Vyjayanthi Movies c Aswani Dutt donates ap government to 10 lakh rupees,Vyjayanthi Movies c Aswani Dutt donates 10 lakh rupees to telangana government,Vyjayanthi Movies c Aswani Dutt kcr,Vyjayanthi Movies c Aswani Dutt ys jagan mohan reddy,Vyjayanthi Movies c Aswani Dutt chiranjeevi,Vyjayanthi Movies c Aswani Dutt prabhas,tollywood,telugu cinema,కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం సి అశ్వనీదత్ విరాళం,ఏపీ ప్రభుత్వానికి 10 లక్షల విరాళం అందజేసిన వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్,తెలంగాణ ప్రభుత్వానికి వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్ విరాళం,సి అశ్వనీదత్,సి అశ్వనీదత్ చిరంజీవి,సి అశ్వనీదత్ ఎన్టీఆర్,ఎదురులేని మనిషి,అశ్వినీదత్ బాలకృష్ణ నాగార్జున వెంకటేష్,సి అశ్వనీదత్ మహానటి,సి అశ్వనీదత్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్
ఎన్టీఆర్ చేతులు మీదుగా ప్రారంభమైన అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ (Twitter/Photo)

ఈయన తెలుగు మొదట కే.విశ్వనాథ్ దర్శకత్వంలో కొంత మంది భాగస్వామ్యంతో  1974లో ‘ఓ సీత కథ’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలు పెట్టారు.  ఆ తర్వాత శోభన్ బాబుతో ‘అందరూ దొంగలే’ సినిమాలను మిగతా నిర్మాతల భాగస్వామ్యంతో  నిర్మించారు.  ఆ తర్వాత సోలో నిర్మాతగా 22 యేళ్ల వయసులో ఎన్టీఆర్‌తో తొలి సినిమాగా ‘ఎదురులేని మనిషి’ చిత్రాన్ని కే.రాఘవేంద్రరావు కజిన్ కే.బాపయ్య దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత నిర్మాతగా వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత అన్నగారితో ‘యుగపురుషుడు’ సినిమా కూడా నిర్మించారు.

నిర్మాతగా తొలి చిత్రం NTR హీర్గా ‘ఎదురులేని మనిషి’ (File/Photo)

నిర్మాతగా అశ్వనీదత్..  ఐదు దశాబ్దాలుగా ట్రెండ్‌కు తగ్గట్టు సినిమాలను నిర్మిస్తూ అదే స్థాయిలో బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంస్త వైజయంతీ మూవీస్. అసలు ఆ బ్యానర్‌కు ఎవరు పేరు పెట్టారో తెలుసా ? ఓ సీతకథతో సినిమా ఇండస్ట్రీలో వచ్చిన అశ్వనీదత్.. ఎన్టీఆర్‌తో సినిమా నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారు. ఎలాగో అలా ఆయన్ని కలిసి ఆయనతో సినిమా తీయాలనుకుంటున్నట్టు చెప్పారు. అశ్వనీదత్ చెప్పిన మాటలకు ఎన్టీఆర్ ఇంప్రెస్ అయి ఆయనతో సినిమా చేయడానికి ఒప్పకున్నారు. అప్పటి వరకు బ్యానర్ స్థాపించలేదు.

chiranjeevi jr ntr balakrishna movies producer vyjayanathi movies producer chalasani aswani dutt throw back photo,Vyjayanthi Movies c Aswani Dutt,chalasani aswani dutt,aswani dutt ntr,aswani dutAt anr krishna kiishnam raju shobhan babu,c aswani dutt chiranjeevi balakrishana venkatesh nagarjuna,c aswani dutt jr ntr ram charan prabhas mahesh babu pawan kalyan raviteja, Vyjayanthi Movies c Aswani Dutt donates 5 lakh rupees to corona crisis charity,Vyjayanthi Movies c Aswani Dutt donates ap government to 10 lakh rupees,Vyjayanthi Movies c Aswani Dutt donates 10 lakh rupees to telangana government,Vyjayanthi Movies c Aswani Dutt kcr,Vyjayanthi Movies c Aswani Dutt ys jagan mohan reddy,Vyjayanthi Movies c Aswani Dutt chiranjeevi,Vyjayanthi Movies c Aswani Dutt prabhas,tollywood,telugu cinema,కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం సి అశ్వనీదత్ విరాళం,ఏపీ ప్రభుత్వానికి 10 లక్షల విరాళం అందజేసిన వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్,తెలంగాణ ప్రభుత్వానికి వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్ విరాళం,సి అశ్వనీదత్,సి అశ్వనీదత్ చిరంజీవి,సి అశ్వనీదత్ ఎన్టీఆర్,ఎదురులేని మనిషి,అశ్వినీదత్ బాలకృష్ణ నాగార్జున వెంకటేష్,సి అశ్వనీదత్ మహానటి,సి అశ్వనీదత్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్
వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ (File/Photo)

అప్పుడు అన్నగారు మీ బ్యానర్ పేరు ఏమిటి అని అడిగారు ? ఇంకా పెట్టలేదు అని చెప్పారు. అప్పటికప్పుడు ఎన్టీఆర్ అక్కడే ఉన్న కృష్ణుడి ఫోటో చూసి, శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం పరిమళాలు వెదజల్లూతూ ఎన్నటికీ వాడిపోని పూల మాల వైజయంతి. అదే నీ సంస్థ పేరు అని చెప్పారు.

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌కు భారీ షాక్‌ ఇచ్చిన టీఆర్పీ రేటింగ్స్.. నాగార్జునకు మరో ఘోర అవమానం..

అంత కాదు తన స్వహస్తాలతో వైజయంతీ మూవీస్ అని  రాసారు. ఈ బ్యానర్ లోగోలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో ఉంటుంది.ఎన్టీఆర్‌తో ఎదురులేని మనిషి,యుగపురుషుడు సినిమాను నిర్మించిన అశ్వనీదత్.. ఆ తర్వాత ఏఎన్నాఆర్‌,కృష్ణతో ‘గురుశిష్యులు’ సినిమాను నిర్మించారు.

mega producer Vyjayanthi Movies c Aswani Dutt donates 5 lakh rupees to corona crisis charity,Vyjayanthi Movies c Aswani Dutt,Vyjayanthi Movies c Aswani Dutt donates 5 lakh rupees to corona crisis charity,Vyjayanthi Movies c Aswani Dutt donates ap government to 10 lakh rupees,Vyjayanthi Movies c Aswani Dutt donates 10 lakh rupees to telangana government,Vyjayanthi Movies c Aswani Dutt kcr,Vyjayanthi Movies c Aswani Dutt ys jagan mohan reddy,Vyjayanthi Movies c Aswani Dutt chiranjeevi,Vyjayanthi Movies c Aswani Dutt prabhas,tollywood,telugu cinema,కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం సి అశ్వనీదత్ విరాళం,ఏపీ ప్రభుత్వానికి 10 లక్షల విరాళం అందజేసిన వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్,తెలంగాణ ప్రభుత్వానికి వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్ విరాళం
వైజయంతి మూవీస్ లోగో (Twitter/Photo)

ఆపై కృష్ణ, కృష్ణంరాజులతో ‘అడవి సింహాలు’ సినిమాను తెరకెక్కించాడు. ఇదే చిత్రాన్ని హిందీలో ధర్మేంద్ర, జితేంద్ర హీరోలుగా ‘జానీ దోస్తీ’ పేరుతో తెరకెక్కించి హిందీలో తెరకెక్కించారు. ఈ సినిమాను రోజా మూవీస్ భాగస్వామ్యంలో నిర్మించారు.  ఆపై కృష్ణతో తెరకెక్కించిన ‘అగ్నిపర్వతం’ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అడవి సింహాలు షూటింగ్ సమయంలో కృష్ణ,కృష్ణంరాజు,ధర్మేంద్ర, జితేంద్రలతో రాఘవేంద్రరావు (Twitter/Photo)

ఆపై వెంకటేష్,ఏఎన్నార్‌లతో కలిసి ‘బ్రహ్మరుద్రులు’ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత వెంకటేష్‌తో ‘సుభాష్ చంద్రబోస్’ నిర్మించారు. అటు నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’, ‘గోవిందా గోవిందా’, రావోయి చందమామ’ ఆజాద్’,తో పాటు దేవదాస్ సినిమాలను నిర్మించారు.

ఆఖరి పోరాటం షూటింగ్‌లో రాఘవేంద్రరావు,నాగ్,సుహాసిని,శ్రీదేవి (Twitter/Photo)

ఇక బాలకృష్ణ,శోభన్ బాబుతో అశ్వమేథం సినిమాను తెరకెక్కించారు.ఇక చిరంజీవితో ‘జగదేకవీరుడు అతిలోసు సుందరి, చూడాలిని వుంది, ఇంద్ర, జై చిరంజీవా చిత్రాలను తెరకెక్కించారు. ఇందులో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘ఇంద్ర’ సినిమాలు ఇండస్ట్రీ హిట్‌‌ను నమోదు చేసాయి.అంతేకాదు శ్రీదేవి, చిరంజీవి వంటి అరుదైన కాంబినేషన్‌లో సినిమాను నిర్మించారు. అంతేకాదు అరుదైన కాంబినేషన్స్‌ను సెట్ చేయడంతో అశ్వనీదత్‌ది తిరుగులేని రికార్డు ఉంది.

జగదేవకవీరుడు అతిలోకసుందరి (Twitter/Photo)

అటు ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెం. 1 చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. ,కంత్రి, శక్తి సినిమాలను వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నిర్మించారు అశ్వనీదత్.  ఇక మహేష్ బాబు‌తో రాజకుమారుడు, సైనికుడు’, మహర్షి సినిమాలను తెరకెక్కించారు. అటు రామ్ చరణ్‌ను చిరుత మూవీతో ఇంట్రడ్యూస్ చేసాడు. పవన్ కళ్యాణ్‌తో ‘బాలు’ సినిమాను తెరకెక్కించాడు. అటు వివిధ నిర్మాతలతో కలిసి ‘పెళ్లి సందడి’, ‘శుభలగ్నం, పరదేశి, గంగోత్రి, పెళ్లాం ఊరెళితే’ వంటి చిత్రాలను నిర్మించారు.

ఇక ఈయన మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా 50యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ యేడాది హను రాఘవపూడి దర్శకత్వంలో ‘సీతా రామం’ సినిమాతో మరో సక్సెస్‌ను అందుకున్నారు. హృద్యమైన ప్రేమకథగా ఈ చిత్రం ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది.

‘సీతా రామం’ మూవీ (File/Photo)

ఇపుడు ప్రభాస్ హీరోగా తన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.  ఈ సినిమాకు ‘ప్రాజెక్ట్ K’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహాభారతంలో కర్ణుడి పాత్రలో కనిపించనున్నారు. అందుకే  ఈ చిత్రానికి ప్రాజెక్ట్ K టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్, నాగ్ అశ్విన్‌తో భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన అశ్వినీదత్ (File/Photo)

ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో మంచి క్రేజ్ ఉంది. మొత్తంగా తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా అశ్వనీదత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ముందు ముందు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుందాం.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Ashwini Dutt, Tollywood, Vyjayanthi Movies

ఉత్తమ కథలు