హిట్.. విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని నిర్మించారు. ఆ సినిమా విజయం తర్వాత వెంటనే దానికి సీక్వెల్ కూడా ఉంటుందని అన్నారు దర్శకనిర్మాతలు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఇప్పుడు హిట్ 2 వస్తోంది. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు బదులుగా అడివి శేష్ (Adivi Sesh) నటిస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇక ఈరోజు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా టీమ్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో అడివి శేష్ (Adivi Sesh) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కూల్ కాప్ అంటూ విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో అడవి శేష్ క్రిష్ణ దాస్ పాత్రలో కనిపించనున్నారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుందట. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించనుంది. ఈ అమ్మడు ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడి’లో హీరోయిన్గా నటించింది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనిపించనుంది.
ఇక అడివి శేష్ (Adivi Sesh) సినిమాల విషయానికి వస్తే.. అందరిలా కాకుండా తనకు నచ్చిన జానర్లో సినిమాలను తీస్తూ.. వాటిలో హీరోగా చేస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నారు. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు థ్రిల్లర్ జానర్లో తెరకెక్కినవే. అందులో భాగంగా అడివి శేష్.. 'క్షణం', 'గూఢచారి' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన విషయం తెలిసిందే. అడవి శేష్ ప్రస్తుతం మేజర్ అనే సినిమాను చేస్తున్నారు. మహేష్ బాబు నిర్మిస్తున్నారు.
Bigger,Better and edge of the blade #HIT2
Happy birthday to our KD @AdiviSesh
With #Major and #HIT2 you are going to have the best year yet ?
Here’s the surprise for you #GlimpseOfKD https://t.co/e9EGWTFFDb@adivisesh
@saileshkolanu@prashantitipirn#meenakshichaudhary pic.twitter.com/TQbCBdnM68
— Nani (@NameisNani) December 17, 2021
Naga Chaitanya | Bangarraju : బంగార్రాజు నుంచి మాస్ పాట.. అక్కినేని ఫ్యాన్స్‌కు పూనకాలే..
ఈ `మేజర్` సినిమా విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adivi Sesh, Tollywood news