హోమ్ /వార్తలు /సినిమా /

HBD Sukumar : సుకుమార్ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్..

HBD Sukumar : సుకుమార్ కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్..

HBD Sukumar

HBD Sukumar

HBD Sukumar : క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌లు ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. సుక్కు బర్త్ డే సందర్భంగా DSP తనదైన స్టైల్ లో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

దర్శకుడు సుకుమార్ (Sukumar) ప్రస్తుతం ‘పుష్ప’ (Pushpa) గుబాళింపులతో ఆనందతీరాల్లో విహరిస్తున్నారు. జనం కోరేది మనం ఇవ్వాలి… మనం చేసేది జనం మెచ్చేలా ఉండాలి… ఈ సూత్రాన్ని తు.చ. తప్పక పాటిస్తారు సుకుమార్. ఆ సూత్రంతో పాటు, జనానికి ఎప్పుడు ఏ కథ చూపించాలి, ఏ సన్నివేశాన్ని ఎలా పండిస్తే రక్తి కడుతుంది అన్న సూత్రాలనూ అధ్యయనం చేసి సరైన లెక్కలు వేసుకొని, మరీ పక్కాగా సినిమాలు తెరకెక్కిస్తారాయన. అంతేనా..ఊ అంటావా.. ఊహూ అంటావా మావా అంటూ జనంచేత ఊర మాస్‌ స్టెప్పు లేయించారు ఐటమ్‌ సాంగ్‌ స్పెషలిస్ట్‌ సుక్కు సార్‌. జనవరి 11 సుకుమార్‌ బర్త్‌డే. దీంతో, ఫ్యాన్స్.. సెలబ్రిటీలు సుక్కుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఇక, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌లు ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. సుక్కు నుంచి ఒక సినిమా వస్తే..దానికి కచ్చితం దేవినే సంగీతం అందించాలి. పాటలు కూడా సూపర్‌ హిట్‌ అవ్వాల్సిందే. ఆర్య నుంచి మొదలు మొన్నటి పుష్ప వరకు.. సుక్కు ప్రతి సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు దేవీశ్రీ ప్రసాద్‌. సుక్కు బర్త్ డే సందర్భంగా తన స్నేహితుడికి పాట రూపంలో బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు డీఎస్పీ. పుష్ప మూవీలోని ‘శ్రీవల్లీ’పాటకుపేరడీగా ఈ బర్త్‌డే సాంగ్‌ సాగుతుంది.

ఇక, సుకుమార్ 1970 జనవరి 11న తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో పుట్టారు. ఇంట్లో ఎపుడూ సినిమాల గురించే చర్చ. అలా ముగ్గురు అన్నల ముద్దుల తమ్ముడిగా బోల్డన్ని సినిమాలను చూసే అవకాశం ఇక్కింది. అలా అని చదువును ఎపుడూ నిర్లక్ష్యం చేయలేదు.

మాథ్స్‌లో మంచి ప్రావీణ్యం సాధించిన సుకుమార్‌ భీమవరంలో లెక్కల మాస్టారుగా పాఠాలు చెప్పారు. ఆ తరువాత కొన్ని మూవీలకు రైటర్‌గా పని చేశారు. అలా 2004లో బన్నీ హీరోగా ‘ఆర్య’ పట్టాలెక్కింది. తొలి చిత్రంతోనే అటు ఇండస్ట్రీని ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుని భళా అనిపించారు సుకుమార్.

' isDesktop="true" id="1158798" youtubeid="gNVtBtXvGYw" category="movies">

మూడేళ్ళ గ్యాప్ తరువాత తీసిన జగడం సక్సెస్‌ కాలేదు. చివరికి తనకు తొలి సక్సెస్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌తోనే ‘ఆర్య-2’ తెరకెక్కించినా పరాజయం పలకరించింది. మళ్లీ ‘100 పర్సెంట్ లవ్’ హిట్‌ తరువాత వన్‌ నేనొక్కడినే అన్నా నో యూజ్‌. కొంత గ్యాప్‌ తరువాత యంగ్‌ హీరో ఎన్టీర్‌తో కు ‘నాన్నకు ప్రేమతో’ మూవీతో జనాన్ని ఎట్రాక్ట్‌ చేసారు.

ఇక ఆ తరువాత మెగా హీరో రాం చరణ్‌తో ‘రంగస్థలం’ తెరకెక్కించి, అప్పటివరకు తన కరియర్‌లో ఉన్న లెక్కలన్నింటిని సరిచేసేశారు. అదే ఊపులో ‘అల…వైకుంఠపురములో’ చిత్రంతో బంపర్‌ హిట్‌ కొట్టిన స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌పై సుకుమార్‌ కన్ను పడింది.

ఇది కూాడా చదవండి : గోపిచంద్ హీరోయిన్ పై స్టార్ హీరో లైంగిక దాడి.. ఆ దారుణ ఘటనపై భావన రియాక్షన్..

పుష్ప అంటే పువ్వు కాదు ఫైర్‌ అంటూ ‘పుష్ప’ చిత్రం రగిలించిన ఫైర్‌ మామూలుగా అంటుకోలేదు. తెలుగు పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పట్లో ‘ఆర్య, ఆర్య-2’ ఇపుడు ‘పుష్ప-ద రైజ్’కు సీక్వెల్ ‘పుష్ప-ద రూల్’ తెరకెక్కిస్తున్నారు. ఏం పుష్ప పార్టీ లేదా అంటూ తన మార్క్‌ విలనిజంతో ఆకట్టుకున్న మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ విశ్వ రూపాన్ని ఆవిష్కరించబోతున్నారు సుకుమార్‌. సుక్కు, బన్నీ, ఫహాద్‌ కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

First published:

Tags: Devi Sri Prasad, Director sukumar, Pushpa film, Sukumar, Tollywood news

ఉత్తమ కథలు