Home /News /movies /

HANDSOME HUNK RANA DAGGUBATI LAUNCHED MOTION POSTER OF RAJJEEV SALURI 11 11 PK

Rana Daggubati: రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదలైన 11:11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్..

11:11 సినిమా మోషన్ పోస్టర్ (11:11 motion poster)

11:11 సినిమా మోషన్ పోస్టర్ (11:11 motion poster)

Rana Daggubati: తెలుగు ఇండస్ట్రీలో 800 సినిమాలకు పైగా సంగీతం అందించి.. లెజెండ్ హోదా అందుకున్నారు కోటి. ఆయన తనయులు ఇద్దరూ ఒకరు నటుడిగా.. మరొకరు మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించడానికి ప్రయత్నిస్తున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో 800 సినిమాలకు పైగా సంగీతం అందించి.. లెజెండ్ హోదా అందుకున్నారు కోటి. ఆయన తనయులు ఇద్దరూ ఒకరు నటుడిగా.. మరొకరు మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 11: 11. ఈ సినిమాలో అలనాటి అందాల నటి వాణి విశ్వనాథ్ వారసురాలు వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్ కూడా ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. 11:11 సినిమాను టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరో దగ్గుబాటి రానా 11: 11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్‌లో కేవలం మూడు క్యారెక్టర్స్ చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు.

హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం లాంటి సీన్స్ ఈ వీడియోలో కనిపించాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌కి తోడు మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి. గతంలో ఈ 11: 11 చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసి చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మోషన్ పోస్టర్ విషయంలో రానా సపోర్ట్ దొరికింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలని రానా కోరుకున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్‌డేట్స్ ప్రకటించనున్నారు మేకర్స్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Rana daggubati, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు