పుట్టినరోజున నితిన్ సంచలనం.. పెళ్లి చేసుకోనంటున్న కుర్రహీరో..

పుట్టినరోజు సందర్భంగా నితిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అదేమిటంటే ఇకపై పెళ్లి చేసుకోనని శపథం చేసాడు. నితిన్ ఏంటి పెళ్లి చేసుకోనని చెప్పడం ఏంటి అనుకుంటున్నారా..వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 30, 2019, 10:08 AM IST
పుట్టినరోజున నితిన్ సంచలనం.. పెళ్లి చేసుకోనంటున్న కుర్రహీరో..
నితిన్ ఫైల్ ఫోటో (Nithiin Engagement)
  • Share this:
పుట్టినరోజు సందర్భంగా నితిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అదేమిటంటే ఇకపై పెళ్లి చేసుకోనని శపథం చేసాడు. నితిన్ ఏంటి పెళ్లి చేసుకోనని చెప్పడం ఏంటి అనుకుంటున్నారా..వివరాల్లోకి వెళితే.. శ్రీ‌నివాస క‌ళ్యాణం త‌ర్వాత ఒక్క సినిమా కూడా ప‌ట్టాలెక్కించ‌లేదు నితిన్. వ‌ర‌స సినిమాలు క‌మిట్ అవుతున్నాడు కానీ ఒక్క‌టి కూడా సెట్స్ పైకి రాలేదు. దాంతో ఈ మ‌ధ్యే అభిమానుల‌కు ఓ లేఖ కూడా రాసాడు ఈ కుర్ర హీరో. ఈ శనివారం నితిన్ బర్త్ డే సందర్భంగా వెంకీ కుడుములతో చేయబోయే ‘భీష్మ’  సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసాడు. సింగిల్ ఫర్ ఎవర్ అనేది ఉపశీర్షిక.మహాభారతంలో భీష్ముడిలా బ్రహ్మచారిలా ఉండాలనుకునే ఒక కుర్రాడి కథ ఇది. కానీ ఈ పోస్టర్ చూస్తుంటే అతని మది నిండా అమ్మాయిలు ఉన్నట్టు చూపించారు.  చూస్తుంటే ఆధునిక భీష్ముడి టైపు క్యారెక్టర్ అన్నమాట. అనుభవించు రాజా టైపు పాత్ర అన్నట్టు భీష్మ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. అమ్మాయిలతో తిరుగుతాడు.కానీ పెళ్లి మాత్రం నో అని చెప్పే మాడ్రన్ భీష్మ క్యారెకర్ట్ అని ఈ పోస్టర్‌ను చూస్తే అర్థమవుతుంది.కాన్సెప్ట్ చేస్తుంటే ఇది రామ్ చరణ్..‘ఆరెంజ్’,అఖిల్..‘Mr.మజ్ను’తరహా కాన్సెప్ట్‌ మూవీ అని తెలుస్తోంది.

పుట్టినరోజు సందర్భంగా నితిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అదేమిటంటే ఇకపై పెళ్లి చేసుకోనని శపథం చేసాడు. నితిన్ ఏంటి పెళ్లి చేసుకోనని చెప్పడం ఏంటి అనుకుంటున్నారా..వివరాల్లోకి వెళితే..
నితిన్ ‘భీష్మ’ ఫస్ట్ లుక్


‘ఛలో’ వంటి కామెడీ ఎంటర్టేనర్‌ తర్వాత వెంకీ కుడుముల చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు నితిన్.. చంద్ర‌శేఖ‌ర్ యేలేటితో తాను ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్రకటించాడు. ఈ సినిమాను భవ్య క్రియేషన్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మరోవైపు ‘రైడ్’,ఒక ఊరిలో’ వంటి సినిమాలను తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో చేయబోయే సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్నను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. మరి పుట్టినరోజు తర్వాతైనా హీరోగా నితిన్‌ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 30, 2019, 10:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading