హోమ్ /వార్తలు /సినిమా /

HBD Action King Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ఈ నిజాలు తెలుసా..

HBD Action King Arjun : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ఈ నిజాలు తెలుసా..

హ్యాపీ బర్త్ డే యాక్షన్ కింగ్ అర్జున్ (Twitter/Photo)

హ్యాపీ బర్త్ డే యాక్షన్ కింగ్ అర్జున్ (Twitter/Photo)

HBD Action King Arjun |దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన యాక్షన్ సినిమాలతో యాక్షన్ కింగ్ అనే బిరుదు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అర్జున్. ఈ రోజు యాక్షన్ కింగ్ అర్జున్ పుట్టినరోజు.

HBD Action King Arjun |దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన యాక్షన్ సినిమాలతో యాక్షన్ కింగ్ అనే బిరుదు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అర్జున్. కన్నడనాట జన్మించిన అర్జున్...తమిళంలో అగ్ర కథానాయకుడిగా రాణించారు. అంతేనా...తెలుగులో ‘మన్నెంలో మొనగాడు’, మా పల్లెలో గోపాలు ‘హనుమాన్ జంక్షన్‌, ’త్రిమూర్తులు’, శ్రీ ఆంజనేయం’ వంటి డైరెక్ట్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.మరోవైపు దక్షిణాదిన ఉన్న కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కొన్ని సినిమాల్లో హీరోగా మెప్పించిన ఘనత అర్జున్‌ది. యాక్షన్ కింగ్ ఒక్క నటనలోనే కాదు...నిర్మాతగా, దర్శకుడిగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన కంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. అర్జున్...1964 ఆగష్టు 15న అప్పటి మైసూర్ (ప్రస్తుతం కర్నాటక) స్టేట్‌లో మధుగిరిలో జన్మించారు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరుశ్రీనివాస సర్జ. కానీ ఈయన సినిమాల్లో తన పేరును అర్జున్‌గా మార్చుకున్నారు.

ప్రఖ్యాత కన్నడ నటుడు శక్తి ప్రసాద్ కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన అర్జున్...ఆ తర్వాత కథానాయకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. 1973లో బ్రూస్లీ ప్రధాన పాత్రలో రిలీజైన ‘ఎంటర్ ది డ్రాగన్’ స్పూర్తితో మార్షల్ ఆర్ట్స్‌లో మంచి పట్టు సాధించారు. అదే అర్జున్‌కు దక్షిణాది సినీ పరిశ్రమలో యాక్షన్ కింగ్‌గా సెపరేట్ గుర్తింపు తీసుకొచ్చింది. అంతేకాదు దక్షిణాదిలో చాలా మంది హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేసారు.

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో యాక్షన్ కింగ్ అర్జున్ (Twitter/Photo)

యాక్షన్ కింగ్ అర్జున్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘జెంటిల్‌మేన్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ మూవీ తమిళంలో పాటు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైయింది. అర్జున్‌లోని పూర్తి స్థాయి యాక్షన్‌ను ఎలివేట్ చేసిన చిత్రం ఇది.

జెంటిల్‌మ్యాన్‌గా అర్జున్ (Youtube/Credti)

ఆ తర్వాత మరోసారి శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఒకే ఒక్కడు’ కూడా అర్జున్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మూవీలో ఒక్కరోజు సీఎం పాత్రలో అర్జున్ చూపించిన నటన ఎవరు మరవలేరు. అంతేకాదు ఈ మూవీలో అర్జున్ నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్ ఈ మూవీని బెస్ట్ క్లాసిక్‌గా నిలిచేలా చేసింది.

Oke Okkadu: ఒకే ఒక్కడులో అర్జున్, మనీషా కొయిరాల (File/Photo)

మరోవైపు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘శ్రీమంజునాథ’లో అర్జున్ సినీ కెరీర్‌లో మరో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఒకవైపు హీరోగా నటిస్తూనే ‘జై హింద్’ వంటి కొన్ని సినిమాలను నిర్మిస్తూ  డైరెక్ట్ చేసారు. ఈ మధ్యకాలంలో  అర్జున్ హీరోగానే కాకుండా.. తన పంథా మార్చుకొని విలన్ పాత్రలు చేస్తున్నారు.

‘శ్రీమంజునాథ‌’లో అర్జున్,చిరు, సౌందర్య (File/Photo)

ఈ క్రమంలోనే ‘లై’, ‘అభిమన్యుడు’, చిత్రాల్లో తనదైన క్లాస్ విలనిజం చూపించారు. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ మూవీలో హీరో ఫాదర్ క్యారెక్టర్‌లో చక్కగా ఒదిగిపోయారు. ఇపుడు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘ఖిలాడి’లో పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు.

యాక్షన్ కింగ్ అర్జున్ బర్త్ డే (Twitter/Photo)

హీరోగా విలన్‌గా చేస్తున్న అర్జున్ కెరీర్ మొదటి నుంచి  ఒకే తరహా బాడీ మెయింటెన్ చేయడం విశేషం. ఫిల్మ్ కెరీర్‌లో 150 సినిమాల మైలురాయిని అందుకున్న ఈ ఒకేఒక్కడు అర్జున్‌కి  న్యూస్ 18 మరోసారి బర్త్ డే విషెస్ చెబుతుంది.

ఇవి కూడా చదవండి

Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీకి అదిరిపోయే టైటిల్.. ఖుషీ చేసుకుంటున్న ఫ్యాన్స్..


Ram Charan: జాతీయ పతాకాన్ని అవమానపరిచాడంటూ రామ్ చరణ్ పై మండిపడుతున్న నెటిజన్స్..

బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ..

Independence Day 2021: టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సైనికుడి పాత్రలో మెప్పించిన హీరోలు..


Venkatesh@35Years : టాలీవుడ్‌లో హీరోగా 35 యేళ్లు పూర్తి చేసుకున్న వెంకటేష్.. విక్టరీ హీరో కెరీర్‌‌‌లో టాప్ సినిమాలు ఇవే..


HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..


First published:

Tags: Action King Arjun, Kollywood, Sandalwood, Tollywood

ఉత్తమ కథలు