ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు మదన్ (Director Madan) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్(Hyderabad)లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మదన్‌కు చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.
మదన్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. డిగ్రీ వరకు చదువు అక్కడే చదువుకున్నారు. కాలేజీ రోజుల్లో నాటకాలు రాసి, దర్శకత్వ వహించేవారు. సినిమా రంగం మీద ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి మొదట చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. టీవీ కార్యక్రమాలు రూపొందించడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీశారు. మనసంతా నువ్వే, సంతోషం సినిమాల కోసం కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. అనంతరం కల్యాణ రాముడు, ఖుషీఖుషీగా చిత్రాలకు రచయితగా సేవలందించారు.
టాలీవుడ్లో మోహన్ బాబు , రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, ఉదయ్ కిరణ్, ఆది వంటి నటులతో ఆయన పనిచేశారు. రాజేంద్ర ప్రసాద్ సూపర్ హిట్ చిత్రం 'ఆ నలుగురు' సినిమాలో అద్భుతమైన డైలాగ్‌లను రాశారు. అనంతరం 'పెళ్లయిన కొత్తలో..' చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు దర్శకుడిగా పరిచమయ్యారు మదన్. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలను తెరకెక్కించారు. 2018లో వచ్చిన మోహన్ బాబు మూవీ 'గాయత్రి' ఆయన ఆఖరి సినిమా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood