హోమ్ /వార్తలు /సినిమా /

HBD Akkkineni Akhil : అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల శుభాకాంక్షలు వెల్లువ.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల..

HBD Akkkineni Akhil : అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల శుభాకాంక్షలు వెల్లువ.. ఏజెంట్ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల..

Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్ ఈరోజు తన 28వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఏజెంట్ మూవీ నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసారు.

Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్ ఈరోజు తన 28వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఏజెంట్ మూవీ నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసారు.

Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్ ఈరోజు తన 28వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఏజెంట్ మూవీ నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

  Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్ ఈరోజు తన 28వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అఖిల్ నటిస్తోన్న ‘ఏజెంట్’ మూవీ నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. 'సైరా'తో మరోసారి సత్తా చాటిన సురేందర్ రెడ్డి దీనికి దర్శకుడు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగానూ సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. చేతిలో సిగరేట్‌తో పొగను వదులుతూ స్టైలీష్‌గా ఉన్నాడు. ఈ ఫస్టు‌లుక్‌లోనే విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం.

  ఈ సినిమా ఆగష్టు 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ఇక అఖిల్ గత సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా ఇప్పటి వరకు వచ్చిన మూడు చిత్రాలు కూడా వైఫల్యం చెందింది. కానీ గతేడాది చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్నారు అఖిల్. ఇకపై చేయబోయే ప్రాజెక్ట్స్ విషయమై ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.  అందుకు తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి కూడా అఖిల్ సినిమాను స్పైగా చూపించనున్నాడు సురేందర్ రెడ్డి.  ఈ సినిమాకు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. 

  అఖిత్‌తో చేసే ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నాడట సురేందర్ రెడ్డి. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుంది చిత్రబృందం. మమ్ముట్టి మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.  ఇక అఖిల్ ఈ (Agent) చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయ్యారు. స్టైలీష్ లుక్‌లో కండ‌లు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు జోడిగా కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.సంగీతం ఎస్ఎస్ థ‌మ‌న్ అందిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమా యూరప్‌లో షూటింగ్ జరుపుకుంది. యూరప్‌లోని హంగేరీలో రాజధాని బుడాపెస్ట్ (Budapest )లో షూటింగ్ చేసింది టీమ్. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మ‌మ్ముట్టి (Mammootty) కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షితో పాటు అతుల్య రవి కూడా మరో హీరోయిన్‌గా చేస్తున్నారు.

  Chiranjeevi - Balakrishna : చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య కామన్‌గా ఉన్న ఈ పోలిక తెలుసా..

  అఖిల్ అక్కినేని విషయానికొస్తే.. 1994లో ఏప్రిల్ 8న అక్కినేని నాగార్జున, అమల దంపతులకు జన్మించాడు. చిన్నపుడే సిసింద్రి మూవీలో అఖిల్ చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమాలో తండ్రి నాగార్జున కూడా ముఖ్యపాత్రలో నటించారు. ఇక పెద్దయ్యాక ‘మనం’ సినిమాలో చివర్లో ఒక సన్నివేశంలో కనిపించి అక్కినేని అభిమానులను అలరించారు. ఈ సీన్‌లో తన తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున, బ్రదర్ నాగ చైతన్యలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖిల్’ అంటూ తన సొంత పేరుతో తెరకెక్కిన చిత్రంలో నటించాడు.

  RRR 2 Weeks WW Collections : ఆర్ఆర్ఆర్ 2 వారాల కలెక్షన్స్.. 14 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాలు అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయాయి. గతేడాది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్నారు. ఇపుడు అదే ఊపులో ‘ఏజెంట్’ సహా పలు చిత్రాలను లైన్‌లో పెట్టాడు. మధ్యలో అఖిల్ ‘ఆటాడుకుందాం’ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం కొసమెరుపు. మొత్తంగా ఈ అక్కినేని మూడో తరం రెండో నట వారసుడు ఇలాంటి విజయాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని న్యూస్ 18 మరోసారి అఖిల్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తోంది.

  First published:

  Tags: Agent, Akhil Akkineni

  ఉత్తమ కథలు