హోమ్ /వార్తలు /సినిమా /

హ్యాపీ బర్త్ డే బేబీ.. బాయ్‌ఫ్రెండ్‌కు గుత్తా జ్వాల స్వీట్ సర్‌ప్రైజ్..

హ్యాపీ బర్త్ డే బేబీ.. బాయ్‌ఫ్రెండ్‌కు గుత్తా జ్వాల స్వీట్ సర్‌ప్రైజ్..

ఇద్దరి ప్రేమ విఫలమైతే ఆ కష్టం ఎలా ఉంటుందో తెలిసిన వాళ్లే.. అందుకే ఇద్దరు ఒకర్ని ఒకరు బాగా అర్థం చేసుకోగలిగారు. వివాదాలు సంగతి ఎలా ఉన్నారు.. ఇద్దరూ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ప్రస్తుతం గుత్తా జ్వలా బ్యాడ్మింటన్ అకాడమీని నడుపుతోంది. ఇటు విష్ణు విశాల్‌ ఈ మధ్యే మూడు భాషల్లో విడుదలైన 'అరణ్య'లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు ఎఫ్‌ఐఆర్‌, మోహన్‌దాస్‌, ఇంద్రు నేత్రు నాలై 2 సినిమాల్లో నటిస్తున్నాడు.

Gutta Jwala Vishnu Vishal: ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అప్పట్లో ఆటతో.. ఆ తర్వాత అందంతో.. ఆ తర్వాత కాంట్రవర్సీలతో ఇప్పుడేమో..

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అప్పట్లో ఆటతో.. ఆ తర్వాత అందంతో.. ఆ తర్వాత కాంట్రవర్సీలతో ఇప్పుడేమో ప్రేమతో వార్తల్లో నిలిచింది గుత్తా. తాజాగా ఈమె ప్రేమలో ఉన్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేసింది. ఈమె ప్రముఖ తమిళ హీరో విష్ణు విశాల్‌తో డేటింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని లాక్‌డౌన్ మొదట్లోనే కన్ఫర్మ్ చేసింది గుత్తా. మొదట్లో కాదు మేం ఫ్రెండ్స్ అంటూ కవర్ చేసినా కూడా ఇప్పుడు మాత్రం విష్ణు విశాల్ నా బాయ్ ఫ్రెండ్ అంటూ కుండ బద్ధలు కొట్టింది గుత్తా జ్వాల.

హీరో విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల (Twitter/Photo)
హీరో విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల (Twitter/Photo)

సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ కలిసున్న ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. కరోనా కారణంగా ఒకరు చెన్నైలో.. మరొకరు హైదరాబాద్‌లో లాక్ అయిపోయారు. ఇలాంటి సమయంలో జులై 17న విష్ణు విశాల్ పుట్టిన రోజు సందర్భంగా సడన్‌గా అక్కడికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్ డే బేబీ అంటూ గుత్తా చేసిన పోస్ట్ వైరల్ అవుతుందిప్పుడు.

View this post on Instagram

Happiest birthday baby ❤️ Keep shining ☀️

A post shared by Jwala Gutta (@jwalagutta1) on

విష్ణు విశాల్‌తో తాను రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నానని.. కొవిడ్-19 వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ కారణంగా తామిద్దరం కలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని ఏప్రిల్‌లో జ్వాల చేసిన పోస్ట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రేయసి ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో విష్ణు కూడా షాక్ అయ్యాడు. ఈ ఇద్దరూ దిగిన ఫోటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Gutta Jwala, Telugu Cinema, Tollywood, Vishnu Vishal

ఉత్తమ కథలు