Bhanumathi Birth Anniversary : ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను ఆ విధంగా ముచ్చెమటలు పట్టించిన భానుమతి..

భానుమతి జయంతి (Twitter/Photo)

Happy Birthday Bhanumathi | భానుమతి నటిగానే కాకుండా రచయితగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగుతెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె జయంతి సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకుందాం.

  • Share this:
Bhanumathi  Birth Anniversary | పాత్ర ఎటువంటిదైన సరే...ఆమె పోషిస్తే ఆ పాత్రకు నిండుదనం చేకూరుతుంది. మల్లీశ్వరిగా నాగరాజును ఆటపట్టించినా....పల్నాటి నాగమ్మగా విలనిజాన్ని పండించినా....మంగమ్మగా పెద్దరికం ప్రదర్శించినా... ఆమెకె చెల్లింది.  సాంఘిక చిత్రాల్లోనే కాకుండా, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాల్లో తనదైన నటనతో జీవం పోసిన వెండితెర లైలా. నటిగానే కాకుండా రచయితగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగుతెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి(Bhanumathi) . ఆమె జయంతి సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకుందాం. భానుమతి చూడగానే నిండైన రూపం. చక్కటి రూప లావణ్యం, అన్నింటికి మించి కోయిల లాంటి గాత్రం. ఆమె గాన మాధుర్యమే ఆమెకు పెద్ద ఎస్సెట్ గా నిలిచిందనడంలో అతిశయోక్తి కాదు.

ఎన్నో విలక్షణ పాత్రలకు తన నటనతో జీవం పోసిన భానుమతి....1924 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లాలోని దొడ్డవరంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే భానుమతికి సంగీతం అంటే ప్రాణం. గాయని కావలన్నదే ఆమె కోరిక. ఇవే ఆమెను సినిమాలవైపు అడుగులు వేసేలా చేసాయి.

Nuvvu Naaku Nachav@20Years: 20 యేళ్ల వెంకటేష్ కల్ట్ కామెడీ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’.. ఫైనల్ కలెక్షన్స్..

భానుమతి తెలుగు సినిమా పరిశ్రకు తొలి ‘మల్లీశ్వరి’. భానుమతికి చిన్నప్పటి నుంచే ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం పాలు ఎక్కువ. నటిగా ఆమె ఫస్ట్ మూవీ ‘వర విక్రయం’. భానుమతిని తొలుత ఆమె తండ్రి గాయనిగానే చూడాలనుకున్నారు. మొదట అభ్యంతరం చెప్పినా, టంగుటూరి సూర్యకుమారి ప్రోద్బలంతో నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ రోజుల్లో ప్లే బ్లాక్ పద్ధతి ఉండేది కాదు. ఎవరి పాటలను వారే పాడుకునే వారు. తొలి సినిమాతోనే తన నటన, గాత్రంతో అందిరిని ఆకట్టుకుంది భానుమతి.

భానుమతి సినిమాలు (Twitter/Photo)


స్వతహాగా గాయని అయిన భానుమతిని హీరోయిన్‌గా ఛాన్స్ రావడానికి.... ఆమె గాత్రమే కీ రోల్ పోషించింది. ఆమెతో నటించాలని ఎన్టీఆర్, ఏఎన్నార్‌లే కలుల కనేవారు. యస్ తొలి సినిమా అగ్ర కథానాయకులకన్నా ముందే ఆమె ఒక స్టార్. భానుమతి అంటే ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ప్రతీక. పురుషాధిక్య సమాజంలో సగర్వంగా నిలచి గెలిచిన ధీశాలి భానుమతి. అంతేకాదు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్,ఏఎన్నార్‌లకు భానుమతితో సినిమా అంటే అప్పట్లో హడల్.

Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

భానుమతి చాలా నిక్కచ్చి మనిషి. నచ్చని విషయాలను నిర్మొహమాటంగా వారి ఎదుటే చెప్పేస్తుంది. ఆమె గళం, విశాల నేత్రాలు, నటన, హావభావాలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ‘కృష్ణ ప్రేమ’ చిత్రంలో నటించేటప్పుడు అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేసే రామకృష్ణను ప్రేమించి పెళ్లిచేసుకుంది. పెళ్లైన కొంతకాలం ఆమె నటించలేదు. ప్రముఖ నటుడు బి.ఎన్.రెడ్డి, భర్త రామకృష్ణ  ప్రోత్సాహంతో తిరిగి ‘స్వర్గసీమ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో నటిగా భానుమతి వెనుతిరిగి చూసుకోలేదు.

భానుమతి (ఫేస్‌బుక్ ఫోటో)


ఆ తర్వాత 1951లో బి.ఎన్.రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘మల్లీశ్వరి’ భానుమతి ఖ్యాతిని ఖండాతరాలకు పెంచింది. నటిగా భానుమతి స్థానం శిఖరాగ్ర స్థానానికి చేర్చిందీ మూవీ. ఈ సినిమాలో భానుమతి, ఎన్టీఆర్ పోటీపడి మరి నటించారు. హృద్యమైన కథ,కథనాలతో నిర్మించిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మేలిమలుపు. దేవులపల్లి కవితాత్మక పదాలకు, సాలూరి స్వరపరిచిన మధుర స్వరాలకు భానుమతి తన గాత్రంతో మరింత వన్నె తెచ్చారు. ఈ సినిమా దర్శకుడిగా బి.ఎన్.రెడ్డికి ఎంత పేరు వచ్చిందో....భానుమతికి అంతే పేరొచ్చింది.

Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..


భానుమతి, తన భర్త రామకృష్ణతో కలిసి, తన కుమారుడి పేరుమీద ‘భరణీ పిక్చర్స్’ అనే సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌పై ‘చక్రపాణి’, ‘విప్రనారాయణ’, ‘లైలా మజ్ను’, ‘వివాహబంధం’, ‘గృహలక్ష్మీ’, ‘బాటసారి’, ‘చండీరాణి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి సక్సెస్ సాధించారు. ఈ బ్యానర్ లో ఆనాటి అగ్ర కథానాయకులందరు హీరోలుగా నటించడం విశేషం. ఇక ‘పల్నాటి యుద్ధం’లో నాగమ్మగా, భానుమతి పండించిన నటనకు జాతీయ అవార్డు దాసోహం అయింది.

భానుమతి (ఫేస్‌బుక్ ఫోటోలు)


ఇక ‘చండీరాణి’ సినిమాతో భానుమతి దర్శకురాలిగా మారింది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించడమే కాకుండా హిందీ, తమిళ్,తెలుగు భాషల్లో నిర్మించడం అప్పట్లో ఒక సాహసం అనే చెప్పాలి. అప్పట్లోనే ప్యాన్ ఇండియా మూవీ చేసిన ఘనత భానుమతికే దక్కింది.  ఈ సినిమాకు భానుమతి స్వయంగా కథను సమకూర్చడం విశేషం.

Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

ఇక నటన తర్వాత భానుమతి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. రచయిత్రిగా ‘అత్తగారి కథలు’, ‘నాలోనేను’ ఆమెకు రచయిత్రిగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక గాయనిగా ఆమె స్వరం విలక్షణమైనది. ఆమె గాత్రంలో మాధుర్యం ఉంటుంది. వగరు ఉంటుంది. అందుకే ఆమె పాటలు ఎప్పుడూ విన్నా మనసు మల్లెల మాలలూగుతున్నట్లు కనిపిస్తుంది.

భానుమతి (యూట్యూబ్ క్రెడిట్)


1960 నుంచి భానుమతి స్టార్ డమ్ తగ్గుతూ వచ్చింది. తన ప్రాభవం తగ్గిన ‘వివాహ బంధం’, ‘బొబ్బిలి యుద్ధం’ వంటి సినిమాల్లో కథానాయిక స్థాయి పాత్రలనే వేశారు భానుమతి. చలం నిర్మించిన ‘మట్టిలో మాణిక్యం’ సినిమాతో క్యారెక్టర్ నటిగా మారారు. ఆ తర్వాత ‘తాతమ్మకల’, ‘మంగమ్మగారి మనవడు’, ‘బామ్మ మాట బంగారుబాట’ వంటి చిత్రాల్లో వయసు మళ్లిన పాత్రలకు తన నటనతో హుందాతనాన్ని తీసుకొచ్చారు.

Happy Birthday Mammootty: హ్యాపీ బర్త్ డే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. ఆయన నట ప్రస్థానంలో కీలక ఘట్టాలు..


ఇక భానుమతికి వరించిన అవార్డులకు రివార్డులకు కొదువే లేదు. రాష్ట్ర ప్రభుత్వంచే సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ. కేంద్రం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 1983లో తమిళ నాడు ప్రభుత్వంచే కలైమామణి అవార్డు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య పురస్కారం తో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డులు భానుమతిని వరించాయి. నటిగా ఆమె చివరి చిత్రం జగపతిబాబు హీరోగా నటించిన ‘పెళ్లి కానుక’.

తాతమ్మ కల (ట్విట్టర్ ఫోటో)


ఎన్నెన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి, ప్రేక్షకుల మనసులను దోచుకొని, అభిమానుల గుండెల్లో నిలచిపోయిన నటి భానుమతి. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా సినిమా రంగంలో అన్ని పాత్రలను సమర్థవంతంగా పోషించారు. అన్నింటిలోను మెప్పించారు. విజయాలు అందుకున్నారు. రారాణిగా వెలుగొందారు. అందుకే ఆమె వ్యక్తిత్వం విలక్షణమైనది. భానుమతి మూర్తిభవించిన విజయం. మహిళ శక్తికి నిదర్శనం. తనకుతానే సాటి అనిపించుకున్న మేటినటి 2005 డిసెంబర్ 24న పరమపదించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published: