హోమ్ /వార్తలు /సినిమా /

Prashanth Varma | Hanuman Teaser : అదిరిన హనుమాన్ టీజర్.. ఈ రేంజ్ ఊహించలేదు..

Prashanth Varma | Hanuman Teaser : అదిరిన హనుమాన్ టీజర్.. ఈ రేంజ్ ఊహించలేదు..

Hanuman Teaser Twitter

Hanuman Teaser Twitter

Hanuman Movie Teaser: తేజ సజ్జా హీరోగా వస్తోన్న సూపర్ హీరో మూవీ హనుమాన్ (Hanuman). ఈ సినిమాను యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలై వావ్ అనిపించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రశాంత్ వర్మ.. (Prashanth Varma).. మొదటి సినిమా 'అ!' తోనే జాతీయ అవార్డు పొందిన టాలెంట్ ఉన్న యువ దర్శకుడు. అ సినిమా తర్వాత ఆయన రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ తన మూడో సినిమాగా 'జాంబీ రెడ్డి' (Zombie Reddy) తీశాడు. ఈ సినిమా కరోనా సమయంలో థియేటర్స్’లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మైథాలాజీకల్ సినిమా హనుమాన్ (Hanuman). ఈ సినిమా ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా వస్తోంది. ఇక ఈ మూవీ టీజర్‌ని (Hanuman teaser) నవంబర్ 21వ తేదీన విడుదల చేశారు. తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదలైన టీజర్ విషయానికి వస్తే.. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంచి విజువల్స్‌లో ఆసక్తికరంగానే కాకుండా టీజర్ క్వాలిటీ బాగుంది. చెప్పాలంటే ఈ టీజర్‌ను అద్భుతమైన దృశ్యాలతో నింపారు. ఇక ఈ సినిమాకు కెమెరామన్ శివేంద్ర కెమెరా, గౌరహరి సంగీతం అందించారు.

తేజ సజ్జా హీరోగా నటించగా.. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా కనిపించనుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలకపాత్రలో ఆకట్టుకోనుంది. హను మాన్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనుంది టీమ్. ఇక ఈ సినిమాను పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే.. తన తొలి సినిమా ‘అ’ తోనే అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకు జాతీయ అవార్డు సైతం అందుకున్నారు ప్రశాంత్ వర్మ. తన ఆ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ప్రధాన పాత్ర పోషించారు. నాని నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో తెలియజేసారు. ‘అ’ సినిమా తర్వాత రాజశేఖర్ (RajaSekhar) హీరోగా ‘కల్కి’ (Kalki) సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ పెద్దగా అలరించలేకపోయినా.. ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

First published:

Tags: Hanuman Movie, Tollywood news

ఉత్తమ కథలు