news18-telugu
Updated: November 18, 2020, 11:14 AM IST
నయనతార Photo : Twitter
Nayanthara : నయనతార... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే నయన్ తాజాగా తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. దీని పేరు 'నెట్రిక్కన్' (మూడో కన్ను). ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించి ఓ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా.. ఈరోజు నయనతార తన 36వ పుట్టినరోజును జరుపుకుంటోన్న సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ను చూస్తుంటే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. ఓ మర్డర్ మిస్టరీని నయనతార ఎలా చేధించింది అనేదే సినిమా కథగా వస్తోంది. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా. ఈ నెట్రికన్ను తెలుగులో కూడా దీనిని రిలీజ్ చేయనున్నారు.
అది అలా ఉంటే ‘మూకుత్తి అమ్మన్’ అనే మరో సినిమాలో నయనతార నటించింది. ఈ సినిమాలో నయన్ అమ్మవారి గెటప్‌లో అదరగొట్టింది. ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎప్పుడో సమ్మర్లో విడుదలకావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఇంత వరకూ సినిమా థియేటర్స్ ఓపెన్ కాకపోవడంతో ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీలో విడుదల చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా అమ్మోరు తల్లిగా హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
Published by:
Suresh Rachamalla
First published:
November 18, 2020, 11:08 AM IST