#HappyBirthDay టాలీవుడ్‌కి ’రికార్డులు‘ నేర్పిన మెగాస్టార్

2015లో 150వ సినిమా విషయం చెప్పాడు. 2016లో ఖైదీ నెం.150 పోస్టర్ ఇచ్చాడు.. 2017లో సైరా మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇప్పుడు టీజర్ విడుదల చేసారు. పైగా ఫ్యాన్స్‌తో కూడా కలిసి పోతున్నాడు చిరంజీవి. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి వచ్చేయడంతో మళ్లీ అభిమానులతోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు మెగాస్టార్.ఈరోజు చిరంజీవి 64వ ఏట అడుపెట్టబోతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

news18-telugu
Updated: August 22, 2018, 11:46 AM IST
#HappyBirthDay టాలీవుడ్‌కి ’రికార్డులు‘ నేర్పిన మెగాస్టార్
‘సైరా’ టీజర్‌లో చిరంజీవి
  • Share this:
కొన్నేళ్ల కింది వరకు ఆగస్ట్ 22 వచ్చిందంటే మెగాస్టార్ అభిమానులకు పండగే. ఆ రోజు ఉదయం నుంచే సందడి మొదలయ్యేది. ఇంకా చెప్పాలంటే ముందు రోజు సాయంత్రం నుంచే అన్నయ్య బర్త్ డే ఎలా సెలెబ్రేట్ చేయాలా అని ఆలోచించేవాళ్లు అభిమానులు.. అభిమాన సంఘాల నాయకులు. ఆ రోజు రక్తదానాలు.. ప్రతీ టీవీ ఛానెల్‌లో కోడి కూసిన దగ్గర్నుంచి చిరంజీవి పాటలు.. అబ్బో పదేళ్ల కింది వరకు ఆగస్ట్ 22 అంటే ఇండస్ట్రీకి చిన్నసైజ్ పండగే. 2008 వరకు కూడా ఇదే జరుగుతూ వచ్చింది కానీ 2008లో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాడు. అందరివాడు కాస్తా కొందరివాడుగా మారిపోయాడు.

chiru birth day
chiru birth day


అక్కడ్నుంచి పుట్టినరోజు వేడుకలు ఆగిపోయాయి. ఫ్యాన్స్‌తో బయటికి రావడాలు.. వాళ్లను కలవడం ఇవన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎవరో ఒకరద్దర్ని కలవడం మినహాయిస్తే చిరు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే గత మూడేళ్లుగా ఈయన కూడా మళ్లీ స్టైల్ మార్చాడు. అప్పట్లో తన పుట్టినరోజు ఎలా అయితే జరిగేదో మళ్లీ అలాంటి రోజుల్లోకి వెళ్లిపోతున్నాడు మెగాస్టార్.

2015లో 150వ సినిమా విషయం చెప్పాడు. 2016లో "ఖైదీ నెం.150" పోస్టర్ ఇచ్చాడు.. 2017లో సైరా మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇప్పుడు టీజర్ విడుదల చేసారు. పైగా ఫ్యాన్స్‌తో కూడా కలిసి పోతున్నాడు చిరంజీవి. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు వదిలేసి సినిమాల్లోకి వచ్చేయడంతో మళ్లీ అభిమానులతోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు మెగాస్టార్. ఇకపై కూడా ఇదే కొనసాగేలా కనిపిస్తుంది. మొత్తానికి అన్నయ్య మళ్లీ అలా అభిమానులతో కలిసి కనిపించడం మాత్రం అందరికీ హ్యాపీనే. మరీ ముఖ్యంగా అభిమానులు అయితే ఇంకా హ్యాపీ. ఈ సారి కూడా ఎప్పట్లాగే ఓ రోజు ముందుగానే మెగా బర్త్ డే సంబరాలు జరిగాయి. మెగా హీరోలంతా అందులో పాల్గొన్నారు కూడా. ఇక బర్త్ డే రోజు ఆ సంబరాలు మరింత అంబరాన్ని తాకనున్నాయి. ఇలాంటి పుట్టినరోజులు మన మెగాస్టార్ మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరోసారి న్యూస్ 18.కామ్ తరఫు నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

First published: August 22, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>