HBDAlluArha: అల్లు అర్హ బర్త్ డే సందర్భంగా ‘అంజలి అంజలి’ సాంగ్ విడుదల.. సంబరపడిపోతున్న బన్ని..

Happy Birthday Allu Arha | ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ.. ఐదో ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్.. తన కూతురు అర్హపై మణిరత్నం అప్పట్లో షామిలీపై పిక్చరైజ్ చేసిన అంజలి అంజలి పాటను తన కూతురు అర్హ పై రీ క్రియేట్ చేసి.. యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేసారు.

news18-telugu
Updated: November 21, 2020, 1:15 PM IST
HBDAlluArha: అల్లు అర్హ బర్త్ డే సందర్భంగా ‘అంజలి అంజలి’ సాంగ్ విడుదల.. సంబరపడిపోతున్న బన్ని..
అల్లు అర్హ అంజలి సాంగ్ రీ క్రియేట్ (Twitter/Photo)
  • Share this:
Happy Birthday Allu Arha | ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ.. ఐదో ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్.. తన కూతురు అర్హపై మణిరత్నం అప్పట్లో షామిలీపై పిక్చరైజ్ చేసిన అంజలి అంజలి పాటను తన కూతురు అర్హ పై రీ క్రియేట్ చేసి.. యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేసారు. మణిరత్నం దర్శకత్వంలో ఇళయరాజా స్వరపరిచిన ఈ  పాటను వేటూరి సుందరరామ్మూర్తి ఎంతో అద్భుతంగా రాసారు. ఇక అంజలి అంజలి అంటూ సాగే పాటకు బేబి షామిలీ తన అభినయంతో ప్రాణం పోసిందనే చెప్పాలి. తాజాగా ఈ పాటను అల్లు అర్జున్.. తన కూతురు అర్హతో రీ క్రియేట్ చేసారు. ఈ పాటలో అల్లు అర్హ.. తన క్యూట్ క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకుంది. ఈ పాటలో అల్లు అర్హతో పాటు ఆమె అన్నయ్య అల్లు అయాన్, తాతయ్య అల్లు అరవింద్, శేఖర్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ నటించడం విశేషం. ఇళయరాజా, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్‌ను కలర్‌పుల్‌గా రీ క్రియేట్ చేశారు. గణేష్ స్వామి కొరియోగ్రఫీ అందించిన పాటకు సూర్య సినిమాటోగ్రఫర్‌గా పనిచేసారు. ఇపుడీ పాట సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఈ పాటను రీ క్రియేట్ చేసిన సందర్భంగా మణిరత్నంతో పాటు ఇళయరాజాకు స్పెషల్ క్రెడిట్స్ ఇచ్చారు అల్లు అర్జున్.

ఇక అల్లు అర్హకు సంబంధించిన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూతురు పుట్టినరోజు సందర్బంగా అల్లు అర్జున్ అపురూపమైన కానుకగా అందించాడు అల్లు అర్జున్.  దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు అల్లు అర్జున్. ఈ రోజుతో అల్లు అర్హ.. నాలుగేళ్లు కంప్లీట్ చేసుకొని ఐదో యేట అడుగుపెట్టబోతుంది. ఈమె 2016 నవంబర్ 21న జన్మించింది.  ఇక అల్లు అర్జున్ పిల్లల విషయానికొస్తే.. ఇప్పటికే వీళ్లు ప్రేక్షకులతో, అభిమానులతో యాక్టివ్‌గా ఉన్నారు. వీరి వీడియోస్‌కు లక్షల సంఖ్యలో వ్యూస్ కూడా వస్తుంటాయి. ఇక బన్ని కూడా  తన ఇద్దరు పిల్లలను అభిమానులకు తెలిసేలా పెంచుతున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 21, 2020, 1:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading