హోమ్ /వార్తలు /సినిమా /

Hansika: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో త్వరలో ప్రసారం కానున్న ‘హన్సికాస్ లవ్ షాదీ డ్రామా’..

Hansika: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో త్వరలో ప్రసారం కానున్న ‘హన్సికాస్ లవ్ షాదీ డ్రామా’..

హన్సిక మోత్వానీ వెబ్ సిరీస్ (Twitter/Photo)

హన్సిక మోత్వానీ వెబ్ సిరీస్ (Twitter/Photo)

Hansika | తమిళంలో మాత్రం ఈమె స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. అక్కడ ఈమెకు గుడి కట్టేసారు. అక్కడ ఓ రేంజ్‌లో అదరగొట్టేసింది. ఇపుడు వెబ్ సిరీస్‌లో సత్తా చాటబోతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Hansika - Hansikas Love Shaadi Drama | భారతీయ సినిమాల్లో అందానికీ అభినయానికి గుర్తొచ్చే ఒక పేరు హన్సిక మోత్వానీ. గతేడాది డిసెంబర్ 4 న తన స్నేహితుడు సోహెల్ ఖటూరియా (Sohail) ని పెళ్లి (Marriage) చేసుకుంది.ఈమె  నిర్ణయం ఈమె  కోట్లాది యువ అభిమానుల హృదయాలను బద్దలుకొట్టింది హన్సిక. జైపూర్ లో ముందోట ఫోర్ట్ అండ్ పాలస్ లో ఆ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్లిద్దరి పెళ్లి అప్పట్లో పెద్ద సంచలనం అయింది. దేశ వ్యాప్తంగా ఈ పెళ్లి గురించి పెద్ద చర్చ జరిగింది. పత్రికల్లో ఈ పెళ్లి పతాక శీర్షికలకు ఎక్కింది.ఇప్పుడు మొట్టమొదటి సారిగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆ సందడికి సంబంధించిన కొన్ని నేపథ్య దృశ్యాల్ని అభిమానుల కోసం అందిస్తోంది. పండగలు, డ్రామా, ఎక్సయిట్మెంట్ ల సమ్మేళనంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రయత్నం చేస్తోంది.

హాట్ స్టార్ స్పెషల్ షో "హన్సికాస్ లవ్ షాదీ డ్రామా" అభిమానులకు కనువిందు చేయబోతోంది. హన్సిక తన పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడం దగ్గరనుంచి, కేవలం ఆరువారాల్లో అద్భుతంగా పెళ్లి జరగడానికి కష్టపడ్డ వెడ్డింగ్ ప్లానెర్స్, డిజైనర్లు, కుటుంబ సభ్యులు కాలానికి ఎదురీది ఎంత కష్టపడ్డారో, ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారో అన్నీ నిజంగా అద్భుతమైన కథలా రాబోతున్నాయి. హన్సిక పెళ్లి సంతోషాన్ని ఆవిరి చేసే ప్రయత్నంలో పెళ్ళికి ముందు వినిపించిన ఒక స్కాండల్ గురించి హన్సిక, తన కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు.హన్సిక తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ "హోస్ట్ స్టార్ స్పెషల్ షో" గురించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఎప్పుడు స్ట్రీమింగ్ మొదలయ్యేది త్వరలో ప్రకటించనున్నారు.

హ‌న్సిక‌.. ఈ పేరు త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు ఆమె అలా వ‌చ్చేస్తుంది. ఈ బొద్దందాల‌తోనే ఇండ‌స్ట్రీని షేక్ చేస్తుంది హ‌న్సిక‌. త‌మిళ‌నాట అయితే ఈమెకు ఏకంగా గ‌డి కూడా క‌ట్టేసారు అభిమానులు.తెలుగులో ఈ అమ్మడికి స్టార్ హీరోల సరసన సరైన అవకాశాలు రాలేదునే చెప్పాలి. ఎన్టీఆర్ కంత్రి మినహా పెద్ద హీరోల సరసన నటించలేదు. ఆ తర్వాతే హన్సిక కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. కందిరీగ లాంటి సినిమాలు విజయం సాధించినా కూడా హన్సిక కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. తమిళంలో మాత్రం ఈమె స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. అక్కడ ఈమెకు గుడి కట్టేసారు. అక్కడ ఓ రేంజ్‌లో అదరగొట్టేసింది. గతేడాది పెళ్లి చేసుకొని సెటిలైంది. ఇపుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతో నటిస్తోంది. మరి సినిమాల్లో అదుర్స్ అనిపించిన ఈమె వెబ్ సిరీస్‌లో కూడా సత్తా చాటుతుందా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Disney+ Hotstar, Hansika, Tollywood

ఉత్తమ కథలు