Home /News /movies /

HAPPY BIRTHDAY ACTOR CUM DIRECTOR PRODUCER R NARAYANA MURTHY DO YOU KNOW FACTS ABOUT PEOPLE STAR TA

HBD R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి గురించి ఈ నిజాలు తెలుసా..

ప్రస్తుతం పీపుల్స్ స్టార్ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ప్రజా గాయకుడు గద్ధర్ చెప్తున్నాడు. ఇన్నేళ్ళలో సంపాదించిందంతా మళ్లీ సినిమాలకే పెట్టాడు. ఎక్కడా తనకంటూ ఒక గుంట స్థలం కూడా కొనలేదు. ఇప్పుడు ఈయన కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాడంటూ ప్రజా గాయకుడు గద్దర్ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం పీపుల్స్ స్టార్ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ప్రజా గాయకుడు గద్ధర్ చెప్తున్నాడు. ఇన్నేళ్ళలో సంపాదించిందంతా మళ్లీ సినిమాలకే పెట్టాడు. ఎక్కడా తనకంటూ ఒక గుంట స్థలం కూడా కొనలేదు. ఇప్పుడు ఈయన కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నాడంటూ ప్రజా గాయకుడు గద్దర్ వ్యాఖ్యానించాడు.

Happy Birthday Peoples Star R Narayana Murthy | ఆకలి బాధలు ఆర్తనాదలే ఆయన కథాంశాలు. పీడితా వర్గాల ప్రజలే ఆయన పాత్రలు. సినిమా అంటే కేవలం కళాత్మకం కాదు.. ఆలోచనత్మకం అని నిరూపించిన ఏకైక మానవీయ వ్యక్తి ఆర్. నారాయణమూర్తి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు.

ఇంకా చదవండి ...
  Happy Birthday Peoples Star R Narayana Murthy | ఆకలి బాధలు ఆర్తనాదలే ఆయన కథాంశాలు. పీడితా వర్గాల ప్రజలే ఆయన పాత్రలు. సినిమా అంటే కేవలం కళాత్మకం కాదు.. ఆలోచనత్మకం అని నిరూపించిన ఏకైక మానవీయ వ్యక్తి ఆర్. నారాయణమూర్తి. సామాన్య ప్రజలే తన సినిమాకు పెద్ద ఆస్తి. వాళ్ల కష్టాలే ఆయన సినిమాలోని కథ. ఒక దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నా.. తాను అనుకున్నది వెండితెరమీద ఆవిష్కరించడమే నారాయణమూర్తి స్టైల్. పీపుల్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన ఆర్. నారాయణమూర్తి. పుట్టినరోజు సందర్భంగా న్యూస్ 18 స్పెషల్..

  ఆర్.నారాయణమూర్తి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను తెరమీద నిలిపించిన పీపుల్స్ స్టార్. పేదలపై జరుగుతున్న అన్యాయాలను తన సినిమాలో చూపించే హీరో. ఆయన వెండితెర మీద ప్రజా పోరాటాన్ని చూపిస్తున్న ప్రజల స్టార్. నలభై ఏళ్లుగా  పరిశ్రమలో ఉన్నా.. సినిమా సంస్కృతిని ఒంటపట్టించుకోని ముక్కుసూటి మనిషి.

  ఆర్.నారాయణ మూర్తి (ఫేస్‌బుక్ ఫోటో)


  జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతా, దర్శకుడిగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి.  తెలుగు సినీవినీలాకాశంలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న...ఆర్ నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లాలోని మల్లంపేటలో 1954 డిసెంబర్ 31న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. చదివింది బి.ఎ. ఆ ఊళ్లో బి.ఎ. పట్టా పొందిన వ్యక్తి ఆయన్నే. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టంతో.. అందులో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్లారు. అంతేకాదు.. అంతకుముందు స్కూల్లో, కాలేజీలో చిన్న చిన్న నాటకాలను కూడా వేసేవారు. మొదటి సారిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ సినిమాలో నారాయణమూర్తి నటించారు.


  ఆ తరువాత చాలా సినిమాల్లో  నారాయణామూర్తి నటించినా అంతగా పేరుని తీసుకురాలేదు. దాంతో మళ్లీ దాసరి నారాయణరావు ‘సంగీత’ సినిమాలో మెయిన్ రోల్ ఇచ్చారు. ఆ సినిమా మంచి పేరుని తీసుకువచ్చింది. సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు తన గురువు అని చెప్పుకుంటూ ఉంటారు నారాయణ మూర్తి.

  ఆర్.నారాయణ మూర్తి (ఫేస్‌బుక్ ఫోటో)


  ఆయన అనుకున్నవామపక్ష సిద్దాంతాలను తెరమీద ఉంచాలంటే.. తానే హీరో కావాలనుకున్నాడు. కానీ హీరో అవకాశాలు ఎవ్వరు ఇవ్వలేదు. అందుకు తానే డైరెక్టర్‌గా మారితే తన సినిమాను తానే తీయోచ్చు అనుకున్నాడు. ఆ తరువాత నిర్మాత లేకపోవడంతో తానే ప్రొడ్యూసర్‌గా కూడా మారాడు. అయితే జేబులో డబ్బులు లేకుండానే నిర్మాత అయ్యారు. తన స్నేహితులు ఇచ్చిన డబ్బుతో 1984లో స్నేహ చిత్ర పిక్చర్ బ్యానర్ ని స్థాపించి.. ‘అర్థరాత్రి స్వాతంత్య్రం’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

  ఆర్.నారాయణ మూర్తి (ఫేస్‌బుక్ ఫోటో)


  ఆ తర్వాత స్వీయ దర్వకత్వంలో ‘ఎర్రసైన్యం’, ‘ఓరేయ్ రిక్షా’, ‘అడవి దివిటీలు’, ‘చీమలదండు’, ‘చీకటి సూర్యులు’, ‘వేగు చుక్కలు’, ‘కూలన్న’, ‘దళం’, ‘దండోరా’, ‘రాజ్యాధికారం’ పేరు ఏదైనా సరే.. దర్శకుడు,నిర్మాత, యాక్టర్ ఒక్కడే. ఆ సినిమాల్లో సామాన్యుడే హీరో. విప్లవ భావాలే కథాంశాలు. ఇవే గత రెండున్నర దశాబ్దాలకు పైగా స్నేహ చిత్రపతాకం పై సినిమాలను నిర్మించిన ఏకైక వ్యక్తి ఆర్. నారాయణమూర్తి.

  ఆర్.నారాయణ మూర్తి (ఫేస్‌బుక్ ఫోటో)


  నారాయణామూర్తి పుట్టింది పశ్చిమగోదావరి జిల్లాలోనే అయినా.. ఆయన ప్రాంతం పట్టింపులను ఎప్పుడు పట్టించుకోలేదు. ప్రజలు ఎక్కడ కష్టాలు పడుతారో.. వాళ్లనే తన సినిమాలో కథాలుగా మలుచుకోవడం ఆయన స్టైయిల్. సాయుధ తెలంగాణ పోరాట చరిత్రను ఆధారం చేసుకొని.. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెరమీదకు ఎక్కించిన సినిమా ‘వీర తెలంగాణ’. తెలంగాణ ఉద్యమాన్ని తెరకెక్కించిన సినిమా ‘పోరు తెలంగాణ’. ఈ సినిమాలతో ఆయన ఈ ప్రాంతంలో మరింత ఆదరణ పొందారు.

  ఆర్.నారాయణ మూర్తి (ఫేస్‌బుక్ ఫోటో)


  క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేరే సినిమాల్లో భారీ ఆఫర్లు వచ్చినా..వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించి నమ్మిన సిద్దాంతమే ముఖ్యమనుకున్న అసలు సిసలు కథానాయకుడు ఆర్.నారాయణ మూర్తి. ఆయన తన సినీ ప్రయణంలో అనేక హిట్స్, కొన్ని ప్లాప్‌లను చూసినా.. ఆయన ఏనాడు బాధపడలేదు. కష్టపడడంలోనే నిజమైన ఆనందం ఉందని నమ్మిన రియల్ హీరో ఆర్.నారాయణమూర్తి. ఆయన నిజమైన ప్రజల హీరో. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: R.Narayana Murthy, Telugu Cinema, Tollywood

  తదుపరి వార్తలు