Half Stories movie review: కరోనా కారణంగా సంక్రాంతికి రావాల్సిన భారీ సినిమాలన్నీ వాయిదా పడటంతో చాలా వరకు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఓ ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘హాఫ్ స్టోరీస్’. సంపూర్ణేష్ బాబు, రాజీవ్ సహా చాలా మంది నటులు ఇందులో ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి కూడా ఇందులో నటించాడు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హాఫ్ స్టోరీస్’ఎలా ఉందో చూద్దాం..
నటీనటులు: సంపూర్ణేష్ బాబు, రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కోటి, కంచరపాలెం రాజు, టీఎన్ఆర్ తదితరులు
సంగీతం : కోటి
సినిమాటోగ్రఫీ : చైతన్య కందుల
ఎడిటర్: సెల్వ కుమార్
నిర్మాణ సంస్థ: వెన్నెల క్రియేషన్స్
నిర్మాత: యం. సుధాకర్ రెడ్డి
దర్శకత్వం: శివ వరప్రసాద్ కె.
కరోనా కారణంగా సంక్రాంతికి రావాల్సిన భారీ సినిమాలన్నీ వాయిదా పడటంతో చాలా వరకు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఓ ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమే ‘హాఫ్ స్టోరీస్’. సంపూర్ణేష్ బాబు, రాజీవ్ సహా చాలా మంది నటులు ఇందులో ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి కూడా ఇందులో నటించాడు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హాఫ్ స్టోరీస్’ఎలా ఉందో చూద్దాం..
కథ:
హాఫ్ స్టోరీస్ అనేది టైటిల్లోనే ఉంది కథ. ఇది కొన్ని కారెక్టర్స్ మిక్స్ చేస్తే వచ్చిన కథ. అసిస్టెంట్ డెరెక్టర్‌గా పనిచేసే శివ(రాకెందు మౌళి) తన స్నేహితులు లక్ష్మీ (శ్రీజ), చిన్నా (రంగస్థలం మహేశ్) మధ్య జరిగే మోసాల నేపథ్యంలోనే ఈ కథ ముందుకు వెళ్తుంది. అక్కడ్నుంచి అనేక మలుపులు తిరుగుతుంది. బ్యాంక్ క్యాష్ వ్యాన్ ప్రమాదానికి గురవ్వడం.. ఆ డబ్బును కాజేయడానికి ముగ్గురు కూడా ఒకరికి తెలియకుండా మరొకర్ని మోసం చేసుకోవడం చేస్తుంటారు. అయితే అన్ని మలుపులు తిరిగిన తర్వాత ఆ బ్యాంక్ డబ్బులు ఎవరికి సొంతం అవుతాయి.. ఆ డబ్బును చేజిక్కుంచుకునే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.. ముగ్గురులో దెయ్యం ఎవరు.. అసలు ఈ కథలోకి సంపూర్ణేష్ బాబు ఎలా ఎంటర్ అయ్యాడు అనేది అసలు కథ..
కథనం:
టాలీవుడ్లో దెయ్యాల సినిమాలు కొత్త కాదు. ఇప్పటికీ వారానికో సినిమా వస్తుంటుంది ఈ కాన్సెఫ్ట్‌తో. అయితే అందులో కొన్ని డిఫెరెంట్ పాయింట్స్ ఉన్నపుడే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తుంటారు. అలా హార్రర్ కామెడీస్ చాలా వరకు హిట్ కూడా కొట్టాయి. ఇప్పుడు హాఫ్ స్టోరీస్ దర్శకుడు శివ వరప్రసాద్ కూడా ఇదే చేయాలనుకున్నాడు. తెలిసిన కథనే కాస్త కొత్త కథనంతో రాసుకోడానికి ప్రయత్నించాడు. వరస ట్విస్ట్‌లతో సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేసాడు. శివ అనే అప్‌కమింగ్ డైరెక్టర్ తన స్నేహితులకు స్టోరీ చెప్పడం.. అందులోనే మరో కథ.. అక్కడ్నుంచి ఇదంతా ఓ బాలుడు సినిమాగా చూడడం.. ఇలా స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. సినిమాలో మనుషులు ఎవరో.. దెయ్యాలెవరో చెప్పడం కూడా కష్టమే అవుతుంది. అయితే ప్రమోషన్ లేకపోవడం.. బడ్జెట్ సమస్యలు ఈ సినిమాను వెనక్కి లాగేసాయి. సినిమాలో క్లారిటీ లేక కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి కథను ముందుకు వెళ్లకుండా చేసాయి. సినిమాకు ఎంత ప్లస్ అయిందే.. అంతే మైనస్ అయింది కూడా. ఒకే సినిమాలో ఇన్ని ట్విస్టులు సగటు ప్రేక్షకుడికి మింగుడు పడవు. టైటిల్లో చెప్పినట్లు ఒక్కో స్టోరీని పూర్తిగా చూపించకుండా హాఫ్, హాఫ్‌గా చూపించి.. సగం సినిమా చూసినట్లే అనిపిస్తుంది. అక్కడ దర్శకుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఈ సినిమా థియేటర్ కంటే ఓటీటీలో బెటర్ ఆప్షన్ అయ్యుండేది. ఈ కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అయితే అదిరిపోయేది.
నటీనటులు:
ఇందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది యువ దర్శకుడు శివగా రాకెందు మౌళి నటన గురించి. మంచి నటనతో ఆకట్టుకున్నాడు ఈ కుర్రాడు. గౌతమ్‌గా రాజీవ్, చిన్నగా మహేష్ కూడా బాగా నటించారు. ఇక సినిమా రచయిత సంపూగా సంపూర్ణేష్ బాబు ఆకట్టుకున్నాడు. ఎస్సై శశికాంత్‌గా దివంతగ నటుడు టీఎన్ఆర్ ఆకట్టుకున్నాడు. అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీమ్:
సీనియర్ సంగీత దర్శకుడు కోటి సంగీతం ఆకట్టుకుంటుంది.రీ రికార్డింగ్ బాగుంది. చైతన్య కందుల సినిమాటోగ్రఫీ ఓకే. సెల్వ కుమార్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. దర్శకుడు శివ వరప్రసాద్ తన కథ కంటే ఎక్కువగా ట్విస్టులతో కన్ఫ్యూజన్ అయిపోయాడు. అయితే ఈయన టేకింగ్‌కు మాత్రం మంచి మార్కులు పడతాయి.
చివరగా ఒక్కమాట:
హాఫ్ స్టోరీస్.. టైటిల్‌కు తగ్గట్లుగానే సగం ఉడికిన కథ..
రేటింగ్: 2.5/5
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.