• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HAPPY BIRTHDAY AKHIL AKKINENI HERE IS THE AKHIL SURENDER REDDY AGENT FIRST LOOK SR

Happy Birthday Akhil Akkineni : సూపర్ స్టైలీష్‌గా అఖిల్.. ఆకట్టుకుంటోన్న ఏజెంట్ ఫస్ట్ లుక్..

Happy Birthday Akhil Akkineni  : సూపర్ స్టైలీష్‌గా అఖిల్.. ఆకట్టుకుంటోన్న ఏజెంట్ ఫస్ట్ లుక్..

Akhil Agent First look Photo : Twitter

Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్ ఈరోజు తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

  • Share this:
    Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్ ఈరోజు తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అంతేకాదు తన సినిమా పేరును కూడా ప్రకటించాడు అఖిల్. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. 'సైరా'తో మరోసారి సత్తా చాటిన సురేందర్ రెడ్డి దీనికి దర్శకుడు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగానూ సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఇక ఏజెంట్ ఫస్ట్ లుక్ ను అఖిల్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేశారు. ఆ లుక్‌లో అఖిల్ అదరగొట్టాడనే చెప్పోచ్చు. చేతిలో సిగరేట్‌తో పొగను వదులుతూ స్టైలీష్‌గా ఉన్నాడు. ఈ ఫస్టు‌లుక్‌లోనే విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఇక అఖిల్ గత సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా ఇప్పటి వరకు వచ్చిన మూడు చిత్రాలు కూడా వైఫల్యం చెందినప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్టుల మీద మంచి అంచనాలు ఎప్పటికప్పుడు భారీగా నెలకొనడం అతనికి కెరీర్ కు ప్లస్ పాయింట్‌గా మారింది. అందుకు తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి కూడా అఖిల్ సినిమాను ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ సినిమానే చెయ్యనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాకు 40 కోట్ల బడ్జెట్‌ను కెటాయించారని సమాచారం.

    అఖిత్‌తో చేసే ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నాడట సురేందర్ రెడ్డి. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుంది చిత్రబృందం. ఈ భారీ యాక్షన్ చిత్రంలో హీరోయిన్‌గా వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న కన్నడ భామ రష్మిక మందన నటిస్తుందని టాక్. ఈ భామ ప్రస్తుతం తెలుగులో పుష్పలో నటిస్తోంది. దాంతో హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఆమె నటించిన తమిళ సినిమా సుల్తాన్ ఇటీవల విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది.


    ఇక అఖిల్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా జూన్ 19న విడుదలకానుంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందట. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: