#HBDAllariNaresh: టాలీవుడ్ కామెడీకి కెేరాఫ్ అడ్రస్ ‘అల్లరి’ నరేష్..

అల్లరి నరేష్..హాస్య చిత్రాల హీరోగా అల్లరి చేయడంలో అతను సీమటపాకాయ్. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టడంలో ఫిట్టింగ్ మాస్టార్. తన నవ్వులతో ఆడియన్స్‌కు మడతకాజా తినిపించడంలో సీమశాస్త్రీ. గోపీ అంటూ గోడమీదపిల్లిలా నవ్వులు కురిపించిన..బెట్టింగ్ బంగార్రాజుగా వీక్షకులను సరదాగా కాసేపు నవ్వించిన అతనికే చెల్లింది. గత కొన్నేళ్లుగా తెలుగు కామేడీ సినిమాలకు అతనే కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ప్రస్తుతం హీరోగా చేస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకున్నాడు.

news18-telugu
Updated: June 30, 2019, 11:31 AM IST
#HBDAllariNaresh: టాలీవుడ్ కామెడీకి కెేరాఫ్ అడ్రస్ ‘అల్లరి’ నరేష్..
అల్లరి నరేష్( క్రెడిట్ ఫిల్మ్ నగర్ ట్విట్టర్ ఫోటో)
  • Share this:
అల్లరి నరేష్..హాస్య చిత్రాల హీరోగా అల్లరి చేయడంలో అతను సీమటపాకాయ్. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టడంలో ఫిట్టింగ్ మాస్టార్. తన నవ్వులతో ఆడియన్స్‌కు మడతకాజా తినిపించడంలో సీమశాస్త్రీ. గోపీ అంటూ గోడమీదపిల్లిలా నవ్వులు కురిపించిన..బెట్టింగ్ బంగార్రాజుగా వీక్షకులను సరదాగా కాసేపు నవ్వించిన అతనికే చెల్లింది. గత కొన్నేళ్లుగా తెలుగు కామేడీ సినిమాలకు అతనే కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ప్రస్తుతం హీరోగా చేస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకున్నాడు. అంతేకాదు ఇపుడు ‘బంగారు బుల్లోడు’గా ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు. నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు.టాలీవుడ్ లో కామెడీ స్టార్ రాజేంద్రప్రసాద్ తర్వాత... అంతలా ప్రేక్షకుల్ని తన హాస్యంతో ఆకట్టుకొంటున్న నటుడు నరేష్. 2002లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రం అల్లరితో కామెడీ నటుడిగా తననుతాను ప్రూవ్ చేసుకొని ఆడియన్స్ కు దగ్గరైయ్యాడు. ఈ సినిమా తర్వాత అల్లరి అనేది నరేష్ ఇంటిపేరుగా మారిపోయింది.

Happy Birth Day Tollywood Comedy King Allari Naresh,#allarinaresh,#HBDAllariNaresh,Allari Naresh Happy birth Day,bangaru bulludu,allari naresh bangaru bullodu,allari naresh,allari naresh movies,allari naresh comedy movies,allari naresh comedy,allari naresh wife,allari naresh real life,allari naresh daughter,allari naresh wife pics,allari naresh interview,allari naresh wife photo,allari naresh wife photos,allari naresh and his wife,allari naresh comedy scenes,allari naresh family photos,hero allari naresh daughter,allari naresh daughter pics,Tollywood comedy king allari naresh,tollywood,telugu cinema,అల్లరి నరేష్,అల్లరి నరేష్ బర్త్ డే,బంగారు బుల్లోడు,టాలీవుడ్ కామెడీ కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్,అల్లరి నరేష్ కామెడీ,
నరేష్ ట్విట్టర్ పోటోస్

తన మార్క్ అల్లరి నటనతో ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తున్న నరేష్.. 1982 జూన్ 30న పశ్చిమ గోదావరి జిల్లా కోరుమామిడిలో ఇ.వి.వి.సత్యనారాయణ, సరస్వతి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచి నరేష్ తెలివి తేటలు చూసి తనలా దర్శకుడు అవుతాడనుకున్న ఇ.వి.వి ఆలోచనలను తలక్రిందులు చేస్తూ నటుడిగా స్థిరపడ్డాడు. టాలీవుడ్ లో ప్రజెంట్ జనరేషన్‌లో హాస్య చిత్రాలకు ఐకాన్ అయ్యాడు.

Akhil, Sai Dharam Tej, Naga Chaitanya, Nithiin all are waiting for an blockbuster pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. flop heroes in telugu industry,no hit for telugu hereos,akhil mr majnu flop,akhil akkineni flops,bellamkonda flops,allari naresh flops,sai dharam tej flops,nithiin flops,telugu heroes flops,telugu cinema,నితిన్ ఫ్లాపులు,కళ్యాణ్ రామ్ ఫ్లాపులు,హిట్ కోసం గోపీచంద్ ఎదురుచూపులు,ఆరు ఫ్లాపులు ఇచ్చిన సాయిధరమ్ తేజ్,ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న రాజ్ తరుణ్,మంచు విష్ణు మనోజ్‌లకు ఫ్లాపులు,నితిన్ హ్యాట్రిక్ ఫ్లాపులు,నాగచైతన్యకు ఫ్లాపులు,తెలుగు సినిమా
‘సుడిగాడు’గా అల్లరినరేష్
తండ్రి ఇ.వి.వి తో కలిసి దాదాపు ఎనిమిది చిత్రాల్లో హీరోగా నటించాడు. వీటిలో దాదాపు అన్ని కూడా విజయం సాధించనవి కావడం విశేషం. వీటిలో తొట్టిగ్యాంగ్, కితకితలు, బెండు అప్పారావు ఆర్.ఎమ్.పి, కత్తి కాంతారావు వంటివి అల్లరినరేష్ కు కామెడీ స్టార్ ఎదగడంలో దోహదం చేశాయి. 2008లో అల్లరి నరేష్ నటించిన ‘గమ్యం’ నటుడిగా ప్రేక్షకుల రివార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కేలా చేశాయి. ఈ సినిమాలో గాలిశీను పాత్రలో ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తూనే కంటతడిపెట్టించాడు. ఈ చిత్రానికి తొలిసారి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు సైతం అందుకోవడం విశేషం.

Akhil, Sai Dharam Tej, Naga Chaitanya, Nithiin all are waiting for an blockbuster pk.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. flop heroes in telugu industry,no hit for telugu hereos,akhil mr majnu flop,akhil akkineni flops,bellamkonda flops,allari naresh flops,sai dharam tej flops,nithiin flops,telugu heroes flops,telugu cinema,నితిన్ ఫ్లాపులు,కళ్యాణ్ రామ్ ఫ్లాపులు,హిట్ కోసం గోపీచంద్ ఎదురుచూపులు,ఆరు ఫ్లాపులు ఇచ్చిన సాయిధరమ్ తేజ్,ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న రాజ్ తరుణ్,మంచు విష్ణు మనోజ్‌లకు ఫ్లాపులు,నితిన్ హ్యాట్రిక్ ఫ్లాపులు,నాగచైతన్యకు ఫ్లాపులు,తెలుగు సినిమా
‘బంగారు బుల్లోడు’గా అల్లరి నరేష్ (ట్విట్టర్ ఫోటో)

నవ్వు తెప్పించే ముఖంతో, కొంటె డైలాగులతో హాస్యాన్ని పండించడంలో అల్లరి నరేష్ టైమింగే వేరు. హాస్య చిత్రాల కథానాయకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కేవలం హాస్య చిత్రాలకే పరిమితం కాకుండా ‘నేను’, ‘విశాఖ ఎక్స్ ప్రెస్ర్’, ‘డేంజర్’, ‘శంభో శివ శంభో’, ‘సుందరాకాండ’తో పాటు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘మహర్షి’లో హీరో ఫ్రెండ్ పాత్రలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. మొత్తానికి 17 ఏళ్లలో 50 పైగా చిత్రాల్లో హీరోగా నటించిన ఇప్పటి జెనరేషన్‌లో రికార్డు క్రియేట్ చేసాడు. ఇపుడు ‘బంగారు బుల్లోడు’గా ఆడియన్స్ ముందుకొచ్చాడు
First published: June 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు