హోమ్ /వార్తలు /సినిమా /

Hansika: సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్.. హన్సిక 105 మినిట్స్.. బీ రెడీ ఫ్యాన్స్

Hansika: సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్.. హన్సిక 105 మినిట్స్.. బీ రెడీ ఫ్యాన్స్

Hansika 105 minutes (Photo News 18)

Hansika 105 minutes (Photo News 18)

Hansika Motwani 105 Minutes: సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా హన్సిక చేసిన సినిమా 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. ప్రస్తుతం తుది దశ పనుల్లో ఉన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా హన్సిక (Hansika) చేసిన సినిమా 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' (105 Minutes). రాజు దుస్సా (Raju Dussa) రచన దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకంపై ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్‌గా బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే చిత్ర ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ వర్క్స్ నడుస్తున్నాయి.

ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటు సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్ లో అంతే ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా.

రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి ప్రతి సన్నివేశంలో సగటు ప్రేక్షకుడు ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాడు అని చెబుతున్నారు మేకర్స్. చాలా తక్కువ డైలాగ్స్ తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రూపొందుతోందని అంటున్నారు. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశం లోనే తొలిసారిగా తెలుగులో చేయడం గొప్ప విషయం. ఈ చిత్రానికి ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్ గా షూట్ చేసి సి జీ వర్క్ యాడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ.

ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని చిత్రం బృందం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టెక్నికల్ గా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో చేసిన ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోతుందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాకు హన్సిక చాలా హెల్ప్ అయ్యారని, ఒక అదృశ్య శక్తి నుండి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా ప్రతి షాట్ లో అద్భుతమైన హావభావాలు పలికించారని చెప్పారు.

సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా హన్సిక కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. సినిమా చూశాక అందరి అభిప్రాయం ఇదే ఉంటుందని.. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రీ రికార్డింగ్ ప్రాణం అని అంటున్నారు. టెక్నికల్ గా ఎంతో రిచ్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి టెక్నీషియన్ చాలా బాగా అవుట్ పుట్ తీసుకొచ్చారని మేకర్స్ చెప్పారు.

First published:

Tags: Hansika motwani, Tollywood, Tollywood actress

ఉత్తమ కథలు