వ్యాపారవేత్త సరసన హన్సిక నటించనుందా?...క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Hansika Motwani | శరవణా స్టోర్స్ అధిపతి అరుళ్ హీరోగా త్వరలో తెరకెక్కనున్న చిత్రంలో తాను జోడిగా నటించనున్నట్లు వెలువడిన కథనాలపై హన్సిక క్లారిటీ ఇచ్చింది.

news18-telugu
Updated: October 2, 2019, 2:22 PM IST
వ్యాపారవేత్త సరసన హన్సిక నటించనుందా?...క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
హన్సిక మోత్వాని(ఫైల్ ఫోటో)
  • Share this:
చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,  శరవణా స్టోర్స్ అధిపతి అరుళ్ హీరోగా తెరకెక్కనున్న ఓ కొత్త సినిమాలో తాను జోడిగా నటించనున్నట్లు వెలువడిన కథనాలపై సినీ నటి హన్సికా మోట్వానీ క్లారిటీ ఇచ్చింది. చెన్నై టీ.నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో సరవణా స్టోర్స్ శాఖలు నిర్వహిస్తోంది.  శరవణా స్టోర్స్‌కి సంబంధించిన యాడ్స్‌లో దాని అధిపతి అరుళ్ స్వయంగా నటిస్తున్నారు.  ఇటీవల తమన్నా, హన్సికతో కలిసి రూపొందించిన ఓ యాడ్‌లోనూ అరుళ్ దర్శనమిచ్చాడు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా అరుళ్‌పై గతంలోనూ పలు విమర్శలు వచ్చినా...అతను ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

కాజల్, అరుళ్‌తో ఓ యాడ్‌లో హన్సిక


సినిమాలో హీరోగా నటించాలని అరుళ్ ఉవ్విళ్లూరుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. నడిగర్ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతను పాల్గొనడంతో అరుళ్ తెరంగేట్రంపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

నడిగర్ సంఘం కార్యక్రమంలో పాల్గొన్న శరవణా స్టోర్స్ అధిపతి అరుళ్. చిత్రంలో రజనీకాంత్ దంపతులు(ఫైల్ ఫోటో)
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు పూర్తయినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వినికిడి. ఈ నేపథ్యంలో అరుళ్ సరసన నటించేందుకు హన్సిక మోత్వానీ ఆమోదం తెలిపినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన హన్సిన...తాను అరుణ్ సరసన నటించనున్నట్లు మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టంచేసింది.

First published: October 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>