హోమ్ /వార్తలు /సినిమా /

Prashanth Varma: హనుమాన్ స్పెషల్ పోస్టర్.. మరో డిఫరెంట్ కథతో ప్రశాంత్ వర్మ రెడీ

Prashanth Varma: హనుమాన్ స్పెషల్ పోస్టర్.. మరో డిఫరెంట్ కథతో ప్రశాంత్ వర్మ రెడీ

Hanuman Movie News 18

Hanuman Movie News 18

Hanuman Movie: తేజ సజ్జ హీరోగా హనుమాన్ (Hanuman) సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు ప్రశాంత్ వర్మ. మొదటి భారతీయ సూపర్ హీరో చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. ఇప్పటికే ఈ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్’ను (Hanuman First Look) విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరో స్పెషల్ పోస్టర్ వదిలారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma). ఇటీవలే జాంబీ రెడ్డి (Zombie Reddy) సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ సారి అదే తేజ సజ్జ (Teja Sajja) హీరోగా హనుమాన్ (Hanuman) సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. మొదటి భారతీయ సూపర్ హీరో చిత్రాన్ని తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. ఇప్పటికే ఈ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్’ను (Hanuman First Look) విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరో స్పెషల్ పోస్టర్ వదిలారు.


ఈ రోజు తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తలపాగా చుట్టి ఎద్దులబండిపై వెళుతూ, ఒక గ్రామీణ కుర్రాడిగా కనిపించి ఆకట్టుకున్నారు తేజ సజ్జ. ఈ పోస్టర్ చూస్తుంటే మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని, ఇది కూడా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అని స్పష్టమవుతోంది.


ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. అనుదీప్ దేవ్, జయక్రిష్, హరి గౌర, కృష్ణ సౌరభ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.


తన తొలి సినిమా ‘అ’ తోనే అందరినీ ఆకట్టుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అంతేకాదు ఈ సినిమాకు జాతీయ అవార్డు సైతం అందుకున్నారు ప్రశాంత్ వర్మ. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ అతనికి మంచి పేరే తెచ్చిపెట్టింది. నాని నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ అప్పట్లో తెలియజేసారు. ‘అ’ సినిమా తర్వాత రాజశేఖర్ (RajaSekhar) హీరోగా ‘కల్కి’ (Kalki) సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ పెద్దగా అలరించలేకపోయినా.. ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తమన్నా హీరోయిన్‌గా ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఇప్పుడు హనుమాన్ అనే సినిమాతో మరో వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రశాంత్ వర్మ. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్, ఇతర వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

Published by:Sunil Boddula
First published:

Tags: Prashanth Varma, Tollywood, Tollywood Cinema

ఉత్తమ కథలు