#HBDRamyakrishna:హాఫ్ సెంచరీ వయసులోను అదరగొడుతున్న రమ్యకృష్ణ..

1990లో వ‌చ్చిన "అల్లుడు గారు" సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంది. అక్క‌డ్నుంచి వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఒక‌ప్పుడు ఆమె న‌టిస్తే ఫ్లాప్ అనుకున్న వాళ్లే.. ర‌మ్య ఉంటే సినిమా హిట్ అనుకునే స్టేజ్‌కు వ‌చ్చారు. 1990 నుంచి 2000.. ఈ ప‌దేళ్ల గ్యాప్‌లో ఎన్నో సంచ‌ల‌న సినిమాలు చేసింది ర‌మ్య‌కృష్ణ‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇండ‌స్ట్రీల్లో త‌న‌దైన ముద్ర వేసింది.

news18-telugu
Updated: September 15, 2019, 2:06 PM IST
#HBDRamyakrishna:హాఫ్ సెంచరీ వయసులోను అదరగొడుతున్న రమ్యకృష్ణ..
రమ్యకృష్ణ (Facebook/Photos)
  • Share this:
ర‌మ్యకృష్ణ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవస‌రం లేదు. ఇండియ‌న్ ఇండ‌స్ట్రీని త‌న అందాల‌తో.. అభిన‌యంతో ఆడుకుంది ర‌మ్య‌కృష్ణ‌. కొన్నేళ్ల పాటు నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చ‌క్రం తిప్పింది. ఇండ‌స్ట్రీ ఏదైనా త‌న న‌ట‌న‌తో అంద‌రికీ పిచ్చెక్కించింది ఈ నీలాంబ‌రి. యాక్టింగ్ అయినా.. గ్లామ‌ర్ అయినా అన్నింట్లోనూ ర‌మ్య‌కృష్ణ నెంబ‌ర్ వ‌న్. ఇప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో కుర్ర హీరోయిన్ల‌కు కూడా షాక్ ఇస్తుంది ఈ భామ‌. సెప్టెంబర్ 15, 1967లో తమిళనాడులో జన్మించింది ర‌మ్యకృష్ణ‌. ఈమె తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు.

హ్యాపీ బర్త్ డే రమ్యకృష్ణ‌.. నేడు శైల‌జారెడ్డి పుట్టిన‌రోజు.. happy birth day Ramya Krishnan
రమ్యకృష్ణ‌


తన 13వ యేటనే నటిగా కెరీర్ ప్రారంభించింది రమ్యకృష్ణ. కెరీర్ ఆరంభంలోరమ్యకృష్ణ నటించిన చిత్రాలు అంతగా ఆదరణ పొందలేదు. నటిగా సరైన అవకాశాలు రాలేదు. దాంతో రమ్యను ఐరన్ లెగ్ అన్నవారు కూడా లేకపోలేదు. 1989లో కళాతపస్వీ కె.విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘సూత్రధారులు’తో నటిగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి.

హ్యాపీ బర్త్ డే రమ్యకృష్ణ‌.. నేడు శైల‌జారెడ్డి పుట్టిన‌రోజు.. happy birth day Ramya Krishnan
రమ్యకృష్ణ‌


‘సూత్ర‌దారులు’  త‌ర్వాత చాలా కాలం పాటు అవ‌కాశాలు లేక ఖాళీగా ఉన్న ర‌మ్య‌కృష్ణ కెరీర్‌కు అస‌లైన బ్రేక్ ఇచ్చాడు రాఘ‌వేంద్ర‌ రావు.1990లో వ‌చ్చిన "అల్లుడు గారు" సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంది. అక్క‌డ్నుంచి వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు సౌత్ ఇండియ‌న్ టాప్ హీరోలంద‌రితోనూ ర‌మ్య‌కృష్ణ న‌టించింది.ఒక‌ప్పుడు ఆమె న‌టిస్తే ఫ్లాప్ అనుకున్న వాళ్లే.. ర‌మ్య ఉంటే సినిమా హిట్ అనుకునే స్టేజ్‌కు వ‌చ్చారు. 1990 నుంచి 2000.. ఈ ప‌దేళ్ల గ్యాప్‌లో ఎన్నో సంచ‌ల‌న సినిమాలు చేసింది ర‌మ్య‌కృష్ణ‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇండ‌స్ట్రీల్లో త‌న‌దైన ముద్ర వేసింది.

హ్యాపీ బర్త్ డే రమ్యకృష్ణ‌.. నేడు శైల‌జారెడ్డి పుట్టిన‌రోజు.. happy birth day Ramya Krishnan
రమ్యకృష్ణ‌


ముఖ్యంగా ఆమె కెరీర్‌లో "నరసింహ" ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది. రజినీకాంత్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో నీలాంబ‌రిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయే ప‌ర్ఫార్మెన్స్ చేసింది. స్వతహాగా డాన్స‌ర్ కావ‌డంతో అది సినిమాల్లో కూడా చాలా హెల్ప్ అయింది.
హ్యాపీ బర్త్ డే రమ్యకృష్ణ‌.. నేడు శైల‌జారెడ్డి పుట్టిన‌రోజు.. happy birth day Ramya Krishnan
రమ్యకృష్ణ‌


ప్ర‌తీ సినిమాలోనూ ర‌మ్య డాన్సులు కుర్రాళ్ల‌కు మ‌తులు చెడ‌గొట్టేసాయి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీని పెళ్లి చేసుకుని.. ఇప్ప‌టికీ కెరీర్ కొన‌సాగిస్తుంది ఈ భామ‌. ముఖ్యంగా "బాహుబ‌లి"లో శివ‌గామి పాత్ర‌తో ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో మ‌రోసారి త‌న స‌త్తా చూపించింది. హిందీలోను ‘ఖల్ నాయక్’, బడేమియా ఛోటే మియా’ సినిమాల్లో నటించి అక్కడ కూడా సత్తా చాటింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అమితాబ్‌తో మరో సినిమా చేస్తుంది. వాటితో తెలుగు, తమిళంలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై తెరకెక్కే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆల్రెడీ సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా జయలలిత కుటుంబ సభ్యుల అనుమతి లేకపోవడంతో లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ఏమైనా వెండితెరపై తనదైన నటనతో అలరిస్తోన్న రమ్యకృష్ణ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.
First published: September 15, 2019, 2:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading