అవకాశాలు లేక అటువైపు అడుగులు వేస్తోన్న అల్లు అర్జున్ భామ..

Hansika Motwani : హ‌న్సిక‌.. ఈ పేరు త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు ఆమె అలా వ‌చ్చేస్తుంది.

news18-telugu
Updated: July 16, 2020, 1:07 PM IST
అవకాశాలు లేక అటువైపు అడుగులు వేస్తోన్న అల్లు అర్జున్ భామ..
హన్సిక Photo : Instagram
  • Share this:
Hansika Motwani : హ‌న్సిక‌.. ఈ పేరు త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు ఆమె అలా వ‌చ్చేస్తుంది. ఈ బొద్దందాల‌తోనే ఇండ‌స్ట్రీని షేక్ చేస్తుంది హ‌న్సిక‌. త‌మిళ‌నాట అయితే ఈమెకు ఏకంగా గ‌డి కూడా క‌ట్టేసారు అభిమానులు. అయితే తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందనుకున్న హన్సికా.. అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. అప్పట్లో ఓ ఊపు ఊపిన హన్సిక ఇప్పుడు మాత్రం స్టార్ డమ్ ను పక్కన పెట్టి అవకాశాలు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తన సోషల్ మీడియాలో హన్సిక అదిరిపోయే పిక్స్‌ను గ్లామర్ స్టిల్స్‌ను పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కూడా అడుగుపెట్టబోతుంది ఈ భాబ. అందులో భాగంగా భాగమతి దర్శకుడు జి. అశోక్ దర్శకత్వంలో రానున్న వెబ్ సిరీస్‌లో ఈ గ్లామర్ బ్యూటీ ఓ పాత్రలో కనిపించనుందట. ఈ వెబ్ సిరీస్‌ ఓ ప్రముఖ ఓటిటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో సమాజంలో మహిళలు రోజూ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించనున్నారట.
Published by: Suresh Rachamalla
First published: July 16, 2020, 1:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading