హోమ్ /వార్తలు /సినిమా /

రామ్ చరణ్ మేకప్ వేసుకుంటుంటే.. వచ్చిన అనుకోని అతిథి ఎవరో తెలుసా?

రామ్ చరణ్ మేకప్ వేసుకుంటుంటే.. వచ్చిన అనుకోని అతిథి ఎవరో తెలుసా?

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టును చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో చెర్రీ మేకప్ వేసుకుంటూ ఉంటే.. అక్కడకు ఓ అనుకోని అతిథి ప్రత్యక్షమవుతోంది.

మన తెలుగు స్టార్ అయినా.. బాలీవుడ్ సెలబ్రిటీలు అయినా.. ఒక్కొక్కరి నమ్మకం ఒక్కోలా ఉంటుంది. మన తెలుగు హీరోలది ఒక్కొక్కరిది ఒక్కో సెంటిమెంట్. దేవుళ్ల విషయంలో కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు. మెగాస్టార్‌కు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, మహేశ్ బాబుకు శ్రీరాముడు అంటే ఇష్టం, ఇక మోహన్ బాబుకు సాయిబాబా, బాలకృష్ణకు నరసింహ స్వామి అంటే ఎంతో భక్తి. ఈ హీరోలు చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో కూడా ఇదే విషయాన్ని రుజువు చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా  చిరంజీవి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.

ఈ వీడియోలో రామ్ చరణ్  ఓ దగ్గర కూర్చొని మేకప్ వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడకు ఓ వానరం వచ్చింది. అది అలానే చరణ్ చూస్తూనే ఉంది. అక్కడ్నుంచి కదలకుండా చరణ్ చూస్తూనే ఉంది. రెండు కాళ్లపై నిలబడుతూ చరణ్ ఎదురుగానే నిల్చోంది. చరణ్‌నే చూస్త తలుపు దగ్గరే కూర్చొని ఉంది.  దీంతో చరణ్ తన మేకప్ వర్క్ కాస్త పక్కన పెట్టి... వానరంకు బిస్కెట్స్ తినిపించాడు. అది కూడా ఏంచెక్కా బిస్కెట్స్ తీసుకొని తినింది. ఈ వీడియోను అక్కడున్న వాళ్లు షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోను చిరంజీవి తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌ ఆంజనేయ స్వామి మంత్రాన్ని చెబుతూ ఎడిట్ కూడా చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ చిరు.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.


హనుమాన్ జయంతి సందర్భంగా చిరు చేసిన ఈ పోస్టుపై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కొందరు నమస్కారంతో కూడిన కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు వావ్ సూపర్ అంటూ... మెసేజులు పెడుతున్నారు. ఇక ప్రతీ ఏడాది చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమంతుని జన్మోత్సవాన్ని జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 16న అంటే శనివారం హనుమాన్ పుట్టినరోజును భక్తులను జరుపుకోనున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఆంజనేయస్వామి దేవాలయాల్లో హనుమాన్ జన్మోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. భాగ్యనగరం హైదరాబాద్‌లో కూడా హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా శోభా యాత్ర నిర్వహిస్తుంటారు. జై హనుమాన్ నినాదాలతో గల్లీలు మారుమోగనున్నాయి.

First published:

Tags: Megastar Chiranjeevi, Ram Charan

ఉత్తమ కథలు